హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

పాలు అమ్మినోడే పాలకుడు..హిమాచల్ ప్రదేశ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన సుఖ్వీందర్‌ సింగ్‌

పాలు అమ్మినోడే పాలకుడు..హిమాచల్ ప్రదేశ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన సుఖ్వీందర్‌ సింగ్‌

సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన సుఖ్విందర్ సింగ్ సుఖు

సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన సుఖ్విందర్ సింగ్ సుఖు

Himachal Pradesh CM : కొద్ది రోజుల క్రితం జరిగినహిమాచల్ ప్రదేశ్(Himachal pradesh) అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ(Congress) విజయం సాధించిన విషయం తెలిసిందే. మొత్తం 68 స్థానాలకుగాను కాంగ్రెస్ పార్టీ 40 స్థానాల్లో విజయం సాధించింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Sukhwinder Singh Sukhu : కొద్ది రోజుల క్రితం జరిగిన హిమాచల్ ప్రదేశ్(Himachal pradesh) అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ(Congress) విజయం సాధించిన విషయం తెలిసిందే. మొత్తం 68 స్థానాలకుగాను కాంగ్రెస్ పార్టీ 40 స్థానాల్లో విజయం సాధించింది. దీంతో హిమాచల్‌ పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ ఛైర్మన్‌ గా ఉన్న సుఖ్వీందర్‌ సింగ్‌ సుఖు(Sukhwinder Singh Sukhu) పేరును సీఎం అభ్యర్థిగా కాంగ్రెస్‌ అధిష్ఠానం శనివారం రాత్రి ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ సుఖ్విందర్ సింగ్ సుఖు హిమాచల్ ప్రదేశ్ సీఎం(Himachal pradesh CM)గా ప్రమాణస్వీకారం చేశారు. ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు సిమ్లాలో గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్‌ అర్లేకర్ ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం మాజీ సీఎల్పీ నేత ముఖేశ్‌ అగ్నిహోత్రి చేత ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించారు. రాజ్‌భవన్‌లో జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, అగ్ర నేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకా గాంధీ, కేంద్ర మంత్రి ఆనంద్‌ శర్మ, రాజస్తాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్, ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్‌ బఘేల్‌, హిమాచల్ ప్రదేశ్‌ పీసీసీ చీఫ్‌ ప్రతిభా వీరభద్రసింగ్, రాజస్థాన్‌ కాంగ్రెస్ నేత సచిన్‌ పైలట్‌ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

Ayodhya Photos : అత్యాధునికంగా అయోధ్య.. భక్తుల కోసం ఎలక్ట్రిక్ వాహనాలు

ప్రమాణ స్వీకారానికి కొద్దిసేపటి ముందు సుఖ్విందర్ సింగ్ సుఖు తన తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు. ఇంటి నుంచి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి బయలుదేరుతూ తల్లికి పాదాభివదనం చేశారు. ఈ సందర్భంగా ఆమె కొడుకు సుఖ్విందర్‌కు తన ఆశీర్వచనాలు అందించారు. సుఖ్విందర్ తల్లి మాట్లాడుతూ.. తన కొడుకు ఒక డ్రైవర్ కొడుకని, ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడం అంటే మామూలు విషయం కాదని అన్నారు. ముఖ్యమంత్రిగా తన కొడుకు ఎన్నో మంచి పనులు చేస్తాడని ఆమె తెలిపారు.

సుఖ్వింద‌ర్ సింగ్ ది సాధార‌ణ కుటుంబ‌మే.. ఆయ‌న తండ్రి రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ‌లో డ్రైవ‌ర్ గా ప‌ని చేశారు. కాగా సుఖ్విందర్.. చదువుకునే రోజుల్లో పాలు అమ్మారు. ఛోటా సిమ్లాలో ఓ పాల బూత్ ను నిర్వహించారు. 1964 మార్చి 27న పుట్టిన సుఖ్విందర్ సింగ్ సుఖు హిమాచల్ ప్రదేశ్ యూనివర్శిటీ నుంచి ఎంఏ, ఎల్ఎల్ బీ పూర్తిచేశారు. విద్యార్థి దశలో ఎన్ఎస్ యూఐలో చురుకుగా వ్యవహరించారు. సుఖ్విందర్ సింగ్ పదిహేడేళ్ల వయసులో సాధారణ కార్యకర్తగా సుఖ్విందర్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.సిమ్లా మున్సిపల్ కార్పొరేషన్ కు రెండు సార్లు కౌన్సిలర్ గా కూడా సుఖ్విందర్ సేవలందించారు. అంచెలంచెలుగా ఎదిగారు. తర్వాత యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారు. హామిర్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌లోని నాదౌన్‌‌‌‌ నుంచి 2003లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇటీవలి ఎన్నికల్లో ఐదోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2008లో పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా, 2013 నుంచి 2019 దాకా హెచ్‌‌‌‌పీసీసీ చీఫ్‌‌‌‌గా ఉన్నారు.

First published:

Tags: Congress, Himachal Pradesh

ఉత్తమ కథలు