Exam dress code : స్టూడెంట్‌కు షాక్... పొట్టి డ్రస్ వేసుకుందని ఇలా చేశారు.. !

స్టూడెంట్‌కు షాక్... షాట్ వేసుకుందని ఎంట్రన్స్‌కు అనుమతి నిరాకరణ.

Exam dress code : షాట్ వేసుకుని వచ్చిన ఓ విద్యార్థినికి ఎంట్రన్స్ పరీక్ష రాసేందుకు అధికారులు అనుమతి ఇవ్వలేదు.. దీంతో కొత్త డ్రెస్ కోసం ఆమె తండ్రి ఉరుకులు పరుగులు పెట్టగా.. తోటి విద్యార్థులు స్పందించి కాలేజీ ఓ కర్టైన్ ఇవ్వడంతో అది కప్పుకుని విద్యార్థిని పరీక్షకు హజరైంది.

  • Share this:
    విద్యార్థులు (student)పరీక్షలు రాయలంటే అనేక ఆంక్షలు.. విద్యార్థినిలకు అయితే ఇవి మరింత కట్టుదిట్టంగా ఉంటున్నాయి.. చివరికి పెళ్లయిన స్త్రీలు(woman) తాళీని కూడా తీయనిదే పరీక్ష హలులోకి అనుమతి ఇవ్వని నిబంధనలు తీసుకువచ్చారు. అయితే ఇలాంటీ నిబంధనలు రానురాను మరింత కఠినమవుతున్నాయి. పరీక్ష(exam) రాసేటప్పుడు అనేక నిబంధనలను ఖచ్చితంగా అమలు చేస్తున్నారు. విద్యార్థుల విషయంలో చూసి చూడనట్లు వదలి వేయాల్సిన అధికారులు మరింత కఠినంగా వ్యవహరిస్తుండడంతో వివాదస్పదమువుతున్నాయి.

    ఈ క్రమంలోనే అసోంలో ఓ విద్యార్థినికి ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది. అసోంకు చెందిన వ్యవసాయ యూనివర్శిటి ఎంట్రన్స్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షను రాసేందుకు రాష్ట్రానికి చెందిన తములి అనే విద్యార్థిని స్థానిక గిరిజానంద చౌదరీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనెజ్‌మెంట్‌లో పరీక్షకు హజరైంది. తములి మాములు డ్రస్‌లో కాకుండా షాట్ తో పాటు టీషర్ట్ పై వెళ్లింది. అయితే ముందుగా లోపలికి అనుమతించిన నిర్వహాకులు హాలులోకి మాత్రం అనుమతి ఇవ్వలేదు. కారణం ఏంటని ప్రశ్నిస్తే .. డ్రస్ కోడ్ లేదని చెప్పారు.షాట్ వేసుకుంటే అనుమతి లేదని స్పష్టం చేశారు. బట్టలు మార్చుకుని వస్తే గాని హాలులోకి అనుమతి లేదని చెప్పారు.

    ఇది చదవండి : సైదాబాద్ నిందితుడు రాజు మృతిపై న్యాయ విచారణ.. ఆత్మహత్యేనని చెప్పిన డీజీపీ


    దీంతో తములి ఆందోళన వ్యక్తం చేసింది. డ్రెస్ కోడ్‌పై(dress code) ఎలాంటీ నిబంధలు లేవని అయినా తనను ఆపడం పై అభ్యంతరం వ్యక్తం చేసింది. కాని కాలేజీ యాజమాన్యం మాత్రం వినలేదు. దీంతో చేసేదేమి లేక పరీక్షకు ఆలస్యం అవుతుండడంతో తన తండ్రికి ఫోన్ చేసిన తములి వేరే డ్రస్ తేవాలని చెప్పింది.

    కాని ఈలోగా పరీక్షకు ఆలస్యం అవుతుండడంతో ఆమెతో పాటు ఉన్న తోటి విద్యార్థులు స్పందించారు. కాలేజిలోని ఓ కర్టెన్‌ తీసుకుని వచ్చి ఆమె ఇచ్చారు. దీంతో ఆ కర్టెన్ చుట్టుకోవడంతో పరీక్షకు అనుమతి ఇచ్చారు. అయితే పరీక్ష పూర్తయిన తర్వాత తములి ఆగ్రహం వ్యక్తం చేసింది. పొట్టి బట్టలు వేసుకుంటే పరీక్షకు అనుమతించమని నిబంధనల్లో పేర్కోనలేదని వాగ్వావాదానికి దిగింది. గతంలో ఇలాంటి అవమానాలు ఎప్పుడు ఎదురు కాలేదని ఆవేదన వ్యక్తం చేసింది.

    ఇది చదవండి : మాకు అధికారం ఖాయం.. విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తాం


    మొత్తం మీద విద్యార్థిని పరీక్ష రాసిన మహిళల డ్రెసింగ్ పై పరీక్షల్లో వివక్ష కొనసాగడంపై విమర్శలు చెలరేగుతున్నాయి. పరీక్షకు ఎలాంటీ మాస్ కాపియింగ్ చర్యలు తీసుకోవాల్సిన అధికారులు డ్రసింగ్ ఆభరణాలు కూడా ధరించకుండా రావాలని నిబంధనలు పెట్టడడంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటీ నిబంధనలతో విధ్యార్థులు మానసిక ఆందోళనకు గురవుతున్న పరిస్థితి గతంలో కనిపించింది. మరి ఇప్పటికైనా జాతీయ స్థాయిలో పరీక్ష విధానంపై ఒక స్పష్టమైన విధానాన్ని తీసుకురావడం ద్వార ఈ సమస్య పరిష్కారం అయ్యో అవకాశాలు ఉన్నాయి.
    Published by:yveerash yveerash
    First published: