హోమ్ /వార్తలు /జాతీయం /

Srilanka Blasts : భారత్ కూడా శ్రీలంకను హెచ్చరించింది.. అయినప్పటికీ..

Srilanka Blasts : భారత్ కూడా శ్రీలంకను హెచ్చరించింది.. అయినప్పటికీ..

పేలుళ్లు జరిగిన ప్రాంతంలో చిత్రం

పేలుళ్లు జరిగిన ప్రాంతంలో చిత్రం

శ్రీలంక పేలుళ్లలో మృతుల సంఖ్య 310కి పెరగ్గా.. క్షతగాత్రుల సంఖ్య 500 పైచిలుకు ఉంది. మృతుల్లో 39 మంది ఉన్నట్టు తేలింది. గాయపడ్డవారిలో విషమ పరిస్థితుల్లో ఉన్నవారు ఎక్కువమందే ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

    శ్రీలంకలో రక్తపుటేరులు పారించింది తామే అని ఐసిస్(ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్&సిరియా) ఉగ్రవాద సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే. దాడులకు పాల్పడ్డ 8 మంది ఫోటోలను కూడా ఆ సంస్థ విడుదల చేసింది. ఇందులో ఏడుగురు తమ ముఖాలకు ముసుగులు వేసుకుని ఉండగా.. ముగ్గురు తమ చేతుల్లో కత్తులు పట్టుకుని నిలబడ్డారు. గుబురు గడ్డంతో చేతిలో రైఫిల్‌తో ఉన్న ఒక వ్యక్తి మాత్రం ముఖానికి ముసుగు లేకుండా కనిపించాడు.


    ఇంతటి మారణహోమానికి ఐసిస్ ప్రధాన కారణమైతే.. ముందస్తు సమాచారం ఉన్నా దాడులను అరికట్టడంలో వైఫల్యం చెందిన శ్రీలంక ప్రభుత్వం కూడా పరోక్షంగా ఇంతమంది చావులకు కారణమైంది. శ్రీలంక ఇంటలిజెన్స్ మాత్రమే కాదు.. ఉగ్రదాడులకు సరిగ్గా రెండు గంటల ముందు భారత ఇంటలిజెన్స్ కూడా శ్రీలంకను హెచ్చరించింది. దేశంలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని.. అప్రమత్తంగా ఉండాలని సమాచారం అందించింది.


    దాడులు జరగడానికి కొన్ని గంటల ముందే కాదు.. అంతకు ముందు రోజు రాత్రి కూడా భారత్ శ్రీలంకను హెచ్చరించింది. ఆ తర్వాత శ్రీలంక ఇంటలిజెన్స్ కూడా ప్రభుత్వానికి సమాచారం అందించింది. అయినప్పటికీ లంక ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు లేకపోవడంతో ఐసిస్ పేట్రేగిపోయింది. ప్రభుత్వ వైఫల్యంపై అక్కడి ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. అధ్యక్షుడికి, ప్రధానికి మధ్య సరైన కమ్యూనికేషన్ లేకపోవడం వల్లే అసలేం జరుగుతుందో సమీక్షించే అవకాశం కూడా లేకుండా పోయిందని ఆరోపిస్తున్నారు.


    కాగా, శ్రీలంక పేలుళ్లలో మృతుల సంఖ్య 310కి పెరగ్గా.. క్షతగాత్రుల సంఖ్య 500 పైచిలుకు ఉంది. మృతుల్లో 39 మంది ఉన్నట్టు తేలింది. గాయపడ్డవారిలో విషమ పరిస్థితుల్లో ఉన్నవారు ఎక్కువమందే ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.


    ఇది కూడా చదవండి : SRILANKA BLASTS : పేలుళ్ల తర్వాత లంక ప్రజలు ఏమనుకుంటున్నారు..? ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది..?

    First published:

    Tags: Columbo Bomb Blast, Pulwama Terror Attack, Sri Lanka, Sri Lanka Blasts, Terror attack, Terrorism

    ఉత్తమ కథలు