కొద్దిరోజుల క్రితం బీజేపీలో చేరి గురుదాస్‌పూర్ నుంచి ఎంపీ సీటు దక్కించుకున్న సన్నీ డియోల్‌పై కాంగ్రెస్ నేతలు తమదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా గురుదాస్ పూర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ నేత రాజ్ కుమార్ చబ్బల్... సన్నీ డియోల్ లక్ష్యంగా సెటైర్లు వేశారు. బీజేపీ గురుదాస్ పూర్లో సన్నీ డియోల్ లేదా సన్నీ లియోన్‌ను పోటీలో పెట్టినా... విజయం మాత్రమే తమదే అని ఆయన కామెంట్ చేశారు. పలు సీట్లలో బీజేపీకి పోటీలో అభ్యర్థులు కూడా దొరకలేదని... అందుకే సన్నీ డియోల్ వంటి వారిని తీసుకొచ్చి పోటీ పెట్టారని ఆయన ఎద్దేవా చేశారు.
సన్నీ డియోల్ సినిమా డైలాగులు తప్ప... గురుదాస్ పూర్ ప్రజలకు ఏం చేస్తానో చెప్పడం లేదని కాంగ్రెస్ అభ్యర్థి సునీల్ జకర్ విమర్శించారు. కొద్దిరోజుల క్రితం సన్నీ డియోల్‌పై పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కూడా తనదైన స్టయిల్లో సెటైర్లు వేశారు. సన్నీడియోల్ కేవలం సినిమా సైనికుడు మాత్రమే అని... తాను నిజమైన సైనికుడిని అంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ హవాలో సన్నీడియోల్ కొట్టుకుపోవడం ఖాయమని అన్నారు. మొత్తానికి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బాలీవుడ్ స్టార్ సన్నీడియోల్‌ను కాంగ్రెస్ గట్టిగానే టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.