స్పైస్ జెట్ విమానంలో ఇరుక్కున్న ఉద్యోగి తల... రెండు భాగాలుగా చేసి...

సాధారణ తనిఖీల్లో భాగంగా, విమానం ఫ్లాప్స్ ను అతను పరిశీలిస్తుండగాఒక్కసారిగా విమానం హైడ్రాలిక్ ప్లాప్స్ కదలడంతో రోహిత్ తల వాటి మధ్య ఇరుక్కుంది.

news18-telugu
Updated: July 10, 2019, 1:00 PM IST
స్పైస్ జెట్ విమానంలో ఇరుక్కున్న ఉద్యోగి తల... రెండు భాగాలుగా చేసి...
స్పైస్ జెట్
news18-telugu
Updated: July 10, 2019, 1:00 PM IST
పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతా విమానాశ్రయంలో విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. మంగళవారం అర్థరాత్రి స్పైస్ జెట్ కు చెందిన ఓ ఏటీఆర్ విమానానికి టెక్నికల్ సిబ్బంది మరమ్మతులు చేస్తున్నారు. రోహిత్ వీరేంద్ర అనే 26 ఏళ్ల యువకుడు మంగళవారం రాత్రి 2:45 నిమిషాల సమయంలో స్పైస్ జెట్ విమానాన్ని మరమ్మతులు నిర్వహిస్తున్నారు. దీంతో ఒక్కసారిగా విమానం హైడ్రాలిక్ ప్లాప్స్ కదలడంతో రోహిత్ తల వాటి మధ్య ఇరుక్కుంది. దీంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు.

సాధారణ తనిఖీల్లో భాగంగా, విమానం ఫ్లాప్స్ ను అతను పరిశీలిస్తుండగా, ఈ ఘటన జరిగిందని ఎయిర్ పోర్టు అధికారులు చెబుతున్నారు.  అధిక ఒత్తిడితో ఫ్లాప్స్ అతని తలను బిగించేశాయని, వెంటనే అతను మరణించాడని అధికారులు తెలిపారు. ఈ ఘటన తరువాత అతని తలను బయటకు తీసేందుకు శరీరం నుంచి వేరు చేయాల్సి వచ్చిందన్నారు. మరోవైపు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అసాధారణ మరణం కింద కేసునమోదు చేసి విచారణ చేపట్టారు. ఆ సమయంలో అక్కడున్న మిగతా సిబ్బందిని కూడా విచారిస్తున్నారు.

First published: July 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...