Home /News /national /

SRINAGAR TERROR ATTACK TWO TEACHERS KILLED IN A TERRORIST ATTACK AT A GOVERNMENT SCHOOL IN THE IDDGAH SANGAM AREA OF SRINAGAR SK

Srinagar Terror Attack: స్కూళ్లోకి చొరబడి ఉగ్రవాదుల కాల్పులు.. శ్రీనగర్‌‌లో ఇద్దరు టీచర్లు మృతి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Srinagar Terror Attack: స్కూల్‌లోకి ఆయుధాలతో చొరబడిన ఉగ్రవాదులు బీభత్సం సృష్టించారు. సతిందర్ కౌర్, దీపక్ చాంద్ అనే ఇద్దరు ఉపాధ్యాయులపై తుపాకులతో కాల్పులు జరిపారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు.

    జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు మళ్లీ పేట్రేగిపోతున్నారు. మొన్నటి వరకు ఆర్మీ, పోలీస్ బలగాలను టార్గెట్ చేసి దాడులకు పాల్పడిన టెర్రరిస్టులు.. ఇప్పుడు కొత్త పంథాను ఎంచుకున్నారు. సామాన్య ప్రజలను కూడా బలితీసుకుంటున్నారు. రెండు రోజుల క్రితం ముగ్గురు పౌరులను కాల్చిచంపిన ఘటనలను మరవకముందే...తాజాగా మరోసారి శ్రీనగర్‌లో రెచ్చిపోయారు. గురువారం ఉదయం స్కూళ్లలోకి చొరబడి కాల్పులో బీభత్సం సృష్టించారు. ఉగ్రవాదుల కాల్పుల్లో స్కూల్ ప్రిన్సిపాల్‌తో పాటు మరో ఉపాధ్యాయుడు మరణించారు. శ్రీనగర్‌లోని సఫాకాదాల్ ప్రాంతంలోని ఓ ప్రభుత్వ స్కూల్‌లో ఈ ఘటన జరిగింది. స్కూల్‌లోకి ఆయుధాలతో చొరబడిన ఉగ్రవాదులు బీభత్సం సృష్టించారు. సతిందర్ కౌర్, దీపక్ చాంద్ అనే ఇద్దరు ఉపాధ్యాయులపై తుపాకులతో కాల్పులు జరిపారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు. తీవ్రంగా గాయపడిన ఉపాధ్యాయులను హుటాహుటిన SKIMS ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే వారిద్దరు మరణించినట్లు డాక్టర్లు ప్రకటించారు.

    BS Yediyurappa: యడియూరప్పకు ఐటీ షాక్.. మాజీ సీఎం సన్నిహితుల నివాసాల్లో సోదాలు



    Vehicle scrappage: మీ దగ్గర పాత వాహనాలున్నాయా? కేంద్రం బంపర్ ఆఫర్..

    మంగళవారం జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు వేర్వేరు చోట్ల దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. శ్రీనగర్‌లోని ఇక్బాల్ పార్క్ సమీపంలో ఓ మెడికల్ షాప్‌పై దాడి చేశారు. షాప్‌లో విధులు నిర్వర్తిస్తున్న మఖన్ లాల్ బింద్రూ అనే ఫార్మాసిస్ట్‌పై కాల్పులు జరిపారు. తీవ్ర గాయాలపాలైన అతడిని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మరణించారు. మఖన్ లాల్ బింద్రూ చాలా కాలంగా ఫార్మసీ నిర్వహిస్తున్నారు. అంతేకాదు ఉన్నంతలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. స్థానికంగా మంచి పేరుంది. అలాంటి వ్యక్తిని ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారు. ఈ ఘటన జరిగిన గంట తర్వాత లాల్ బజార్ ప్రాంతంలో ఓ స్థానికేతరుడిని కూడా ఉగ్రవాదులు కాల్చిచంపారు. రోడ్డు పక్కన భెల్ పూరీ అమ్ముతున్న ఆ వ్యక్తిపై కాల్పులు జరిపారు. బుల్లెట్ గాయాలతో అతడు అక్కకడికక్కడే మరణించాడు.

    UP Accident: ఆవును తప్పించబోయి లారీని ఢీకొట్టిన బస్సు.. 13 మంది మృతి

    అదే రోజు బండిపోరా జిల్లాలో నైద్ఖయ్ ప్రాంతంలో మహమ్మద్ షఫీ అనే వ్యక్తిపైనా దాడి చేశారు. తుపాకీలో కాల్పులు జరిపి అతడిని చంపేశారు. ఒకే రోజు మూడు ఘటనలు జరగడం.. అందులోనూ మృతులంతా సాధారణ ప్రజలే కావడంతో.. స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఐతే మఖన్ లాల్ బింద్రూను తాము చంపేసినట్లు ది రెసిస్టెంట్ ఫ్రంట్ (TRF) అనే ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఆరోగ్య శిబిరాలతో పేరిట కాశ్మీర్ వ్యతిరేక కార్యకలాపాలు జరుపుతున్నాడని, యువతను తప్పుదోవ పట్టిస్తున్నాడని... అందుకే చంపేశామని ప్రకటన విడుదల చేసింది. ఇలాంటి ఘటనలు కొనసాగుతాయని.. కాశ్మీర్‌కు వ్యతిరేకంగా పనిచేసే ఏ ఒక్కరినీ వదిలిపెట్టమని వార్నింగ్ ఇచ్చారు. బింద్రూ హత్యతో స్థానిక కాశ్మీర్ పండిట్లు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కాశ్మీరీ పండిట్లకు రక్షణ కల్పించాలని ఆందోళనలు చేపట్టారు. అంతలోనే శ్రీనగర్‌లో మరో ఉగ్రదాడి జరగడం, ఇద్దరు టీచర్లను హత్య చేయడం.. సంచలనం సృష్టిస్తోంది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Jammu and Kashmir, Srinagar, Terror attack, Terrorism

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు