హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

e-Challan Payment: ట్రాఫిక్ చలాన్లు చెల్లిస్తున్నారా? ఈజీగా పేమెంట్ చేసేందుకు ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి..!

e-Challan Payment: ట్రాఫిక్ చలాన్లు చెల్లిస్తున్నారా? ఈజీగా పేమెంట్ చేసేందుకు ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి..!

ట్రాఫిక్ చలాన్లు చెల్లించడానికి ఈజీ స్టెప్స్.

ట్రాఫిక్ చలాన్లు చెల్లించడానికి ఈజీ స్టెప్స్.

ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారు, ఎక్కడి నుంచైనా ఆన్‌లైన్‌లో సులభంగా చలాన్ (challan) చెల్లించవచ్చు. అయితే వారి పేరు మీద టికెట్ ఉండాలి. ఇ-చలాన్ (e-challan) కోసం వెబ్ సైట్‌ను యూజర్ ఫ్రెండ్లీగా మార్చారు. వాహనదారులు వెబ్‌సైట్ (Website) ద్వారా తమ చలాన్ వివరాలను నమోదు చేసి, ఈజీగా పేమెంట్ చేయవచ్చు.

ఇంకా చదవండి ...

దేశంలో నిత్యం ట్రాఫిక్ ఉల్లంఘనలు చోటుచేసుకుంటుంటాయి. ట్రాఫిక్ లో చిక్కుకున్నప్పుడు లేదా అత్యవసరమైన సందర్భాల్లో ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసి ఉంటారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు ఫైన్ విధించడం సర్వసాధారణం. ఒకప్పుడు చలాన్‌(ఫైన్)ను సెటిల్ చేయాలంటే వాహనదారులు ఎంతో అసౌకర్యానికి లోనయ్యేవారు. ఈ ప్రక్రియ దీర్ఘకాలం కొనసాగేది. దీంతో చాలా మంది ట్రాఫిక్ చలాన్‌ని చెల్లించకుండా ఉండేవారు. అయితే ప్రస్తుత డిజిటల్ యుగంలో ట్రాఫిక్ ఫైన్‌లు చెల్లించడానికి గతంలో మాదిరి లైన్లలో నిలబడాల్సిన అవసరం లేదు. ట్రాఫిక్ చట్టాలను మరింత మెరుగ్గా అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ-చలాన్ విధానాన్ని ప్రవేశపెట్టింది.

ప్రస్తుతం, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారు, ఎక్కడి నుంచైనా ఆన్‌లైన్‌లో సులభంగా చలాన్ చెల్లించవచ్చు. అయితే వారి పేరు మీద టికెట్ ఉండాలి. ఇ-చలాన్ కోసం వెబ్ సైట్‌ను యూజర్ ఫ్రెండ్లీగా మార్చారు. వాహనదారులు వెబ్‌సైట్ ద్వారా తమ చలాన్ వివరాలను నమోదు చేసి, ఈజీగా పేమెంట్ చేయవచ్చు.

ఇదీ చదవండి: నిరుద్యోగులకు SSC గుడ్‌ న్యూస్.. డిసెంబర్ లోపు 42వేల పోస్టులు భర్తీ


ఇ-చలాన్ అనేది ఫైన్లను వసూలు చేయడానికి ప్రవేశపెట్టిన చలాన్ల ఎలక్ట్రానిక్ వెర్షన్. గతంలో ఎవరైనా ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే ఫిజికల్ రిసిప్ట్ జారీ చేసేవారు. ప్రస్తుతం రిసిప్ట్ ఎలక్ట్రానిక్ కాపీ వాహనదారులకు పంపుతున్నారు. ఫైన్ల విషయంలో పారదర్శకతను పెంపొందించడానికి, అలాగే పౌరులకు మెరుగైన సేవలను అందించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఇ-చలాన్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. అంతేకాకుండా దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించడంలో CCTV- ఎనేబుల్డ్ ఇ-చలాన్ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుంది.వాహనదారులు ఆన్‌లైన్‌లో ఇ-చలాన్‌ను చెల్లించడానికి ప్రతి రాష్ట్రం సొంతంగా వెబ్‌సైట్‌ను రూపొందించుకున్నాయి.

ట్రాఫిక్ చలాన్లను చెల్లించే విధానం

స్టెప్-1: ఇ-చలాన్ చెల్లించడానికి సంబంధిత రాష్ట్ర వెబ్‌సైట్‌ను సందర్శించండి.

స్టెప్-2: మీ చలాన్ నంబర్, వాహనం నంబర్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ నంబర్‌ను నమోదు చేయండి. ఆ తర్వాత, మీరు మెయిన్ పేజీలో క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయండి. ఆపై గెట్ డిటైల్స్‌పై క్లిక్ చేయాలి.

స్టెప్-3: ట్రాఫిక్ నేరం, అందుకు సంబంధించిన చలాన్ వివరాలను తనిఖీ చేసి, ఆపై ఫైన్ చెల్లించండి.

మరోవైపు, డిజీలాక‌ర్ సేవలను యూజర్లకు మరింత చేరువ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం దీని సేవలను వాట్సా‌ప్ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో పాన్‌కార్డ్‌, డ్రైవింగ్ లైసెన్స్‌, సీబీఎస్ఈ 10వ త‌ర‌గ‌తి పాసింగ్ స‌ర్టిఫికేట్‌, వాహ‌న రిజిస్ట్రేష‌న్ స‌ర్టిఫికేట్ (ఆర్‌సీ), ద్విచ‌క్ర వాహ‌న బీమా పాల‌సీ, 10వ త‌ర‌గ‌తి మార్క్‌షీట్‌, 12వ త‌ర‌గ‌తి మార్క్‌షీట్‌, బీమా పాల‌సీ ప‌త్రాలు (డిజీలాక‌ర్‌లో అందుబాటులో ఉన్న లైఫ్‌/నాన్ లైఫ్ బీమా పాల‌సీ ప‌త్రాలు) త‌దిత‌ర డాక్యుమెంట్లను వాట్సాప్ ద్వారా కూడా డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. ఇందు కోసం వాట్సాప్ వినియోగదారులు చాట్‌బాట్ ద్వారా ‘+91 9013151515’ నెంబ‌రుకు హాయ్ లేదా డిజీలాక‌ర్’ అని టైప్ చేసి మెసేజ్ సెండ్ చేయడం ద్వారా ఈ సేవ‌ల‌ను పొంద‌వ‌చ్చు.

Published by:Mahesh
First published:

Tags: India news, Online, Traffic challan, Vehicles

ఉత్తమ కథలు