• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • STORMY RAJYA SABHA SESSION EXPECTED TODAY AS GOVT LOOKS FOR SUPPORT ON CONTENTIOUS FARM BILLS SK

Agriculture Bill: నేడు రాజ్యసభ ముందుకు వ్యవసాయ బిల్లు.. రచ్చ తప్పదా..?

Agriculture Bill: నేడు రాజ్యసభ ముందుకు వ్యవసాయ బిల్లు.. రచ్చ తప్పదా..?

రైతుల ఆందోళన

సంఖ్యా బలంతో లోక్‌సభలో బిల్లులను పాస్ చేయించుకున్న బీజేపీకి.. రాజ్యసభలో మాత్రం మెజార్టీ లేదు. ఆ బిల్లులు గట్టెక్కాలంటే ఇతరుల మద్దతు తప్పనిసరి.

  • Share this:
    కొత్త వ్యవసాయ బిల్లులపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది. రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని.. కార్పొరేట్లకు లాభం చేకూర్చేందుకే ఈ బిల్లులలను తెస్తున్నారని కేంద్రంపై విపక్షాలు మండిపడుతున్నాయి. రైతులకు మద్దతుగా ఇప్పటికే బీజేపీ మిత్రపక్షం అకాలీదళ్‌కు చెందిన హర్ సిమ్రత్ కౌర్ కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఐనప్పటికీ వెనక్కి తగ్గని కేంద్రం.. లోక్‌సభలో మూడు బిల్లులను పాస్ చేయించుకుంది. ఇవాళ ఆ బిల్లులు రాజ్యసభ ముందుకు రానున్నాయి. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేశాఖమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సభలో వ్యవసాయ బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విపక్షాలు.. ఇవాళ సభలో ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. సంఖ్యా బలంతో లోక్‌సభలో బిల్లులను పాస్ చేయించుకున్న బీజేపీకి.. రాజ్యసభలో మాత్రం మెజార్టీ లేదు. ఆ బిల్లులు గట్టెక్కాలంటే ఇతరుల మద్దతు తప్పనిసరి.

    245 సీట్లున్న రాజ్యసభలో బీజేపీకి 86, కాంగ్రెస్‌కు 40 మంది సభ్యుల బలముంది. మిత్రపక్షాలు, ఇతర ప్రాంతీయ పార్టీలను కలుపుకుంటే 130 మంది మద్దతు లభిస్తుందని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. వైసీపీ కేంద్రానికి మద్దతు తెలిపే అవకాశముంది. ఇక టీఆర్ఎస్ పార్టీ సభ్యులు బిల్లులకు వ్యతిరేకంగా ఓటు వేయాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే ఆదేశించారు. వ్యవసాయ బిల్లు తేనె పూసిన కత్తి వంటిదని..రైతులు ఎంతో నష్టపోతారని విమర్శలు గుప్పించారు. అన్నాడీఎంకే, శివసేన సభ్యులు కేంద్రానికి మద్దతు తెలపనున్నట్లు సమాచారం. ఇక ఆమాద్మీ, సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీ పార్టీల సభ్యులు కేంద్రానికి వ్యతిరేకంగా ఓటువేస్తారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ సభలో ఏం జరగబోతోందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

    వ్యవసాయ రంగంలో సంస్కరణల కోసం కేంద్ర ప్రభుత్వం మూడు బిల్లులను సెప్టెంబర్ 14న పార్లమెంటులో ప్రవేశపెట్టింది. రైతుల ఉత్పత్తుల వర్తక, వాణిజ్యం (ప్రోత్సాహం, సదుపాయకల్పన) బిల్లు-2020, ధరల హామీ, పంట సేవల అంగీకార బిల్లు-2020ను మూజువాణి ఓటుతో ఈ నెల 17న లోక్‌సభ ఆమోదించింది. ఇక తృణధాన్యాలు, పప్పులు, ఉల్లిపై నియంత్రణ ఎత్తివేసే.. నిత్యవసర ఉత్పత్తుల (సవరణ) బిల్లు-2020ను మంగళవారం ఈనెల 15న ఆమోదించింది. ఈ సంస్కరణలు రైతులకు లాభదాయకంగా ఉంటాయని ప్రభుత్వం చెబుతుంటే.. విపక్షాలు మాత్రం రైతులకు నష్టం జరుగుతుందని మండిపడుతున్నాయి.
    Published by:Shiva Kumar Addula
    First published: