Home /News /national /

తెలుగు రాష్ట్రాలకు ఆక్సిజన్‌ మళ్లింపును ఆపేయండి.. ప్రధాని మోడీకి లేఖ రాసిన తమిళనాడు సీఎం

తెలుగు రాష్ట్రాలకు ఆక్సిజన్‌ మళ్లింపును ఆపేయండి.. ప్రధాని మోడీకి లేఖ రాసిన తమిళనాడు సీఎం

పళనిస్వామి(ఫైల్ ఫొటో)

పళనిస్వామి(ఫైల్ ఫొటో)

దేశవ్యాప్తంగా కరోనా కేసులు వేగంగా పెరుగుతున్న వేళ ఆక్సిజన్‌కు డిమాండ్ భారీగా పెరుగుతోంది.

  దేశవ్యాప్తంగా కరోనా కేసులు వేగంగా పెరుగుతున్న వేళ ఆక్సిజన్‌కు డిమాండ్ భారీగా పెరుగుతోంది. ఇప్పటికే ఢిల్లీలో ఆక్సిజన్ కొరత ఏర్పడింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆక్సిజన్.. ఇందుకు సంబంధించి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు. మీ వద్దస్పేర్ గా ఉన్న మెడికల్ ఆక్సిజన్ లేదా ఆక్సిజన్ సిలిండర్లు ఉంటే వెంటనే తమకు పంపాలని ఆయన సీఎంలను లేఖల ద్వారా కోరారు. అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో పలు రాష్ట్రాలు తమ రాష్ట్రంలో డిమాండ్‌కు సరిపడ ఆక్సిజన్ అందుబాటులోకి ఉంచుకున్న తర్వాత ఇతర రాష్ట్రాలకు సరఫరా చేయాలని భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖ హాట్ టాపిక్‌గా మారింది.

  తమిళనాడు నుంచి తెలుగురాష్ట్రాలకు వెళ్తున్న 80 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ సరఫరాను వెంటనే నిలిపివేయాలని ప్రధాని మోదీని తమిళనాడు సీఎం పళనిస్వామి లేఖ ద్వారా కోరారు. తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని.. అందువల్ల మెడికల్ ఆక్సిజన్ వినియోగం కూడా పెరుగుతుందని ఆయన లేఖలో పేర్కొన్నారు. తమిళనాడుకు 220 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ మాత్రమే కేటాయించినప్పటికీ.. ప్రస్తుతం రాష్ట్రంలో మెడికల్ ఆక్సిజన్ వినియోగం 310 మెట్రిక్‌ టన్నులకు చేరిందని లేఖలో పర్కొన్నారు. కానీ, కొవిడ్‌ కేసులు పెరుగుతున్న తరుణంలో భవిష్యత్‌లో 450 మెట్రిక్‌ టన్నుల ప్రాణవాయువు అవసరయ్యే అవకాశాలున్నాయని చెప్పారు. . ఇది రాష్ట్రం ఉత్పత్తి చేసే మెడికల్ ఆక్సిజన్ సామర్థ్యం 400 మెట్రిక్ టన్నుల కన్నా అధికం అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఏపీలకు రాష్ట్రం నుంచి సరఫరా అవుతున్న 80 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను తక్షణమే నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

  ఇక, తమిళనాడులో గడిచిన 24 గంటల్లో కొత్తగా 15,659 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 10,81,988 చేరింది. కరోనాతో తాజాగా 82 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 13,557కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,05, 180 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 90 శాతం దిగువకు పడిపోయింది.
  Published by:Sumanth Kanukula
  First published:

  Tags: Andhra Pradesh, Oxygen, Tamil nadu, Telangana

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు