Home /News /national /

SPIRITUAL FOUNDATIONS FOR INDIAN INDEPENDENCE STRUGGLE MODIS REMARKS ON SIVAGIRI PILGRIMAGE ANNIVERSARY GH VB

PM Modi: భారతదేశ స్వాతంత్య్ర పోరాటానికి ఆధ్యాత్మిక పునాదులు.. శివగిరి తీర్థయాత్ర వార్షికోత్సవంలో మోదీ వ్యాఖ్యలు..

ప్రధాన మంత్రి మోదీ

ప్రధాన మంత్రి మోదీ

శివగిరి తీర్థయాత్ర 90వ వార్షికోత్సవం, బ్రహ్మ విద్యాలయ స్వర్ణోత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీ(PM Modi) స్వాతంత్ర్య పోరాటం గురించి మాట్లాడారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పురస్కరించుకొని భారతదేశ స్వాతంత్ర్య పోరాటాలను వివరించారు.

ఇంకా చదవండి ...
భారతదేశానికి స్వాతంత్య్రం(Independence) దక్కి దాదాపు 75 సంవత్సరాలు పూర్తి కానున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం(Central Government) "ఆజాదీ కా అమృత్ మహోత్సవ్"(Azadi ka Amrit Mahotsav) నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. శివగిరి తీర్థయాత్ర 90వ వార్షికోత్సవం, బ్రహ్మ విద్యాలయ స్వర్ణోత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీ(PM Modi) స్వాతంత్య్ర పోరాటం గురించి మాట్లాడారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పురస్కరించుకొని భారతదేశ స్వాతంత్య్ర పోరాటాలను వివరించారు. భారతదేశ స్వాతంత్య్ర పోరాటం ఆధ్యాత్మిక పునాదిపై(Spiritual Foundation) ఆధారపడి ఉందని, నిరసన, రాజకీయ వ్యూహాల వ్యక్తీకరణకు మాత్రమే పరిమితం కాలేదని చెప్పారు.

After 27 Years: అవునా..! ఇది నిజమేనా..? 27 ఏళ్ల తర్వాత ఇలా జరుగుతుందా..? విషయం ఏంటంటే..


శివగిరి తీర్థయాత్ర 90వ వార్షికోత్సవం, ఏడాదిపాటు నిర్వహించే బ్రహ్మ విద్యాలయ స్వర్ణోత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఏడాది పాటు జరిగే ఉమ్మడి వేడుకలకు సంబంధించిన లోగోను కూడా ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘స్వాతంత్య్ర సంగ్రామం బానిసత్వం గొలుసులను బద్దలు కొట్టడానికి జరిగిన పోరాటం అయితే, స్వతంత్ర దేశంగా మనం ఎలా ఉంటామో అనేది కూడా ప్రపంచానికి తెలియజేసింది. మనం దేనిని వ్యతిరేకిస్తున్నామో అనేది ముఖ్యం కాదు, దేని కోసం నిలబడుతున్నాం అనేది చాలా ముఖ్యం' అని చెప్పారు.

తన ఇంటికి సాధువులు విచ్చేయడంపై ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు. కొన్ని సంవత్సరాలుగా శివగిరి మఠం సాధువులు, భక్తులను కలుస్తున్నానని చెప్పారు. వారిని కలుసుకొన్నప్పుడు చాలా ఉత్తేజం పొందుతానని ఆయన గుర్తు చేసుకొన్నారు. అనేక దేశాలు, నాగరికతలు ఆధ్యాత్మికత స్థానంలో భౌతికవాదంతో 'ధర్మ' మార్గం నుండి తప్పిపోయినప్పుడు, భారతదేశంలోని రుషులు ఎల్లప్పుడూ ప్రజల ఆలోచనలను మెరుగుపరిచారని, వారి ప్రవర్తనను బాగు చేశారని ఆయన చెప్పారు. వారి ఆధ్యాత్మిక సేవలను కొనియాడారు.

Give Rs. 900 Per Month to Farmers: రైతులకు గుడ్ న్యూస్.. ఇలా చేస్తే నెలకు రూ.900 ప్రోత్సాహకం.. ప్రకటించిన సీఎం..


దేశంలో అందరికీ ఒకటే కులం ఉందని, అది భారతీయత అని మోదీ అన్నారు. ఆయన మాటల్లో..‘మాకు ఒకే ఒక మతం ఉంది. కర్తవ్యం, ధర్మం ఆచరించడమే నిజమైన సేవ. భారతీయులకు ఉన్న దేవుడు ఒక్కడే, అదే భారతమాత’ అన్నారు.

శివగిరి తీర్థయాత్ర ప్రతి సంవత్సరం డిసెంబర్ 30 నుంచి జనవరి 1 వరకు తిరువనంతపురంలోని శివగిరిలో మూడు రోజుల పాటు జరుగుతుంది. శ్రీ నారాయణ గురువు ప్రకారం.. తీర్థయాత్రల లక్ష్యం ప్రజలకు సమగ్ర అభివృద్ధి, శ్రేయస్సు కలిగించడం, సమగ్ర జ్ఞానాన్ని కలిగించడం. తీర్థయాత్ర, విద్య, పరిశుభ్రత, దైవభక్తి, హస్తకళలు, వాణిజ్యం, వ్యవసాయం, సైన్స్ అండ్ టెక్నాలజీ, వ్యవస్థీకృత ప్రయత్నం అనే ఎనిమిది విషయాలపై దృష్టి పెడుతుంది. 1933లో కొద్దిమంది భక్తులతో ప్రారంభమైన ఈ యాత్ర ఇప్పుడు దక్షిణ భారతదేశంలోని ప్రధాన కార్యక్రమాలలో ఒకటిగా మారింది. కుల, మత, భాషలకు అతీతంగా ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు ఈ యాత్రలో పాల్గొనేందుకు శివగిరిని సందర్శిస్తారు.
Published by:Veera Babu
First published:

Tags: India, Kerala, Pm modi

తదుపరి వార్తలు