చికెన్ వంటకాల్లో ఎన్నో వైరైటీలు ఉన్నాయి. అందులో చికెన్ బిర్యానీకి ఉండే క్రేజే వేరు. దాని తర్వాత చికెన్ రోల్స్ కూడా యూత్‌ని తెగ ఆకట్టుకుంటున్నాయి. హైదరాబాద్ (Hyderabad)లోనూ చికెన్ రోల్స్ (Chicken Rolls) అందరూ ఫిదా అవుతున్నారు. ఐతే మన వద్ద ఒక్క చికెన్ రోల్ ధర కనీసం రూ.100 ఉంటుంది. కానీ 20 రూపాయలకే అదిరిపోయే చికెన్ రోల్స్ ఇస్తున్నారంటే మీరు నమ్ముతారా? కానీ ఇది నిజం. ఝార్ఖండ్‌లో ఓ చిరువ్యాపారి.. కేవలం 20 రూపాయలకే నోరూరించే... చికెన్ రోల్స్ అమ్ముతున్నాడు. తక్కువ ధరకే రావడం.. రుచి కూడా అద్భుతంగా ఉండడంతో.. ఇతడి బండి వద్దకు జనం క్యూ కడుతున్నారు.
అంధులకు వరం.. స్మార్ట్ గ్లాసెస్ తయారుచేసిన స్టూడెంట్.. రూ.200 మాత్రమే..!
జంషెడ్‌పూర్‌లోని మహమ్మదీయ లైన్, సక్చి స్ట్రెయిట్ మైల్ రోడ్‌లో ఓ చిన్న చికెన్ రోల్ బండి కనిపిస్తుంది. ఇక్కడ తక్కువ ధరకే చికెన్ రోల్ లభిస్తుండడంతో.. నిత్యం ఎంతో మంది వస్తుంటారు. ఎప్పుడు చూసినా.. ఈ బండి వద్ద జనం రద్దీ ఎక్కువగా ఉటుంది. ఇక్కడ రోజూ 500 నుంచి 300 చికెన్ రోల్స్ విక్రయిస్తున్నట్లు షాపు యజమాని నవేద్ తెలిపారు. తన చికెన్ రోల్స్ కోసం ఎక్కడెక్కడి నుంచో జనాలు వస్తున్నారని ఆనందంగా చెప్పారు.
నవేద్.. 2017 నుంచి ఇక్కడ చికెన్ రోల్స్ విక్రయిస్తున్నారు. నూనె, గరం మసాలా, ఉల్లి, చికెన్ కలిపి.. స్టఫ్ తయారు చేస్తారు. ఆ తర్వాత దానిని వేడి వేడి రోటీలో రోల్ చేసి ఇస్తారు. చికెన్ రోల్‌లో చిల్లీ సాస్, టొమాటో సాస్ వేసుకొని తింటే.. టేస్ట్ అద్భుతంగా ఉంటుందటని నవేద్ తెలిపారు. మొదట్లో తక్కువ మంది మాత్రమే వచ్చారని.. కానీ దీని రుచి గురించి అందరికీ తెలియడంతో.. ప్రతి రోజూ వందల మంది తమ షాప్‌కు వస్తున్నారని ఆయన చెప్పారు.
తన షాపులో రోజూ 30 కిలోల చికెన్ వినియోగిస్తున్నారు. 2017 నుంచి అదే రేటుకు చికెన్ రోల్స్ విక్రయిస్తున్నారు. నవేద్ దుకాణానికి వచ్చే వారిలో విద్యార్థులే ఎక్కువ మంది ఉంటారు. నవేద్ దుకాణం మంగళవారం మినహా.. మిగతా అన్ని రోజుల్లో.. సాయంత్రం 4.30 నుంచి రాత్రి 8.30 వరకు అందుబాటులో ఉంటుంది. ఇక్కడ రెండు చికెన్ రోల్స్ తింటే.. కడుపు నిండిపోతుందని.. మళ్లీ భోజనం చేయాల్సిన అవసరం కూడా ఉండదని కస్టమర్లు చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chicken, Trending, West Bengal