చెన్నైలో వానలు... ఏపీ, తెలంగాణకు వర్ష సూచన...

Chennai Rains : తమిళనాడులో వాతావరణం ఒక్కసారిగా మారింది. ఉన్నట్టుండి భారీ వాన పడటంతో... ప్రజలు ఎండల నుంచి ఉపశమనం పొందారు.

news18-telugu
Updated: April 26, 2020, 7:11 AM IST
చెన్నైలో వానలు... ఏపీ, తెలంగాణకు వర్ష సూచన...
రేపు దక్షిణ కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.(credit - twitter - venkatesh kannan)
  • Share this:
Chennai Rains : వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో అంచనాలకు అందట్లేదు. ఈమధ్య కరోనా వైరస్ వల్ల... ప్రపంచవ్యాప్తంగా వాతావరణ కాలుష్యం తగ్గడంతో... భూమి ఉపరితలంపై వేడి తగ్గి... వాతావరణం చల్లబడి... అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు పడగా... ఇప్పుడు చెన్నైలో భారీ వానలు కురుస్తున్నాయి. ఈదురు గాలులతో వస్తున్న ఈ వానల్ని అక్కడి ప్రజలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మార్చి, ఏప్రిల్‌లో విపరీతమైన ఎండల్ని చూసిన ప్రజలు... ఇప్పుడు వానలో తడుస్తూ... ఉపశమనం పొందుతున్నారు. తమ ఏరియాల్లో వాన దృశ్యాల్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు.

ఇలా అకాల వర్షాలు కురవడానికి ప్రత్యేక కారణాలేవీ కనిపించట్లేదు. అటు అరేబియా, ఇటు బంగాళాఖాతంలో ఏర్పడుతున్న చిన్న చిన్న ఆవర్తనాలు, అల్పపీడనాలకు తోడు... వాతావరణంలో వస్తున్న మంచి మార్పులు కూడా వానలు కురిసేందుకు కారణం అవుతున్నాయి.


మహారాష్ట్రలోని విదర్భ పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం... శనివారం ఛత్తీస్‌గఢ్ మీద కేంద్రీకృతమైంది. దాని వల్ల శనివారం ఉత్తరకోస్తాలో వర్షాలు కురిశాయి. వచ్చే 24 గంటల్లో కూడా కోస్తా, రాయలసీమలో వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి.


విదర్భలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావం తెలంగాణపైనా పడింది. ఆకాశం మబ్బులతో నిండింది. అందువల్ల ఆదివారం అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు చెబుతున్నారు. అదే సమయంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతాయని కూడా చెబుతున్నారు.Published by: Krishna Kumar N
First published: April 26, 2020, 7:11 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading