RSS - Infosys: ఇన్ఫోసిస్‌పై తీవ్రంగా విరుచుకుపడిన పాంచజన్య.. తమకు సంబంధం లేదన్న ఆరెస్సెస్.. అసలేం జరిగిందంటే..?

ప్రతీకాత్మక చిత్రం

దేశంలోని ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఇన్ఫోసిస్‌పై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌కు(Rashtriya Swayamsevak Sangh) అనుబంధ వారపత్రిక పాంచ‌జ‌న్య తీవ్ర స్థాయిలో విరుచుకుపడటం పెను దుమారం రేపింది.

  • Share this:
    దేశంలోని ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఇన్ఫోసిస్‌పై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌కు(Rashtriya Swayamsevak Sangh) అనుబంధ వారపత్రిక పాంచ‌జ‌న్య తీవ్ర స్థాయిలో విరుచుకుపడటం పెను దుమారం రేపింది. ఇన్ఫోసిస్‌ కంపెనీ రూపొందించిన ఐటీ, జీఎస్టీ పోర్టల్స్‌లో పలు లోపాలు తలెత్తడంపై పాంచజన్య(Panchjanya) పత్రిక తీవ్రమైన దాడికి దిగింది. పాంచజన్యలో ప్రచురితమైన కవర్ స్టోరి‌లో ఇన్పోసిస్‌పై తీవ్ర విమర్శలు చేసింది. Infosys 'Saakh Aur Aghaat'(ఘనకీర్తి.. అప్రదిష్ఠ) పేరుతో నాలుగు పేజీల స్టోరిని ప్రచురించింది. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి చిత్రాన్ని కవర్ పేజీపై ముద్రించారు. జీఎస్టీ పోర్టల్‌లో లోపాలు తలెత్తడంతో.. దేశ ఆర్థిక వ్యవస్థపై పన్ను చెల్లింపుదారుల నమ్మకం దెబ్బతిందని పేర్కొంది. ఈ లోపాల ఆధారంగా జాతివ్యతిరేక శక్తులు భారత ఆర్థిక ప్రయోజనాలు దెబ్బ తీస్తే ఎలాగని ప్రశ్నించింది.

    ఇన్ఫోసిస్‌(Infosys) పేరు గొప్ప, ఊరు దిబ్బ అంటూ విరుచుకుపడింది. ఇన్ఫోసిస్ సంస్థ కావాలనే న‌క్స‌ల్స్‌, వామ‌ప‌క్ష‌వాదులు, తుక్డే తుక్డే గ్యాంగ్‌కు స‌హ‌క‌రిస్తోంద‌ని తీవ్ర ఆరోప‌ణ‌లు చేసింది. ఈ ఆరోపణలకు తమ వద్ద బలమైన ఆధారాలు లేవని కూడా స్పష్టం చేశారు. ఇన్ఫోసిస్ తన విదేశీ ఖాతాదారులకు ఇదే విధమైన నీచమైన సేవను అందిస్తుందా..? అని ప్రశ్నించింది.

    గన్స్‌తో దొంగల బీభత్సం.. ముగ్గురు దుండగులు పట్టపగలే షాప్‌లోకి దూరి.. CCTVలో దృశ్యాలు..

    అయితే ఇన్ఫోసిస్ లక్ష్యంగా చేసుకుని పాంచజన్య ప్రచురించిన కథనం పెద్ద దుమారం రేపింది. పాంచజన్యలో(Panchjanya) చేసిన విమర్శలను చాలా మంది తప్పుబట్టారు. ఎంతో పేరున్న కంపెనీపై ఈ విధమైన ఆరోపణలు చేయడం ఏమిటని విరుచుకుపడ్డారు.







    అయితే పాంచజన్యలో కథనం ప్రచురితమైన మ‌రుసటి రోజే ఈ వివాదంతో త‌మ‌కు ఎలాంటి సంబంధం లేద‌ని ఆరెస్సెస్ ప్రకటించింది. ఈ మేరకు ఆరెస్సెస్ ఆలిండియా పబ్లిసిటీ ఇన్‌చార్జ్ సునీల్ అంబేకర్ (Sunil Ambekar) స్పందిస్తూ.. ఒక భారతీయ కంపెనీగా దేశ పురోగతిలో ప్రధాన సహకారం అందించిందని తెలిపారు. ఇన్ఫోసిస్ నిర్వహిస్తున్న పోర్టల్‌లో కొన్ని సమస్యలు ఉండవచ్చు.. కానీ ఈ సందర్భంలో పాంచజన్య‌లో ప్రచురించిన కథనం రచయిత వ్యక్తిగత అభిప్రాయాన్ని మాత్రమే ప్రతిబింబిస్తుందని అన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. పాంచజన్య అనేది ఆర్‌ఎస్‌ఎస్ మౌత్ పీస్ కాదని చెప్పారు. అందులో ప్రచురితమైన ఆర్టికల్స్, అభిప్రాయాలతో సంఘ్‌కు సంబంధం లేదని పేర్కొన్నారు. ఇక, ఇన్ఫోసిస్ జీఎస్టీ, ఐటీ పోర్టళ్లలో తలెత్తడంతో.. వీటిని అధిగ‌మించ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం ఈ నెల 15 వ‌ర‌కూ ఆ సంస్థ‌కు గ‌డువు విధించింది.
    Published by:Sumanth Kanukula
    First published: