SPECIAL POOJA OFFERS FOR DEADBODY TO ALIVE IN TAMILNADU VRY
Shocking news : చనిపోయిన శవానికి రెండు రోజులుగా పూజలు.. బతుకుందంటూ పోలీసులను బెదిరింపు.. !
Shocking news : చనిపోయిన వాళ్లు ఎక్కడైనా పూజలు చేస్తే.. బతుకుతారా... ?
Shocking news : చనిపోయిన తల్లి బతుకుందని ఓ ఇద్దరు కూతుళ్లు రెండు రోజుల క్రితమే చనిపోయిన తమ తల్లికి పూజలు చేసిన సంఘటన వెలుగు చూసింది. విషయం తెలుసుకుని పోలీసులు వచ్చినా.. వారిని ఎదిరించడం గమనార్హం.
మూఢ నమ్మకాల పిచ్చి ఓక్కోసారి పీక్‌స్థాయికి వెళుతోంది. ఆధునిక కాలంలో కూడా ఇలాంటీ మూడనమ్మకాల్లో యువతి యువకులు కూడా మునిగిపోతున్నారు.. దీంతో వింత సంఘటనలు ఇటివల చోటు చేసుకుంటున్నాయి.ఇలా ఇటివల ఏపీతో పాటు తెలంగాణలో చనిపోయిన వారిని బతికిస్తామని ఓ పూజారి ప్రత్యేక పూజలు చేసిన సంఘటన వెలుగు చూడగా తాజాగా ఇలాంటీ సంఘటనే తమిళనాడులో చోటు చేసుకుంది.
తమ తల్లి ( dead body ) చనిపోయినప్పటికీ.. తిరిగి బతుకుతుందనే నమ్మకంతో ఆమె మృతదేహం వద్దే మూడు రోజులుగా పూజలు చేశారు ఆమె కూతుళ్లు. ఈ వింత ఘటన తమిళనాడులోని ( Tamilnadu ) తిరుచ్చి జిల్లాలో చోటు చేసుకుంది.
మణపారై సమీపంలోని చొక్కంపట్టి వీజీపీ ఫ్లాట్‌కు చెందిన మేరీ (75) తన కుమార్తెలు జయంతి (43), జెసిందా (40)తో కలిసి ఉంటోంది. గత వారం మేరీకి ఆరోగ్యం సరిగా లేకోవడంతో తిరుచ్చి నగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లగా, అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.
దీంతో చనిపోయిన తమ తల్లి మృతదేహాన్ని ఇంటికి తీసుకుని వెళ్లిన కూతుళ్లు విచిత్రంగా వ్యవహరించారు. అమ్మ మీద ప్రేమ లేక మూఢనమ్మకమో తెలియదు కాని... తల్లి బతకాలని రెండు రోజులుగా మృతదేహం వద్ద పూజలు చేయడం మొదలుపెట్టారు. అయితే.. ఈ పూజ తతంగాన్ని గమనించన ఇరుగుపొరుగువారు పోలీసులకు ( police )సమాచారం అందించారు.
సమాచారాన్ని అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్న ఇంటి లోపలి దృశ్యాన్ని చూసి షాక్‌కు ( shok ) గురయ్యారు.. రెండు రోజుల క్రితమే మేరీ చనిపోయినా, ఆమె బతుకుతుందనే నమ్మకంతో ఆమె మృతదేహం వద్ద ఇద్దరు కుమార్తెలు పూజలు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే..
పోలీసులు వెళ్లి అభ్యంతరం చెప్పినా వారికే చుక్కలు చూపించారు.. తమ తల్లి బతికే ఉందని, త్వరలో నిద్ర లేచి వస్తుందని చెప్పిన కుమార్తెలు పోలీసులను తిరిగి వెనక్కి పంపేందుకు కూడా ప్రయత్నించారు. ఈ క్రమంలో మేరీ మృతదేహాన్ని ( dead body ) తరలించేందుకు వచ్చిన 108 సిబ్బందిని కూడా వారు అడ్డుకున్నారు. చివరికి ఎలానో మేరీ మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులు వారిద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చారు.
Published by:yveerash yveerash
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.