హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

PM Modi: స్టార్టప్‌లు, MSMEలకు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట.. ఉద్యోగాల కల్పనే ప్రధాన లక్ష్యమన్న మోదీ

PM Modi: స్టార్టప్‌లు, MSMEలకు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట.. ఉద్యోగాల కల్పనే ప్రధాన లక్ష్యమన్న మోదీ

ప్రధాని మోదీ (ఫైల్ ఫోటో)

ప్రధాని మోదీ (ఫైల్ ఫోటో)

దేశంలో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కేంద్రం కృషి చేస్తోందని చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ. యువతకు, మహిళలకు పూచీకత్తు లేకుండా, తక్కువ వడ్డీలకు రుణాలు అందించి ప్రోత్సహిస్తోందని తెలిపారు.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

PM Modi : దేశంలో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కేంద్రం కృషి చేస్తోందని చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ. యువతకు, మహిళలకు పూచీకత్తు లేకుండా, తక్కువ వడ్డీలకు రుణాలు(Loans) అందించి ప్రోత్సహిస్తోందని తెలిపారు. గురువారం మహారాష్ట్ర ప్రభుత్వ రోజ్‌గార్ మేళా( Rozgar Mela)ను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అభినందించారు. ఆయన ప్రసంగంలో కీలక అంశాలు తెలుసుకుందాం.

పూచీకత్తు లేకుండా రూ.20 లక్షల కోట్ల రుణాలు

స్టార్టప్‌లు(Start-ups), ఎంఎస్‌ఎంఈ(MSME)లకు పెద్దపీట వేస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మారుతున్న కాలంలో ఉద్యోగాల స్వభావం వేగంగా మారుతోందని చెప్పారు. ప్రభుత్వం నిరంతరం వివిధ రకాల ఉద్యోగాల కోసం అవకాశాలను సృష్టిస్తోందని పేర్కొన్నారు. ముద్ర పథకం యువతకు ఎలాంటి పూచీకత్తు లేకుండా రుణాలు అందిస్తోందని, దాదాపు రూ.20 లక్షల కోట్ల విలువైన రుణాలు ఇప్పటికే అందించినట్లు చెప్పారు. వెనుకబడిన వర్గాలు, మధ్యతరగతికి చెందిన వారు, మహిళలలు అందరికీ ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలు సమానంగా అందుబాటులోకి రావడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వివరించారు. స్వయం సహాయక సంఘాలతో అనుబంధం ఉన్న ఎనిమిది కోట్ల మంది మహిళలకు రూ.5లక్షల కోట్ల విలువైన సహాయాన్ని అందించామని తెలిపారు.

Gujarat Assembly Elections: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల.. పోలింగ్ ఎప్పుడంటే..?

225 ప్రాజెక్టులకు ఆమోదం

దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(Information Technology), ఇతర రంగాలలో ప్రభుత్వ పెట్టుబడులు కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తున్నాయని ప్రధాని మోదీ తెలిపారు. మహారాష్ట్రకు సంబంధించి రూ.2 లక్షల కోట్ల కంటే ఎక్కువ విలువైన 225 ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. అందులో రూ.75,000 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు, రూ.50 కోట్ల విలువైన ఆధునిక రహదారుల ప్రాజెక్టులు ఉన్నాయని చెప్పారు. ఈ ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయని, కొన్నింటి పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని వివరించారు. ప్రభుత్వం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేసినప్పుడు, లక్షలాది కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు.

రోజ్‌గార్ మేళా కాన్సెప్ట్ కేంద్ర స్థాయిలో ధన్‌తేరాస్‌తో ప్రారంభమైందని మోదీ అన్నారు. కేంద్ర ప్రభుత్వ స్థాయిలో 10 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే ప్రచారానికి ఇది నాంది అని చెప్పారు. యువతకు ఉపాధి కల్పించే దిశగా మహారాష్ట్ర ప్రభుత్వం దృఢ సంకల్పంతో ముందుకు సాగుతోందని, ఇంత తక్కువ సమయంలో రోజ్‌గార్ మేళా నిర్వహించడం ద్వారా స్పష్టమవుతోందని చెప్పారు. ఇలాంటి జాబ్ మేళాలు మహారాష్ట్రలో ఎక్కువగా జరుగుతుండటం సంతోషంగా ఉందని మోదీ చెప్పారు.

First published:

Tags: Msme, Pm modi, Startups

ఉత్తమ కథలు