STADIUM IS EMPTIED ATHLETES TOLD TO LEAVE SO THAT IAS OFFICER CAN WALK WITH DOG PVN
కుక్కతో వాకింగ్ కోసం..స్టేడియాన్నే ఖాళీ చేయిస్తున్న ఐఏఎస్..సరిహద్దులకు అతడిని ట్రాన్స్ ఫర్ చేసిన కేంద్రం
భార్య,పెంపుడు కుక్కతో కలిసి స్టేడియంలో ఐఏఎస్
IAS officer can walk with dog : బాధ్యతగా మెలగాల్సిన ఓ ఐఏఎస్(IAS)అధికారి చేస్తోన్న నిర్వాకం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. తన కుక్కతో కలిసి సాయంత్రం వాకింగ్ చేయడానికి ఏకంగా ఎప్పుడూ క్రీడాకారులతో బిజీగా ఉండే ఓ స్టేడియాన్ని ఉపయోగిస్తున్నారు ఐఏఎస్ అధికారి.
IAS officer can walk with dog : బాధ్యతగా మెలగాల్సిన ఓ ఐఏఎస్(IAS)అధికారి చేస్తోన్న నిర్వాకం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. తన కుక్కతో కలిసి సాయంత్రం వాకింగ్ చేయడానికి ఏకంగా ఎప్పుడూ క్రీడాకారులతో బిజీగా ఉండే ఓ స్టేడియాన్ని ఉపయోగిస్తున్నారు ఐఏఎస్ అధికారి. అయితే, తన శునకంతో కలిసి స్టేడియంలోకి వచ్చే క్రమంలో ఆ ఆధికారి సాధారణ సమయం కంటే ముందుగానే అక్కడి అథ్లెట్లు, ఫుట్‌బాల్ క్రీడాకారులకు శిక్షణను ముంగించాలని ఒత్తిడి తీసుకువస్తున్నారు. దీంతో అక్కడ శిక్షణ పొందుతున్న వారితో పాటు నిత్యం ప్రాక్టిస్ చేయడానికి వస్తున్న క్రీడాకారులు, అథ్లెట్లు, కోచ్ లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకోవడం గమనార్హం.
ఢిల్లీలోని త్యాగరాజ్ స్టేడియం... సాధారణంగా సాయంత్రం ఏడు గంటలవరకు క్రీడాకారులు, శిక్షకులతో బిజీ ఉంటుంది. అయితే ఢిల్లీ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ (రెవెన్యూ) సంజీవ ఖిర్వార్ మాత్రం ఆ స్టేడియాన్ని తన పెంపుడు కుక్కతో వాకింగ్ చేసేందుకు ఉపయోగించుకుంటున్నారు. ఇందుకోసం నిర్ణీత సమయం కంటే ముందే క్రీడాకారులను స్టేడియం నుంచి వెళ్లగొట్టాలని నిర్వాహకులకు సూచించారు. దీంతో సాయంత్రం ఏడు గంటలకంటే ముందు క్రీడాకారులు, శిక్షకులను బయటకు పంపిస్తున్నారు. అనంతరం ఓ అరగంట తర్వాత ఆ ఐఏఎస్ అధికారి తన పెంపుడు శునకంతో అక్కడకు చేరుకొని తాపీగా వాకింగ్ చేసుకుంటున్నారు. కొన్ని నెలలుగా ఐఏఎస్ అధికారి చేస్తున్న నిర్వాకంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. రాత్రి 8.30 వరకు సాధన చేసేవాళ్లమని,ఐఏఎస్ అధికారి తీరుతో తమకు ఆటంకం కలుగుతోందని క్రీడాకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కోచ్‌లు మరియు అథ్లెట్లు మాట్లాడుతూ.. ఇక్కడి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని చాలా మంది అథ్లెట్లు తమ శిక్షణను జవహర్లాల్ నెహ్రూ స్టేడియంకు మార్చుకున్నారని తెలిపారు. ఇంతకుముందు, మేము రాత్రి 8.30 వరకు మరియు కొన్నిసార్లు రాత్రి 9 గంటల వరకు శిక్షణ పొందాము.. కానీ ఇప్పుడు మాకు అలాంటి పరిస్థితి లేదు అని తెలిపారు. ఐఏఎస్ అధికారి చేస్తోన్న నిర్వాకం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావడం వల్ల స్పందించింది ఢిల్లీ ప్రభుత్వం. . రాత్రి 10 గంటల వరకు నగరంలోని స్టేడియాలన్నీ క్రీడాకారులకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా వెల్లడించారు.
అయితే తనతోపాటు తన పెంపుడు శునకాన్ని అప్పుడప్పుడు వాకింగ్‌కు తీసుకువెళ్లిన మాట వాస్తవమేని..అయితే అది క్రీడాకారులు, శిక్షకులకు ఎటువంటి ఇబ్బంది కలిగించలేదని చెప్పుకొచ్చారు ఐఏఎస్ అధికారి సంజీవ ఖిర్వార్. సంజీవ్ ఖిర్వార్ మాట్లాడుతూ.. "నేను ఒక క్రీడాకారుడిని స్టేడియం వదిలి వెళ్ళమని ఎప్పుడూ చెప్పను. స్టేడియం మూతబడిన తర్వాత నేను బయలుదేరుతాను. మేము కుక్కను ట్రాక్‌పై వదిలిపెట్టము. చుట్టూ ఎవరూ లేనప్పుడు మేము దానిని విడిచిపెట్టాము. అందులో అభ్యంతరకరం ఏదైనా ఉంటే ఆపేస్తాను"అని అన్నారు.
ఇక, ఈ ఘటనను కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. స్టేడియాన్ని దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై...సంజీవ ఖిర్వార్ దంపతులను బదిలీ చేసింది. AGMUT క్యాడర్‌కు చెందిన 1994 బ్యాచ్ ఐఏఎస్ అధికారి ఖిర్వార్ను లద్దాఖ్‌కు, ఆయన భార్య అను దుగ్గాలను అరుణాచల్ ప్రదేశ్‌కు బదిలీ చేస్తున్నట్లు కేంద్ర హోం శాఖ. ఉత్తర్వులు జారీ చేసింది.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.