మత్స్యకార ఖైదీల విడుదల.. మోదీకి శ్రీలంక అధ్యక్షుడు హామీ

నిఘా వర్గాల బలోపేతం, ఉగ్రవాద నిర్మూలన కోసం ప్రధాని మోదీ శ్రీలంకకు రూ.3230 కోట్లు రుణ సాయం ప్రకటించారు .

news18-telugu
Updated: November 29, 2019, 5:09 PM IST
మత్స్యకార ఖైదీల విడుదల.. మోదీకి శ్రీలంక అధ్యక్షుడు హామీ
నిఘా వర్గాల బలోపేతం, ఉగ్రవాద నిర్మూలన కోసం ప్రధాని మోదీ శ్రీలంకకు రూ.3230 కోట్లు రుణ సాయం ప్రకటించారు .
  • Share this:
భారత్‌లో శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స పర్యటన కొనసాగుతోంది. ఢిల్లీలో ప్రధాని మోదీ, గొటబాయ సమావేశమై ఇరుదేశ సంబంధాలు, వాణిజ్యంపై చర్చించారు. ఉగ్రవాద నిర్మూలన కోసం ఇరుదేశాల కలిసి కట్టుగా పనిచేయాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. సమావేశంలో తమిళ మత్య్సకారుల అంశంపైనా చర్చ జరిగింది. శ్రీలంక జైల్లో మగ్గుతున్న మత్స్యకార ఖైదీలను విడుదల చేస్తామని ఈ సందర్భంగా మోదీకి హామీ ఇచ్చారు గొటబాయ. ఇక శ్రీలంకలోని నిఘా వర్గాల బలోపేతం, ఉగ్రవాద నిర్మూలన కోసం ప్రధాని మోదీ శ్రీలంకకు రూ.3230 కోట్లు రుణ సాయం ప్రకటించారు. గురువారం భారత్‌కు చేరుకున్న గొటబాయ మూడు రోజుల పాటు భారత్‌లో పర్యటిస్తున్నారు. 10 రోజుల క్రితం శ్రీలంక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ఆయన.. భారత్‌లో సంబంధాల బలోపేతం కోసమే తొలి విదేశీ పర్యటన భారత్‌లో చేస్తున్నారు. భారత్‌తో లంక సంబంధాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని చెప్పారు గొటబాయ.First published: November 29, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు