పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న ఓ విద్యార్థి పరీక్ష హాల్లోనే బాత్రూమ్‌కి వెళ్లాడు. అతడు టాయిలెట్‌కు వెళ్లడానికి మూడు సార్లు ఇన్విజిలేటర్‌ను పర్మిషన్ అడిగినా.. ఆ లేడీ ఇన్విజిలేటర్ అనుమతి ఇవ్వకపోవడంతో అతడు కంట్రోల్ చేసుకోలేకపోయాడు. క్లాస్ రూమ్‌లోనే బాత్రూమ్‌కి వెళ్లాడు. అయితే, ఈ విషయం పరీక్ష పూర్తయిన తర్వాత వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన కేరళలో జరిగింది. కేరళలోని కొల్లం జిల్లాలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి ఎగ్జామ్ సెంటర్ ఏర్పాటు చేశారు. అక్కడ పరీక్షలకు హాజరైన ఓ విద్యార్థి ఇలా చేశాడు. దీనిపై పరీక్షలు మొత్తం పూర్తయిన తర్వాత విచారణ జరపాలని నిర్ణయించారు. కనీసం టాయిలెట్‌కు కూడా వెళ్లనివ్వకపోవడంతో బాలుడు మెంటల్ ప్రెజర్‌కు గురయ్యాడని అతడి తండ్రి తెలిపాడు.
‘మా అబ్బాయికి కడుపు నొప్పిగా అనిపించింది. టాయిలెట్‌కు వెళ్లాలని ఇన్విజిలేటర్‌ను మూడు సార్లు అడిగాడంట. ఇలాంటి విషయాల్లో ఇన్విజిలేటర్ నిర్ణయం తీసుకోకపోతే సూపరింటెండెంట్‌కో, అసిస్టెంట్ సూపరింటెండెంట్ లాంటివారికో చెప్పాలి. వారు కూడా ఎగ్జామ్ సెంటర్ దగ్గరే ఉన్నారు కదా. ఏకంగా పర్మిషన్ ఇవ్వను అంటే ఎలా? కడుపునొప్పి తట్టుకోలేక, క్లాస్ రూమ్‌లోనే బాత్రూమ్‌కి వెళ్లాడు’ అని బాలుడి తండ్రి తెలిపాడు.
కేరళలో గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. గత ఏడాది పాలక్కడ్ జిల్లాలో నీట్ పరీక్షకు హాజరైన 25 మంది అమ్మాయిలను ఇన్విజిలేటర్ బ్రా తీసేయించారు. బ్రాకి మెటల్ హుక్స్ ఉన్నాయన్న కారణంతో వాటిని తీసేసిన తర్వాతే పరీక్ష రాయనిస్తామని పట్టుబట్టారు. దీనిపై ఓ యువతి పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.