SUBHASH CHANDRA BOSE WHAT NETAJI WROTE IN HIS RESIGNATION LETTER TO ICS TRENDING RESIGNATION LETTER IN SOCIAL MEDIA EVK
Subhash Chandra Bose: ఐసీఎస్‌కు రాజీనామా లేఖలో నేతాజీ ఏం రాశారు.. ట్రెండింగ్‌గా రాజీనామా లేఖ!
సుభాష్ చంద్రబోస్ (Image: Getty Images)
Subhash Chandra Bose Resignation Letter | నేతాజీ సుభాష్ చంద్రబోస్125 జయంతి జనవరి 23, 2022న దేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేశంలో చాలా మంది తమన అభిమానాన్ని చాటుకొనేలా కార్యక్రమాలు నిర్వహించారు. అయితే ఆయన జయంతి సందర్భంగా ఈ ఏడాది సుభాష్ చంద్రబోస్ సివిల్ సర్వీస్‌కు రాజీనామా చేసిన లెటర్ ఫోటో కాపీ ఇప్పుడు ట్రెండింగ్‌గా మారింది.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ (Subhash Chandra Bose) 125 జయంతి జనవరి 23, 2022న దేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేశంలో చాలా మంది తమన అభిమానాన్ని చాటుకొనేలా కార్యక్రమాలు నిర్వహించారు. సోషల్ మీడియాలో అయితే సుభాష్ చంద్రబోస్ చెప్పిన మాటలు, వీడియోలు ఫోటోలు చాలా ట్రెండ్ అయ్యాయి. అయితే ఆయన జయంతి సందర్భంగా ఈ ఏడాది సుభాష్ చంద్రబోస్ సివిల్ సర్వీస్‌కు రాజీనామా చేసిన లెటర్ ఫోటో కాపీ ట్రెండ్ అయ్యింది. దేశ వ్యాప్తంగా ఆయన అభిమానులు ట్విట్టర్ (Twitter) లో ఈ కాపీని తెగ షేర్ చేశారు. ఏప్రిల్ 22, 1921 నాటి లేఖను బోస్ తన 24 సంవత్సరాల వయస్సులో రాశారు. ఇది ఆ సమయంలో రాష్ట్ర కార్యదర్శి ఎడ్విన్ మోంటాగుకు ఈ లేఖ రాశారు.
ఇండియన్ సివిల్ సర్వీస్ పరీక్షలో 4వ ర్యాంక్..
ఇండియన్ సివిల్ సర్వీస్‌లోని ప్రొబేషనర్ల జాబితా నుండి తన పేరును తొలగించాలని నేతాజీ మోంటాగ్ని కోరుతూ, తన రాజీనామాను ఆమోదించిన తర్వాత, 100 పౌండ్ల భత్యాన్ని భారత కార్యాలయానికి తిరిగి ఇస్తానని లేఖలో నేతాజీ ఈ లేఖలో పేర్కొన్నారు.
On April 22, 1921 Subhash #Bose resigned from Indian Civil Service to participate in Freedom struggle. For a greater cause.
He was 24 years old then. His original resignation letter from service. Tribute on his birth anniversary. pic.twitter.com/Sm9oQ9NIy7
"ఇండియన్ సివిల్ సర్వీస్ (Indian Civil Service) లోని ప్రొబేషనర్ల జాబితా నుండి నా పేరు తొలగించబడాలని నేను కోరుకుంటున్నాను.. నేను ఇప్పటి వరకు వంద పౌండ్ల భత్యాన్ని పొందాను, నా రాజీనామాను ఆమోదించిన వెంటనే ఆ మొత్తాన్ని నేను భారతదేశ కార్యాలయానికి పంపుతాను" బోస్ లేఖలో రాశారు. చరిత్రకారుడు లియోనార్డ్ ఎ గోర్డాన్ యొక్క పుస్తకం బ్రదర్స్ ఎగైనెస్ట్ ది రాజ్: ఎ బయోగ్రఫీ ఆఫ్ ఇండియన్ నేషనలిస్ట్స్ శరత్ మరియు సుభాస్ చంద్రబోస్ ప్రకారం, ఆగస్టు 1920లో జరిగిన పోటీ ICS పరీక్షలో నేతాజీ నాల్గవ స్థానంలో నిలిచారు.
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) అధికారి పర్వీన్ కస్వాన్ నేషనల్ ఆర్కైవ్స్ ఇండియా నుంచి సేకరించిన దాని కాపీని షేర్ చేసిన తర్వాత లేఖ ట్విట్టర్లో పంచుకొన్నారు. ఆయన లేఖను ట్వీట్ చేస్తూ, కస్వాన్ ఇలా వ్రాశాడు, “ఏప్రిల్ 22, 1921న స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనేందుకు సుభాష్ బోస్ ఇండియన్ సివిల్ సర్వీస్‌కు రాజీనామా చేశారు. ఒక గొప్ప కారణం కోసం" అని రాసుకొచ్చారు.
ట్రెండింగ్‌గా ట్వీట్..
ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియా (Social Media) లో చక్కర్లు కొడుతుంది. సుభాష్ చంద్రబోస్ ధైర్యాన్ని, త్యాగాన్ని పొగుడుతూ జనం కామెంట్లు పెడుతున్నారు. మాతృభూమిని బ్రిటీష్ పాలన నుంచి విముక్తి చేయడానికి గొప్ప కారణం కోసం ఇటువంటి నిర్ణయం తీసుకోగలడు అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.