టిక్‌టాక్‌లో ఎస్ఐ హంగామా.. పోలీసు స్టేషన్‌లోనే..

ప్రపంచంలోని చాలా దేశాలు.. టిక్‌టాక్ యాప్‌ను నిషేధించాయి. టిక్‌టాక్‌లో వీడియోలు పోస్టు చేస్తూ ప్రాణాలు, ఉద్యోగాలు పొగొట్టుకున్నవారు అధిక సంఖ్యలోనే ఉన్నారు.

news18-telugu
Updated: June 26, 2020, 9:21 AM IST
టిక్‌టాక్‌లో ఎస్ఐ హంగామా.. పోలీసు స్టేషన్‌లోనే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
టిక్‌టాక్ యాప్ ఇదో వ్యసనం. ఇప్పటికే ఈ యాప్ వల్ల జరిగిన అనర్థాలు అన్నీఇన్నీకావు. మొదట్లో టైమ్ పాస్‌గా మొదలు పెట్టి.. చివరకు అది లేకుంటే పిచ్చెక్కిపోయేంతగా మారుతున్నారు. ప్రపంచంలోని చాలా దేశాలు.. టిక్‌టాక్ యాప్‌ను నిషేధించాయి. టిక్‌టాక్‌లో వీడియోలు పోస్టు చేస్తూ ప్రాణాలు, ఉద్యోగాలు పొగొట్టుకున్నవారు అధిక సంఖ్యలోనే ఉన్నారు. అయితే ఈ కోవలోకి చెందిన ఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది. అనునిత్యం అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు భద్రత కల్పించాల్సిన ఓ ఎస్ఐ విధుల్లో ఉండగానే టిక్‌టాక్ వీడియోల్లో మునిగి తేలుతున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. చెన్నై సెక్రటేరియట్ కాలనీ పోలీసు స్టేషన్‌లో ఎస్ఐగా కల్యాణ సుందరం(53) పనిచేస్తున్నారు.

ఇతడు టిక్‌టాక్‌లో మహిళలతో డబుల్ మినింగ్ సంభాషణలతో వందలాది వీడియోలను అప్‌లోడ్ చేశారు. 2019 ఏప్రిల్ నెల నుంచి మహిళలతో సాంగ్స్ పాడడం, డ్యాన్స్ చేయడం వంటి వీడియోలను టిక్‌టాక్‌లో పోస్టు చేశారు. ఇవన్నీ డబుల్ మినింగ్ ఉంటాయి. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో ప్రస్తుతం రోజుకు సగటున 20కి పైగా వీడియోలను టిక్‌టాక్‌లో పోస్టు చేశారు. అయితే ఈ వీడియోలన్నీ పోలీసు స్టేషన్ లోపల చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై పోలీసు సిబ్బంది సైతం అసంతృప్తి చెందినట్టు సమాచారం.

అంతేగాక గతంలోనూ ఈ ఎస్ఐ అనేకసార్లు ఉన్నతాధికారులతో మందలింపులకు గురయ్యాడని తెలుస్తోంది. విధుల్లో ఉన్న సమయంలో తరచూ ఫోన్‌లోనే మాట్లాడేవాడని పలువురు పేర్కొంటున్నారు. పోలీసు వృత్తికే బ్యాడ్ నేమ్ తీసుకొచ్చేలా వ్యవహరిస్తున్న ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
First published: June 26, 2020, 9:21 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading