పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు... రాష్ట్రాల‌పై పెరుగుతున్న ఒత్తిడి ?

పెట్రోల్, డీజిల్ ధ‌ర‌ల పెరుగుద‌ల వ‌ల్ల కేంద్రంతో పాటు రాష్ట్ర ప్ర‌భుత్వాలు కూడా ప్ర‌జ‌ల ఆగ్ర‌హావేశాల‌ను చ‌విచూస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ఏపీ వంటి ప‌లు రాష్ట్రాలు త‌మ ప‌రిధిలోని ప‌న్నుల‌ను త‌గ్గించేందుకు సిద్ధ‌ప‌డుతున్నాయి.

news18-telugu
Updated: September 10, 2018, 5:02 PM IST
పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు... రాష్ట్రాల‌పై పెరుగుతున్న ఒత్తిడి ?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
పెట్రోల్, డీజిల్ ధ‌ర‌ల‌పై కేంద్రంతో పాటు రాష్ట్ర ప్ర‌భుత్వాలు కూడా విడిగా ప‌న్నులు విధిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టివ‌ర‌కు ఈ ప‌న్నుల గురించి ఎవ‌రూ అంత‌గా ప‌ట్టించుకోలేదు. అయితే కొద్ది రోజులు పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు క్ర‌మ‌క్ర‌మంగా పెరుగుతుండ‌టంతో... ప్ర‌జ‌ల నుంచి ప్ర‌భుత్వాల‌పై ఒత్తిడి పెరిగే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఓ వైపు పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు త‌గ్గించాలంటూ కేంద్రంపై ఒత్తిడి చేస్తూనే... రాష్ట్ర ప్ర‌భుత్వాలు కూడా త‌మ ప‌రిధిలోని పన్నుల‌ను త‌గ్గించాల‌ని కాంగ్రెస్ పార్టీ కోరుతోంది.

మ‌రోవైపు ప్ర‌జ‌ల్లో ఆగ్ర‌హావేశాలను త‌గ్గించేందుకు ప‌లు రాష్ట్రాలు కూడా ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకుంటున్నారు. ఇప్ప‌టికే త‌మ రాష్ట్రం ప‌రిధిలో పెట్రోల్‌, డీజిల్‌పై 4 శాతం వ్యాట్ త‌గ్గిస్తున్న‌ట్టు త్వ‌ర‌లోనే ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోయే రాజ‌స్థాన్ రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఇది బీజేపీ పాలిత రాష్ట్రం కావ‌డం మ‌రో విశేషం. తాజాగా రాజ‌స్థాన్ దారిలోనే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం కూడా ప‌య‌నించింది. పెట్రోల్‌, డీజిల్‌పై రూ. 2 మేర వ్యాట్‌ను త‌గ్గిస్తున్న‌ట్టు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అసెంబ్లీలో ప్ర‌క‌ట‌న చేశారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ స‌హా ప‌లు పార్టీలు దీనిపై బంద్ చేప‌ట్ట‌డ‌టం... ముందు రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌రిధిలోని ప‌న్నులు త‌గ్గించుకోవాల‌ని ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ డిమాండ్ చేయ‌డంతో టీడీపీ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది.

మ‌రోవైపు ఈ నిర్ణ‌యం ఇత‌ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు, కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తాయ‌ని నిపుణులు భావిస్తున్నారు. ఇప్ప‌టికే పెట్రోల్, డీజిల్ ధ‌ర‌ల‌ను త‌గ్గించేది లేద‌ని... అది త‌మ ప‌రిధిలో లేని అంశ‌మని కేంద్రం చెబుతోంది. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వాలు పెట్రో ఉత్ప‌త్తుల‌పై ఎంతో కొంత ప‌న్నులు త‌గ్గించుకుంటే చివ‌ర‌కు కేంద్రం కూడా దిగిరాక త‌ప్ప‌ని ప‌రిస్థితి ఉంటుంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

మ‌రోవైపు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధ‌ర‌ల‌ను సాకుగా చూపిస్తూ... వీటిని కూడా జీఎస్టీ ప‌రిధిలోకి తీసుకురావాల‌ని కేంద్రం మరోసారి త‌న పాత వాద‌న‌ను తెర‌పైకి తీసుకొచ్చే అవ‌కాశం లేక‌పోలేదు. మొత్తానికి పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల పెరుగుద‌ల వ‌ల్ల కేంద్రంతో పాటు రాష్ట్ర ప్ర‌భుత్వాల‌పై కూడా అంతే స్థాయిలో ఒత్తిడి పెరుగుతున్న‌ట్టు క‌నిపిస్తోంది.
First published: September 10, 2018, 4:57 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading