హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

#StoryForGlory: ముగిసిన #StoryForGlory ఫైనల్‌.. డైలీహంట్‌, AMG మీడియా ట్యాలెంట్‌ హంట్‌లో 12 మంది విన్నర్స్‌

#StoryForGlory: ముగిసిన #StoryForGlory ఫైనల్‌.. డైలీహంట్‌, AMG మీడియా ట్యాలెంట్‌ హంట్‌లో 12 మంది విన్నర్స్‌

Photo Credit : ANI

Photo Credit : ANI

#StoryForGlory: దేశవ్యాప్తంగా వీడియో, రైటింగ్‌ ఫార్మాట్‌లో బెస్ట్‌ కంటెంట్‌ క్రియేటర్స్‌ను కనుగొనే లక్ష్యంతో ప్రారంభించిన అతిపెద్ద ట్యాలెంట్‌ హంట్‌ ప్రోగ్రామ్‌ ఫైనల్‌ ఢిల్లీలో ముగిసింది. ఫైనల్స్‌లో వీడియో, ప్రింట్ అనే రెండు కేటగిరీల కింద 12 మంది విజేతలను ఎంపిక చేశారు.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

దేశవ్యాప్తంగా వీడియో, రైటింగ్‌ ఫార్మాట్‌లో బెస్ట్‌ కంటెంట్‌ క్రియేటర్స్‌ను కనుగొనే లక్ష్యంతో ప్రారంభించిన అతిపెద్ద ట్యాలెంట్‌ హంట్‌ ప్రోగ్రామ్‌ ఫైనల్‌ ఢిల్లీలో ముగిసింది. ఈ కార్యక్రమాన్ని #StoryForGlory పేరిట డైలీహంట్‌(Dailyhunt), అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌(Adani Enterprises Limited) అనుబంధ సంస్థ AMG మీడియా నెట్‌వర్క్స్ లిమిటెడ్‌(AMG Media Networks Ltd) నిర్వహించాయి. ఢిల్లీలో మంగళవారం ముగిసిన ఫైనల్స్‌లో వీడియో, ప్రింట్ అనే రెండు కేటగిరీల కింద 12 మంది విజేతలను ఎంపిక చేశారు. #StoryForGlory ప్రజలలో ప్రత్యేకతలను గుర్తించి, వారు జర్నలిజం రంగంలో కెరీర్‌ను నిర్మించుకునేలా అవకాశం కల్పించిందని, క్రియేటివ్‌ కంటెంట్‌తో మీడియా ఎకోసిస్టమ్‌లో మార్పును తీసుకొచ్చే వేదికను అందించిందని నిర్వాహకులు పేర్కొన్నారు.

నాలుగు నెలల డ్యూరేషన్‌తో నిర్వహించిన ఈ ప్రోగ్రామ్‌ ఈ ఏడాది మేలో ప్రారంభమైంది. వేల కొద్దీ అందిన అప్లికేషన్‌ల నుంచి 20 మంది ప్రతిభావంతులైన అభ్యర్థులను నిర్వాహకులు షార్ట్‌లిస్ట్‌ చేశారు. షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులు MICAలో ఎనిమిది వారాల ఫెలోషిప్, రెండు వారాల లెర్నింగ్ ప్రోగ్రామ్ పూర్తి చేశారు. ఈ శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత.. ఫైనల్‌ ప్రాజెక్ట్‌పై అభ్యర్థులు ఆరు వారాల పాటు పని చేశారు.

ఈ సమయంలో వారికి ప్రముఖ మీడియా పబ్లిషింగ్ సంస్థలు మార్గదర్శకత్వం అందించాయి. ప్రోగ్రామ్ సమయంలో.. అభ్యర్థులు స్కిల్‌ బిల్డింగ్‌, ఎక్స్‌పెరియంటల్‌ లెర్నింగ్‌, స్టోరీ టెల్లింగ్‌, కంటెంట్‌పై పట్టు సాధించడంపై దృష్టి పెట్టారు. చివరికి 20 మంది ఫైనలిస్టులు తమ ప్రాజెక్ట్‌లను సబ్మిట్‌ చేశారు. అందులో 12 మందిని జ్యూరీ విజేతలుగా ఎంపిక చేసింది.

* జ్యూరీలో మీడియా ప్రముఖులు

జ్యూరీలో డైలీహంట్ వ్యవస్థాపకుడు వీరేంద్ర గుప్తా, AMG మీడియా నెట్‌వర్క్స్ లిమిటెడ్ సీఈవో, ఎడిటర్-ఇన్-చీఫ్ సంజయ్ పుగాలియా, ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ గోయెంకా, ఫౌండర్ ఫిలిం కంపానియన్ అనుపమ చోప్రా, శైలి చోప్రా, SheThePeople వ్యవస్థాపకుడు, గావ్ కనెక్షన్ వ్యవస్థాపకుడు నీలేష్ మిశ్రా, ఫ్యాక్టర్ డైలీ సహ వ్యవస్థాపకుడు పంకజ్ మిశ్రా వంటి పరిశ్రమ ప్రముఖులు ఉన్నారు.

* నెక్ట్స్‌ జనరేషన్‌ స్టోరీ టెల్లర్స్‌ను గుర్తించాం

AMG మీడియా నెట్‌వర్క్స్ లిమిటెడ్ సీఈవో, ఎడిటర్-ఇన్-చీఫ్ సంజయ్ పుగాలియా మాట్లాడుతూ..‘ సంపన్నమైన, వైవిధ్యమైన స్టోరీలకు నిలయమైన భూమిగా.. భారతదేశం చాలా మంది స్టోరీటెల్లర్స్‌కు నిలయం. డైలీహంట్‌తో కలిసి మేము ఉత్తమమైన నెక్స్ట్‌ జనరేషన్‌ స్టోరీటెల్లర్స్‌ను గుర్తించగలిగాం.

వారి నైపుణ్యాలను మెరుగుపర్చడానికి, పెంపొందించడానికి అవసరమైన సపోర్ట్‌, వేదికను అందించగలిగాం. ఈ ట్యాలెంట్ హంట్‌ కార్యక్రమానికి అందిన స్పందన గొప్పది. #StoryforGlory ఇనిషియేటివ్ మంచి కంటెంట్‌ని అందించడానికి, భారతదేశంలోని అత్యంత ప్రతిభావంతులైన క్రియేటర్‌లకు సహకారం అందిండానికి మేం చేస్తున్న కృషికి ఉదాహరణగా నిలుస్తుంది.’ అని వివరించారు.

కార్యక్రమం గురించి డైలీహంట్ వ్యవస్థాపకుడు వీరేంద్ర గుప్తా మాట్లాడుతూ.. ‘ఇండియాలో శక్తివంతమైన, ప్రతిభావంతులైన స్టోరీటెల్లర్స్‌ను కనుగొనడానికి మేం టెక్నాలిజీని ఉపయోగించగలిగాం. డిజిటల్ న్యూస్‌, మీడియా స్పేస్ ముఖ్యంగా స్టోరీ టెల్లింగ్‌ విధానంలో గణనీయంగా పురోగమిస్తోంది. #StoryForGlory ద్వారా ఇండియా మీడియా ఎకోసిస్టమ్‌ను రూపొందించడంలో మా కమిట్‌మెంట్‌ను తెలియజేశాం. స్టోరీటెల్లర్స్‌కు వారి నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి, మీడియా రంగంలో నచ్చిన అవకాశాలను అందుకోవడానికి అవకాశం కల్పిస్తాం.’ అని చెప్పారు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Delhi, Digital media, National News