బీజేపీతో దోస్తీకి శివసేన స్వస్తి..!

news18
Updated: June 6, 2018, 6:13 PM IST
బీజేపీతో దోస్తీకి శివసేన స్వస్తి..!
ఉద్దవ్ థాక్రే- ఫైల్ ఫొటో
  • News18
  • Last Updated: June 6, 2018, 6:13 PM IST
  • Share this:
దేశ రాజకీయాల్లో బీజేపీ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఎన్డీయే నుంచి టీడీపీ బయటకొచ్చింది. కర్ణాటకలో అధికారపగ్గాలు చేజారిపోాయాయి. అటు యూపీలో మూడు కీలక సిట్టింగ్ లోక్‌సభ స్థానాలు కోల్పోయింది. ప్రతిపక్షాలన్నీ ఏకమై బీజేపీని మట్టికరిపించేందుకు వ్యూహాలు సిద్ధం  చేస్తాయి. ఇలాంటి క్లిష్ట తరుణంలో కమలానికి మరోషాక్ ఇచ్చేందుకు శివసేన సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీకి కటీఫ్ చెప్పేందుకు ఉద్దవ్ థాక్రే యోచిస్తున్నట్లు సమాచారం.

మహారాష్ట్రలో బీజేపీ-శివసేన కూటిమి అధికారంలో ఉంది. ఐతే మొన్న జరిగిన లోక్‌సభ ఉప ఎన్నికల్లో శివసేన, బీజేపీకి విడివిడిగానే పోటీచేశాయి. పాల్‌గఢ్‌లో బీజేపీ అభ్యర్థి రాజేంద్ర గవిట్ చేతిలో శివసేన నేత శ్రీనివాస్ వనగ సుమారు 30 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఓటమి అనంతరం ప్రెస్‌మీట్ పెట్టిన ఉద్దవ్ బీజేపీపై నిప్పులు చెరిగారు. తప్పుడు ఈవీఎంల వల్లే తాము ఓడిపోయామని విమర్శించారు.

'2014 ఎన్నికల్లో భారీ మెజార్టీతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసినప్పుడు మోడీ ప్రభుత్వం మరో 25 ఏళ్ల పాటు అధికారంలో ఉంటుందన భావించాం. కానీ నాలుగేళ్లలోనే మోడీ ప్రభుత్వం ప్రజల విశ్వాసం  కోల్పోయింది. ఉప ఎన్నికల్లో  దారుణంగా ఓడిపోతోంది. భారీ మెజార్టీ ప్రభుత్వం  ఏర్పాటు చేసిన బీజేపీ... ఎన్డీయేలోని ఇతర పార్టీలను పక్కన బెడుతోంది.' అని ఉద్దవ్ అన్నారు.

ఈ పరిణామాలను చూస్తుంటే శివసేన త్వరలోనే ఎన్డీయే నుంచి బయటకొట్టి బీజేపీకి రాం రాం చెబుతుందని విశ్లేషకులు అభిప్రాయడుతున్నారు. ఐతే అలాంటిదేం జరగదని బీజేపీ నేతలు కొట్టిపారేస్తున్నారు. కాంగ్రెస్‌కు లాభం చేకూర్చే పనులను ఉద్దవ్ థాక్రే చేయరని భావిస్తున్నట్లు బీజేపీ నేత చంద్రకాంత్ పాటిల్ అన్నారు. కాంగ్రెస్ గెలవకూడదంటే.. బీజేపీ,  శివసేన విడివిడిగా పోటీచేయకూడదని తెలిపారు.
Published by: Shiva Kumar Addula
First published: June 1, 2018, 5:57 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading