హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Kaal Bhiarav: ఈ కాల భైరవుడిని దర్శించుకుంటే.. భూతప్రేతాలన్నీ పారిపోతాయట..!

Kaal Bhiarav: ఈ కాల భైరవుడిని దర్శించుకుంటే.. భూతప్రేతాలన్నీ పారిపోతాయట..!

కాల భైరవ ఆలయం

కాల భైరవ ఆలయం

కాలభైరవుడితో పాటు మహామాయ దేవిని దర్శించుకుంటే భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు. కాలభైరవుని దర్శనం ద్వారా.. శివపార్వతుల అపారమైన అనుగ్రహం లభిస్తుంది. కష్టాలన్నీ తొలగిపోతాయి.

  • Local18
  • Last Updated :
  • Hyderabad, India

సంస్కృతి..సంప్రదాయాలు..విశ్వసాలకు మన దేశం పుట్టినిల్లు. ఇక్కడ  ఎన్నో పురాతన దేవాలయాలున్నాయి. దాదాపు ప్రతి ఊరిలో ఏదో ఒక దేవుడి గుడి అంటుంది. వాటిలో కొన్ని ఆలయాలు ఎంతో ప్రత్యేకమైనవి. మహిమాన్విత శక్తులు ఉన్నాయని భక్తులు విశ్వసిస్తారు. అలాంటి వాటిలో రతన్‌పూర్.. కాల భైరవ ఆలయం ఒకటి.

ఛత్తీస్‌గఢ్‌లో దుర్గామాతకు చెందిన ఓ ప్రఖ్యాత దేవాలయం ఉంది. అదే మహామాయ దేవి ఆలయం. బిలాస్‌పూర్ జిల్లాలోని రతన్‌పూర్‌లో ఈ శక్తిపీఠం ఉంది. ఐతే ప్రధాన ఆలయానికి కొంచెం ముందు.. అమ్మవారి రక్షకుడు భైరవ నాథ్ ప్రవేశ ద్వారం కూడా ఉంది. ఈ ప్రవేశ ద్వారం.. సిద్ధ తంత్ర పీఠం శ్రీ కాల భైరవ దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. పురాణాల ప్రకారం.. సతీ మాత కుడి భుజం ఇక్కడ పడిపోయింది. అప్పటి నుంచీ ఇక్కడ కాల భైరవుడు రక్షకుడిగా ఉన్నారు. ఈ కాలభైరవుడిని దర్శించుటేనే... మహామాయ దేవి దర్శనం సంపూర్ణమవుతుంది.

OMG: పాలిస్తున్న మగ మేక.. లక్షల్లో ధర.. ఇలాంటి వింతను ఎక్కడా చూసి ఉండరు

కాల భైరవ దేవాలయ సముదాయం చాలా అందంగా కనిపిస్తుంది. ఇది ప్రధాన రహదారికి ఆనుకునే ఉంటుంది. ఆలయ ప్రాంగణంలో ఒక చెరువు కూడా ఉంది. ఇందులో కమలం పువ్వులు పెద్ద సంఖ్యలో వికసిస్తాయి. మహామాయ ఆలయంలో అమ్మవారిని సందర్శించడానికి ఎవరు వచ్చినా... ముందు వారు కాలభైరవుడిని దర్శించుకున్నాకే.. అక్కడికి వెళ్తారు.

భైరవ విగ్రహం చరిత్ర

కాల భైరవ విగ్రహం ఇంతకు ముందు బహిరంగ వేదికపై ఉండేది. ఆ తర్వత ఈ ఆలయాన్ని బాబా జ్ఞానగిరి గోసాయి నిర్మించారు. ఆలయంలో ప్రతిష్టించిన విగ్రహం దాదాపు 10 అడుగుల ఎత్తులో ఉగ్రరూపంలో ఉంటుంది. భైరవుని ఈ ఉగ్ర రూపం దుర్మార్గుల సంహారం, భక్తుల రక్షణ కోసం అని భక్తులు నమ్ముతారు. పూర్వకాలంలో సిద్ధయోగి ఇక్కడ తాంత్రిక సాధన చేసేవాడని చెబుతారు.

కాలభైరవుడితో పాటు మహామాయ దేవిని దర్శించుకుంటే భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు. కాలభైరవుని దర్శనం ద్వారా.. శివపార్వతుల అపారమైన అనుగ్రహం లభిస్తుంది. కష్టాలన్నీ తొలగిపోతాయి. అంతేకాదు మంత్రవిద్య, ప్రేతాత్మలు వంటి దోషాలు కూడా దూరమవుతాయని నమ్ముతారు.

First published:

Tags: Chhattisgarh, Temple

ఉత్తమ కథలు