లాలూని మిమిక్రీ చేసిన విద్యార్థి... ప్రభుత్వంపై ఫైర్...

Bihar Floods : బీహార్‌లో తమ పరిపాలన అద్భుతంగా ఉందని చెప్పుకుంటున్న నితీశ్ కుమార్‌కి తాజా వరదలు షాకిస్తున్నాయి. ప్రజలు బహిరంగంగానే ప్రభుత్వాన్ని తిట్టిపోస్తున్నారు.

Krishna Kumar N | news18-telugu
Updated: October 5, 2019, 1:34 PM IST
లాలూని మిమిక్రీ చేసిన విద్యార్థి... ప్రభుత్వంపై ఫైర్...
లాలూని మిమిక్రీ చేసిన విద్యార్థి (Credit - Twitter - Prashant Kumar)
  • Share this:
ఉత్తరప్రదేశ్, బీహార్‌లో భారీ వర్షాలు, వరదలు ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి. వేల మంది నిరాశ్రయులయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ యువకుడు... బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ను మిమిక్రీ చేశాడు. ప్రస్తుత వరదల్లో పరిస్థితిని, ప్రజల కష్టాల్నీ వివరిస్తూ... మిమిక్రీ రూపంలో ప్రభుత్వంపై విరుచుకుపడ్డాడు. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ కుర్రాడి పేరు కృష్ణ యాదవ్. పొలిటికల్ సైన్స్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ప్రస్తుత నితీశ్ కుమార్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తన మిమిక్రీ ద్వారా ఎత్తిచూపాడు. ఓ ట్రాక్టర్ ఎక్కిన కృష్ణ... వరదల నుంచీ ప్రజలను కాపాడటంలో ప్రభుత్వం విఫలమైందంటూ... లాలూ ప్రసాద్ ఎలాగైతే విమర్శిస్తారో... అలాగే విమర్శించడంతో... సోషల్ మీడియాలో ఈ వీడియో దుమ్మురేపుతోంది.


దాదాపు 11 వేల మంది దీన్ని లైక్ చేశారు. ఆ విద్యార్థి టాలెంట్‌ని చాలా మంది మెచ్చుకుంటున్నారు. లాలూని దించేశాడని అంటున్నారు.
బీహార్‌లో ఇటీవల వచ్చిన వరదల్లో 42 మంది చనిపోయారు. కొన్న దశాబ్దాల్లో అక్కడ ఎప్పుడూ కురవనంత ఎక్కువ వర్షం ఈమధ్య కురిసింది. రాష్ట్రంలో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయినా... అక్కడ కురిసిన కుండపోత వర్షాలతో... బీహార్‌లోని చాలా ప్రాంతాలు మునిగిపోయాయి. చుట్టుపక్కల రాష్ట్రాలను కూడా వరదలు వెంటాడాయి.
First published: October 5, 2019, 1:34 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading