మోదీ సర్కారు గుడ్ న్యూస్...కేవలం నెలకు రూ.1000 అద్దెతో పేదలకు ఇళ్ల పథకం

కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూర్చే ఈ సరసమైన అద్దె గృహనిర్మాణ పథకం కింద, వివిధ వర్గాలకు నెలకు ఒకటి నుంచి మూడు వేల రూపాయల అద్దెకు ఇళ్ళు అందించనున్నారు. ఈ పథకం కోసం కేంద్ర గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ (Ministry of Housing and Urban Affairs)రూ.700 కోట్ల రూపాయల ప్రాథమిక అంచనా వేసింది.

news18-telugu
Updated: June 21, 2020, 1:22 PM IST
మోదీ సర్కారు గుడ్ న్యూస్...కేవలం నెలకు రూ.1000 అద్దెతో పేదలకు ఇళ్ల పథకం
ప్రధాని నరేంద్ర మోదీ (File)
  • Share this:
భవన నిర్మాణ కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు, వలస కూలీలు వంటి ఇతర చిన్న తరహా పరిశ్రమల్లో పనిచేసే వ్యక్తుల కోసం, కేంద్ర ప్రభుత్వం త్వరలో అద్దె గృహనిర్మాణ పథకాన్ని ప్రవేశపెట్టవచ్చనే వార్తలు వస్తున్నాయి. అయితే విద్యార్థులు కూడా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతారు. కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూర్చే ఈ సరసమైన అద్దె గృహనిర్మాణ పథకం కింద, వివిధ వర్గాలకు నెలకు ఒకటి నుంచి మూడు వేల రూపాయల అద్దెకు ఇళ్ళు అందించనున్నారు. ఈ పథకం కోసం కేంద్ర గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ (Ministry of Housing and Urban Affairs)రూ.700 కోట్ల రూపాయల ప్రాథమిక అంచనా వేసింది.

ఈ పథకం కింద జవహర్‌లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యూవల్ మిషన్ (JNNURM), రాజీవ్ ఆవాస్ యోజన (RAY) కింద ఖాళీగా ఉన్న 1 లక్ష హౌజింగ్ యూనిట్లను ఉపయోగించాలని మోడీ ప్రభుత్వం యోచిస్తోంది. ఇదిలా ఉంటే మోదీ ప్రభుత్వం వలస కూలీలకు అందించాలని కోరుకుంటుందని న్యూస్ వెబ్‌సైట్ ది ప్రింట్ తెలిపింది. ఈ పథకం గురించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మే 14 న ప్రకటించారు.

పథకం ముసాయిదా ప్రకారం, వివిధ వర్గాల అద్దెను నెలకు రూ .1,000 నుంచి 3,000 రూపాయల మధ్య నిర్ణయించినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇందులో నిర్మాణ పనులు, శ్రమ మరియు అసంఘటిత రంగంలో పనిచేసే ఇతర వ్యక్తులు ఉంటారు. ఈ పథకం కింద విద్యార్థులకు తక్కువ రేటుతో నివసించడానికి ఇల్లు కూడా కేటాయించారు. అయితే గత వారం ప్రచురించిన ఈ నివేదికలో, ఆయా వర్గాల అర్హతపై తుది నిర్ణయం తీసుకోలేదని మంత్రిత్వ శాఖ అధికారులు పేర్కొన్నారు.

గృహాలు నిర్మించిన కంపెనీలకు ప్రోత్సాహకాలు...
అద్దె గృహనిర్మాణ పథకానికి క్యాబినెట్ నోట్ సిద్ధం చేసినట్లు శనివారం CNBC ఆవాజ్ ఓ వార్తను ప్రసారం చేసింది. ఈ క్యాబినెట్ నోట్‌ను హౌసింగ్ మంత్రిత్వ శాఖ ఆమోదించినట్లు ఆ వార్తలో తెలిపారు. ఇప్పుడు ఈ ప్రతిపాదనకు తుది ఆమోదం కోసం కేబినెట్‌కు పంపుతారు. ఈ పథకం కింద, కంపెనీలు తమ భూమిపై అద్దె గృహ ప్రాజెక్టుకు ప్రోత్సాహకాలు పొందుతారు.

వివిధ నగరాల్లో 75 వేల యూనిట్ల నిర్మాణానికి ప్రతిపాదన
అద్దె గృహనిర్మాణ పథకం కింద పిపిపి మోడల్‌పై అద్దె గృహ ప్రాజెక్టులను నిర్మిస్తామని సిఎన్‌బిసి ఆవాజ్ నివేదిక పేర్కొంది. VGF అనగా విబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద కూడా ప్రాజెక్టులు చేయనున్నట్లు ఒక మూలం తెలిపింది. దీని కోసం, PMAY అర్బన్ హౌసింగ్ అనగా PMAY అర్బన్ స్కీమ్ కింద నిధులు అందించవచ్చు. మొదటి దశలో వివిధ నగరాల్లో సుమారు 75000 యూనిట్లను నిర్మించాలని ప్రతిపాదించబడింది. ఈ పథకం కింద, కంపెనీలు తమ భూమిపై అద్దె గృహ ప్రాజెక్టులు నిర్మిస్తే ప్రోత్సాహకాలు ఇస్తామని సైతం కేంద్రం ప్రకటించనుంది.
First published: June 21, 2020, 1:20 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading