హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Tulip Festival: ట్యులిప్ ఫెస్టివల్ కి సిద్ధమవుతోన్న శ్రీనగర్.. వెళ్లేందుకు మీరు సిద్ధమా?

Tulip Festival: ట్యులిప్ ఫెస్టివల్ కి సిద్ధమవుతోన్న శ్రీనగర్.. వెళ్లేందుకు మీరు సిద్ధమా?

ట్యులిప్ గార్డెన్‌లో పూసిన పూలు

ట్యులిప్ గార్డెన్‌లో పూసిన పూలు

అయితే ఐదు రోజుల క్రితమే మార్చి 25న ఈ గార్డెన్ ని సందర్శకులు చూసేందుకు ఓపెన్ చేశారు. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్నా ఈ ఐదు రోజుల్లోనే ఇక్కడికి దాదాపు యాభై వేల మంది రావడం విశేషం. అయితే ఇంకా పూలు పూర్తిగా పూయలేదని..

  చూస్తే కళ్లు రెప్పవేయడానికి కూడా ఆలోచించేంత అందమైన ఆసియాలోనే అతి పెద్ద ట్యులిప్ గార్డెన్ మన దేశంలోనే ఉంది. శ్రీనగర్ లోని ఇందిరా గాంధీ మెమోరియల్ ట్యులిప్ గార్డెన్ మన దేశానికే స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పుకోవచ్చు. ఏటా వసంత కాలంలోనే పూసే ఈ పూలను చూసేందుకు ఎన్నో దేశాల నుంచి యాత్రికులు కశ్మీర్ చేరుకుంటూ ఉంటారు. 2007 లో ప్రారంభమైన ఈ గార్డెన్ ని చూసేందుకు ఏటా ఏప్రిల్ లో యాత్రికులకు అనుమతినిస్తారు. అంతేకాదు.. ట్యులిప్ ఫెస్టివల్ ని కూడా నిర్వహిస్తారు. ఈ ఏడాది ట్యులిప్ ఫెస్టివల్ ని ఏప్రిల్ 3 నుంచి ఆరు రోజుల పాటు నిర్వహించనున్నారు. అయితే ఐదు రోజుల క్రితమే మార్చి 25న ఈ గార్డెన్ ని సందర్శకులు చూసేందుకు ఓపెన్ చేశారు. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్నా ఈ ఐదు రోజుల్లోనే ఇక్కడికి దాదాపు యాభై వేల మంది రావడం విశేషం. అయితే ఇంకా పూలు పూర్తిగా పూయలేదని.. అవి పూర్తిగా పూసిన తర్వాత, ఫెస్టివల్ ప్రారంభమైన తర్వాత ఇంకా ఎక్కువ మంది వచ్చే అవకాశాలున్నాయని ఇక్కడి అధికారులు వెల్లడిస్తున్నారు.


  జబర్వాన్ కొండల అంచున నెలకొని ఉన్న ఈ గార్డెన్ 35 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇందులో పదిహేను లక్షల వెరైటీల ట్యులిప్స్ ఉండడం విశేషం. ఏప్రిల్ 3న ప్రారంభం కానున్న ట్యులిప్ ఫెస్టివల్ లో భాగంగా ఇక్కడ కల్చరల్ షోలు, మ్యూజికల్ ఈవెనింగ్స్ వంటి కార్యక్రమాలు కొనసాగనున్నాయి. వీటిలో కశ్మీర్ సంస్కృతి సంప్రదాయాలను హైలైట్ చేసి చూపనున్నారు. వివిధ ప్రదేశాల నుంచి వచ్చిన వారితో 25 స్టాళ్లు కూడా ఏర్పాటు చేశారు. తాజాగా ప్రధాన మంత్రి మోదీ కూడా ఈ ట్యులిప్ గార్డెన్ సందర్శించాల్సిందిగా అందరికీ పిలుపునిచ్చారు.


  ఈ ట్యులిప్ గార్డెన్ రోజూ ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకూ తెరిచి ఉంటుంది. పిల్లలకు రూ. 25, పెద్దలకు రూ. 50 ఎంట్రీ టికెట్ తీసుకొని లోపలికి వెళ్లవచ్చు. శ్రీ నగర్ కి 9 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ గార్డెన్ కి శ్రీ నగర్ నుంచి బస్సులు, కార్లు అన్ని రకాల ట్రాన్స్ పోర్ట్ సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. ఎరుపు, తెలుపు, పసుపు, ఆరెంజ్ వంటి రంగులతో పాటు మిక్స్డ్ కలర్ ట్యులిప్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.

  First published:

  Tags: Jammu and Kashmir, Srinagar

  ఉత్తమ కథలు