హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Spicejet : టేకాఫ్ సమయంలో విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన స్పైస్ జెట్ విమానం

Spicejet : టేకాఫ్ సమయంలో విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన స్పైస్ జెట్ విమానం


విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన స్పైస్ జెట్ విమానం

విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన స్పైస్ జెట్ విమానం

SpiceJet flight : ప్రయాణికులను విమానం దింపి, మరో ప్రత్యేక విమానంలో తరలించినట్లు విమానాశ్రయ అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. ఉదయం 9.20 గంటలకు విమానం ఢిల్లీ నుంచి బయలుదేరాల్సి ఉందని అధికారులు తెలిపారు.

ఇంకా చదవండి ...

SpiceJet flight collides with electric pole : ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో తృటిలో పెను ప్రమాదం తప్పింది. సోమవారం ఉదయం ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయం నుంచి జమ్మూకి ప్రయాణికులతో వెళ్తున్న స్పైస్‌జెట్‌ విమానం SG 160 ప్రమాదవశాత్తు విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టింది. పార్కింగ్‌ స్థలంలో నిలిపి ఉంచిన స్పైస్‌జెట్‌ SG160 ప్యాసింజర్‌ విమానం టేకాఫ్‌ చేసేందుకు వెనుకకు కదులుతుండగా, విమానం రెక్క భాగం విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టింది.

దీంతో విమానం కుడి రెక్క స్పల్పంగా ధ్వంసమైంది. ఆ స్తంభం కూడా విరిగిపోయింది. . ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. అయితే, హుటాహుటిన స్పందించిన అధికారులు.. ప్రయాణికులను విమానం దింపి, మరో ప్రత్యేక విమానంలో తరలించినట్లు విమానాశ్రయ అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. ఉదయం 9.20 గంటలకు విమానం ఢిల్లీ నుంచి బయలుదేరాల్సి ఉందని అధికారులు తెలిపారు.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Delhi Airport, SpiceJet

ఉత్తమ కథలు