దేశంలో పెరిగిపోతున్న అత్యాచారాలపై ఒకవైపు ఆందోళన పెరుగుతున్నది. గడప దాటి బయిటికొచ్చిన మహిళ.. ఇంటికి సురక్షితంగా వస్తుందా లేదా..? అన్నది అనుమానమే. మనుషులలో పెరిగిన నేర ప్రవృత్తి దీనికి కారణమవుతున్నది. ఎన్ని కఠిన చట్టాలను తీసుకొచ్చినా.. అందులోని లొసుగులను ఉపయోగించి నేరస్థులు తప్పించుకుంటున్నారు. ఒకవేళ నేరం ఖరారైనా శిక్ష పడేదెన్నటికో. ఇదిలాఉండగా.. ఇదే అంశం మీద బీహార్ కు చెందిన ఆర్జేడీ నాయకుడొకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ చట్టాల వల్ల ఒరిగేదేమీ లేదని ఆయన వ్యాఖ్యానించారు.
జార్ఖండ్ లో బుధవారం వెలుగుచూసిన గ్యాంగ్ రేప్ ను ఉద్దేశిస్తూ ఆయన పై వ్యాఖ్యలు చేశారు. భర్తతో కలిసి బయటకు వెళ్లిన ఆ మహిళను.. 17 మంది గ్యాంగ్ రేప్ చేశారు. ఇదే విషయమై.. ఆర్జేడీ నాయకుడు శివానంద్ తివారి స్పందిస్తూ.. ‘గిరిజన ప్రాంతాల్లో రేప్ లు జరుగుతాయని ఎవరైనా ఊహించారా..? అసలు అక్కడ సంస్కృతి ఉందా...? గిరిజనుల సంస్కృతిలో రేప్ అనే మాటే వినబడదు. కానీ నిన్న జరిగిన ఘటన బాధాకరం. దీనికి కారణం సినిమాలలో వస్తున్న ఐటెం డాన్సులు, పోర్న్ సినిమాలు, ఆధునీకరణ.. ’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి.. Gang Rape: భర్త చూస్తుండగానే... మహిళపై 17 మంది గ్యాంగ్ రేప్
వాటి కారణంగానే గ్రామీణ ప్రాంతాల్లోనూ విష సంస్కృతి పెచ్చుమీరుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇవి అంతం కావాలంటే ఎన్ని కఠిన చట్టాలను తీసుకొచ్చినా ఉపయోగం లేదని అన్నారు. అసలు వాటి వల్ల మారేదెంత మంది అని ప్రశ్నించారు. కఠిన చట్టాలు ఉన్నంత మాత్రానా ఏమీ కాదని.. ముందు మారాల్సింది ప్రజల ఆలోచన విధానం అని శివానంద్ అన్నారు. ప్రజల మైండ్ సెట్ మారనంత వరకు.. వారిలో మార్పు రానంత వరకు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా అవి బూడిదలో పోసిన పన్నీరే అని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇది కూడా చదవండి.. లవర్ తో అన్నీ అనుభవించి.. ఆపై అబార్షన్ చేయించి.. మరో పెళ్లికి సిద్దమవుతుండగా..
దేశంలో మహిళల రక్షణకు వందలాది చట్టాలున్నాయి. అయినా హత్రాస్, దిశ, నిర్భయ వంటి ఘటనలు దేశంలో ఏదో ఒక మూలన వెలుగు చూస్తునే ఉన్నాయి. చిన్న పిల్లలపై అత్యాచారం చేస్తే మరణశిక్ష విధించాలని చేసిన పోక్సో కూడా అంతగా ప్రభావితం చేయడం లేదన్నది కండ్ల ముందు కనబడుతున్న వాస్తవం.
Published by:Srinivas Munigala
First published:December 10, 2020, 17:33 IST