హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

INS Vagir: నేవీలో కొత్తగా చేరిన INS వగీర్.. మిగతా ఇండియన్ సబ్‌మెరైన్స్‌ పవర్‌ గురించి పూర్తి విశేషాలు..

INS Vagir: నేవీలో కొత్తగా చేరిన INS వగీర్.. మిగతా ఇండియన్ సబ్‌మెరైన్స్‌ పవర్‌ గురించి పూర్తి విశేషాలు..

INS Vagir: నేవీలో కొత్తగా చేరిన INS వగీర్.. మిగతా ఇండియన్ సబ్‌మెరైన్స్‌ పవర్‌ గురించి పూర్తి విశేషాలు..

INS Vagir: నేవీలో కొత్తగా చేరిన INS వగీర్.. మిగతా ఇండియన్ సబ్‌మెరైన్స్‌ పవర్‌ గురించి పూర్తి విశేషాలు..

INS Vagir: కల్వరి క్లాస్ సబ్‌మెరైన్లలో ఐదో సబ్‌మెరైన్ ఐఎన్‌ఎస్ వగీర్ (INS Vagir) సోమవారం భారత నావికాదళంలోకి ప్రవేశించింది. ఈ వేడుకకు చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్ హాజరయ్యారు.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

సముద్రంలో ఆధిపత్యం ప్రదర్శించేందుకు చైనా (China) కొంత కాలంగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. బంగ్లాదేశ్‌ (Bangladedsh), పాకిస్థాన్‌ (Pakistan), శ్రీలంక (Sri Lanka)లో పెట్టుబడుల ద్వారా తన స్థావరాలను క్రమంగా విస్తరించే పనిలో ఉంది. ఈ క్రమంలో ఇండియా (India) తన బలాన్ని పెంచుకుంటోంది. ఎలాంటి పరిస్థితుల్లో అయినా దీటైన జవాబు ఇచ్చేలా సిద్ధమవుతోంది. తాజాగా కల్వరి క్లాస్ సబ్‌మెరైన్లలో ఐదో సబ్‌మెరైన్ ఐఎన్‌ఎస్ వగీర్ (INS Vagir) సోమవారం భారత నావికాదళంలోకి ప్రవేశించింది. ఈ వేడుకకు చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్ హాజరయ్యారు. ఫ్రాన్స్ టెక్నాలజీ సహకారంతో మజాగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ INS వగీర్‌ను తయారు చేసింది. వగీర్‌ అంటే ఇసుక సొరచేప. నిశ్శబ్ధంగా, నిర్భయంగా పని చేయడం దీని ప్రత్యేకత.

* పసిగడుతుంది.. పనిబడుతుంది

ఈ సందర్భంగా నేవీ విడుదల చేసిన ఓ ప్రకటనలో..ఈ సబ్‌ మెరైన్‌ ఇండియన్‌ నేవీ బలాన్ని మరింత పెంచుతుందని పేర్కొంది. సముద్రంలో శత్రువులను సమర్థంగా ఎదుర్కొంటుందని, భారత ప్రయోజనాలను రక్షించడంలో కీలకంగా వ్యవహరిస్తుందని తెలిపింది. ఈ సబ్‌మెరైన్‌ ఇంటెలిజెన్స్‌ అందించడానికి, పటిష్ట నిఘా వేసేందుకు ఉపయోగపడుతుందని వివరించింది. గూఢచర్యమైనా, యుద్ధరంగమైనా ఈ సబ్‌మెరైన్‌ను ఎదుర్కోవడం కష్టమని చెప్పింది. శత్రువుల సబ్‌మెరైన్‌లను పసిగట్టడమే కాకుండా నాశనం చేసే సత్తా దీని సొంతమని తెలిపింది.

* వగీర్‌ స్పెషల్ ఏంటి?

ప్రపంచంలోనే కొన్ని బెస్ట్‌ సెన్సార్‌లతో ఇందులో అమర్చినట్లు నేవీ పేర్కొంది. ఆయుధ ప్యాకేజీలో తగినంత వైర్ గైడెడ్ టార్పెడోలు, పెద్ద శత్రు నౌకాదళాన్ని న్యూట్రలైజ్‌ చేయడానికి సబ్‌ సర్ఫేస్‌ టూ సర్ఫేస్‌ మిసైల్స్‌ ఉన్నాయని తెలిపింది. స్పెషల్‌ ఆపరేషన్స్‌కి ఈ సబ్‌ మెరైన్‌ మెరైన్ కమాండోలను కూడా లాంచ్‌ చేయగలదని, దాని శక్తివంతమైన డీజిల్ ఇంజిన్‌లు స్టెల్త్ మిషన్ కోసం బ్యాటరీలను త్వరగా ఛార్జ్ చేయగలవని చెప్పింది. ఆత్మరక్షణ కోసం, ఇందులో అడ్వాన్స్‌డ్‌ టార్పెడో డికాయ్ సిస్టమ్‌ ఉందని నేవీ పేర్కొంది.

* భారత నౌకాదళం బలం

భారతీయ నావికాదళంలో ప్రస్తుతం పదహారు డీజిల్‌తో నడిచే సబ్‌ మెరైన్‌లు ఉన్నాయి. నివేదికల ప్రకారం ఇండియా సబ్‌మెరైన్‌ నౌకాదళం రెండు నగరాలు.. తూర్పు తీరంలో విశాఖపట్నం , పశ్చిమ తీరంలో ముంబైలో ఉన్నాయి.

* ఇండియన్‌ సబ్‌మెరైన్స్‌ క్లాసెస్‌

- అరిహంత్ క్లాస్

ATV ప్రోగ్రామ్ కింద, భారతదేశం నాలుగు అణుశక్తితో నడిచే బాలిస్టిక్ మిసైల్‌ సబ్‌మెరైన్స్‌(SSBNs) నిర్మించాలని భావిస్తున్నారు. ఈ క్లాస్‌లో మొదటి నౌక ఐఎన్‌ఎస్ అరిహంత్ 2014లో సేవలోకి ప్రవేశించింది. ఇందులో మొత్తం INS అరిహంత్ (S2), INS అరిఘాట్ (S3) బోట్లు ఉన్నాయి. దీన్ని ఇండియాలోనే తయారు చేశారు. ఇది 83MW సుసంపన్నమైన యురేనియం-ఇంధన ఒత్తిడితో కూడిన లైట్-వాటర్ రియాక్టర్ (PWR) ద్వారా శక్తిని పొందుతుంది.

అరిహంత్-క్లాస్‌ సబ్‌మెరైన్‌లు 110 మీటర్ల పొడవు, 11 మీటర్ల బీమ్‌తో ఉంటాయి. నీటిలో 24 నాట్స్‌ వేగంతో ప్రయాణిస్తాయని ఎన్టీఆర్ నివేదిక పేర్కొంది. ఇవి ఉపరితలంపైకి రాకుండా 50 రోజుల వరకు నీటిలోనే ఉండగలవు. దీని వెపన్స్‌ సిస్టమ్‌.. టార్పెడోలను అలాగే సబ్‌మెరైన్స్‌ నుంచి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించగలవు.

- కల్వరి క్లాస్‌

ప్రాజెక్ట్-75 కార్యక్రమం కింద భారతదేశం ఆరు కల్వరి-క్లాస్ డీజిల్-ఎలక్ట్రిక్ అటాక్ సబ్‌మెరైన్‌లను నిర్మించాలని భావిస్తోంది. 2017లో ఈ తరగతిలోని మొదటి నౌకను ప్రారంభించారు. ఇందులో INS కల్వరి (S21), INS ఖండేరి (S22), INS కరంజ్ (S23), INS వేలా (S24), INS వగీర్‌ (S25) ఉన్నాయి. వీటిని ఫ్రాన్స్, ఇండియాలో తయారు చేశారు.

కల్వరి క్లాస్‌ ఫ్రాన్స్‌లోని స్కార్పెన్-క్లాస్ సబ్‌మెరైన్‌లపై ఆధారపడి ఉంటుంది. ఈ సబ్‌మెరైన్‌లు 67.5 మీటర్ల పొడవు, 6.2 మీటర్ల బీమ్‌తో ఉంటాయి. నీటిలో 20 నాట్స్‌ వేగంగా ప్రయాణించగలవు. ఇవి ఉపరితలంపైకి రాకుండా 50 రోజుల వరకు నీటిలోనే ఉండగలవు. వెపన్స్‌ సిస్టమ్‌ టార్పెడోలను, యాంటీ షిప్ మిసైల్స్‌ను ప్రయోగించగలవు.

- శిశుమార్ క్లాస్‌

భారతదేశం నాలుగు శిశుమార్ క్లాస్‌ నౌకలను నిర్వహిస్తోంది. అవి INS శిశుమార్ (S44), INS శంకుష్ (S45), INS షాల్కీ (S46), INS శంకుల్ (S47). వీటిని వెస్ట్ జర్మనీ, ఇండియాలో తయారు చేశారు. ఈ సబ్‌ మెరైన్స్‌ 65 మీటర్ల పొడవు, 8 మీటర్ల బీమ్‌ కలిగి ఉంటాయి. మునిగిపోయినప్పుడు 22.5 నాట్స్‌ వేగంతో ప్రయాణించగలవని నివేదిక పేర్కొంది. ఇవి ఉపరితలంపైకి రాకుండా 50 రోజుల వరకు నీటిలోనే ఉండగలవు. టార్పెడోలను, వెపన్‌ సిస్టమ్‌ల నుంచి ఫైర్‌ చేయవచ్చు.

ఇది కూడా చదవండి : వీసా వెయిటింగ్ పీరియడ్‌పై అమెరికా కీలక ప్రకటన.. ఇండియన్స్‌కు మద్దతుగా నిర్ణయాలు

- సింధుఘోష్ క్లాస్‌

న్యూక్లియర్ థ్రెట్ కేపబిలిటీ నివేదిక ప్రకారం.. భారతదేశంలో ప్రస్తుతం ఎనిమిది ఆపరేషనల్ సింధుఘోష్-క్లాస్ డీజిల్-ఎలక్ట్రిక్ ఎటాక్ సబ్‌మెరైన్‌లు ఉన్నాయి. అవి INS సింధుఘోష్ (S55), INS సింధు రాజ్ (S57), INS సింధు రత్న (S59), INS సింధు కేసరి (S60), INS సింధు కీర్తి (S61), INS సింధు విజయ్ (S62), INS సింధు రాష్ట్ర (S65).

వీటిని సోవియట్ యూనియన్, రష్యాలో తయారు చేశారు. ఈ కిలో-క్లాస్‌ సబ్‌ మెరైన్‌లు భారతదేశ సబ్‌మెరైన్‌ నౌకాదళానికి వెన్నెముకగా పనిచేస్తాయి. Klub/3M-54E ఆల్ఫా క్రూయిజ్ మిసైల్‌ సిస్టమ్‌కు అనుగుణంగా క్రమంగా పునరుద్ధరిస్తున్నారు. ఈ సబ్‌మెరైన్‌లు 72.6 మీటర్ల పొడవు, 9.9 మీటర్ల బీమ్‌ కలిగి ఉంటాయి. నీటిలోపల 18 నాట్స్‌ వరకు ప్రయాణించగలవు. సుమారు 45 రోజుల పాటు నీట మునిగి ఉండగలవు. వెపన్స్‌ సిస్టమ్‌ టార్పెడోలు, యాంటీ షిప్ మిసైల్స్‌ను ప్రయోగించగలదు.

First published:

Tags: Indian Navy, National News

ఉత్తమ కథలు