Home /News /national /

Gurmeet Ram Rahim: డేరా బాబా హంతకుడే.. హత్య కేసులో దోషిగా ప్రకటించిన కోర్టు

Gurmeet Ram Rahim: డేరా బాబా హంతకుడే.. హత్య కేసులో దోషిగా ప్రకటించిన కోర్టు

 Dera Baba: డేరా బాబా ఇప్పటికే జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిదే. ఆశ్రమంలో పనిచేసే ఇద్దరు మహిళలపై అత్యాచారం చేసిన కేసులో.. గుర్మీత్ రామ్ రహీమ్‌కు 20 ఏళ్లు జైలు శిక్ష పడింది.

Dera Baba: డేరా బాబా ఇప్పటికే జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిదే. ఆశ్రమంలో పనిచేసే ఇద్దరు మహిళలపై అత్యాచారం చేసిన కేసులో.. గుర్మీత్ రామ్ రహీమ్‌కు 20 ఏళ్లు జైలు శిక్ష పడింది.

Dera Baba: డేరా బాబా ఇప్పటికే జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిదే. ఆశ్రమంలో పనిచేసే ఇద్దరు మహిళలపై అత్యాచారం చేసిన కేసులో.. గుర్మీత్ రామ్ రహీమ్‌కు 20 ఏళ్లు జైలు శిక్ష పడింది.

    గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ (Gurmeet Ram Raheem).. ఈ పేరు ఎవరికీ  పెద్దగా తెలియకపోవచ్చు..కానీ డేరా బాబా అంటే ఈజీగా గుర్తు పడతారు. భక్తిముసుగులో వందల కోట్లు సంపాదించి... మహిళలను లైంగిక వేధింపులకు గురిచేసిన బాబా ఇతడు.  లైంగిక వేధింపుల కేసులో ఇప్పటికే జైల్లో ఊచలు లెక్కపెడుతున్న డేరా బాబాకు మరో బిగ్ షాక్ తగిలింది. తాజాగా ఓ హత్య కేసులో పంచకుల సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం (CBI Special court) ఆయన్ను దోషిగా నిర్ధారించింది.  గతంలో డేరా బాబా ఆశ్రమంలో మేనేజర్‌గా పనిచేసిన రంజిత్ సింగ్(Ranjith Singh) హత్య కేసులో గుర్మీత్ రామ్ రహీమ్‌తో పాటు మరో నలుగురిని దోషులుగా తేల్చింది.  అక్టోబరు 12న శిక్షలను ఖరారు చేయనుంది.

    రంజిత్ సింగ్ డేరా సచ్చా సౌదాలో మేనేజర్‌గా పనిచేశారు.  2002 జులై 10న హర్యానాలోని కురుక్షేత్ర జిల్లా థానేసర్ ఠాణా పరిధిలో.. ఆయన దారుణ హత్యకు గురయ్యారు. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు సక్రమంగా చేయకపోవడంతో బాధిత కుటుంబం హైకోర్టును ఆశ్రయించింది. వారి పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు 2003లో కేసును సీబీఐకి అప్పగించింది.  సీబీఐ విచారణతో డేరా బాబా అసలు రూపం బయట పడింది. ఆయన చేసిన దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగుచూశాయి.

    గులాబ్ జామూన్‌లో బొద్దింక.. హోటల్‌కు చుక్కలు చూపించిన కస్టమర్.. భారీగా జరిమానా

    రంజిత్ హత్యకు డేరా బాబాతో పాటు జస్బీర్ సింగ్, సబ్దీల్ సింగ్, కృష్ణ లాల్, ఇందర్ సైన్‌లు కుట్ర పన్నినట్టు న్యాయస్థానం నిర్ధారించింది.  మహిళలను సెక్స్ బానిసలుగా చేసుకుని డేరా బాబా అరాచకాలను బయట ప్రపంచానికి తెలియజెప్పడానికి అజ్ఞ‌ాత వ్యక్తి పేరుతో రంజింత్ సింగ్ లేఖ రాసినట్టు డేరా బాబా అనుమానించాడని సీబీఐ తన ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. ఇదే లేఖను సిర్సాకు చెందిన జర్నలిస్ట్ రామ్ చందర్ ఛత్రపతి బయటి ప్రపంచానికి పరిచయంచేశారు. అప్పట్లో ఈ వార్త సంచలనం రేపింది. ఐతే ఆ  జర్నలిస్ట్‌ను కూడా చంపేశారని..  ఈ కేసులోనూ డేరా బాబాను కోర్టు దోషిగా నిర్ధారించింది సీబీఐ కోర్టు.

    Exclusive: అరుణాచల్‌ వైపు దూసుకొచ్చిన చైనా దళాలు.. పట్టుకొని నిర్బంధించిన భారత సైన్యం..

    కాగా, డేరా బాబా ఇప్పటికే జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిదే. ఆశ్రమంలో పనిచేసే ఇద్దరు మహిళలపై అత్యాచారం చేసిన కేసులో.. గుర్మీత్ రామ్ రహీమ్‌కు 20 ఏళ్లు జైలు శిక్ష పడింది. భక్తి పేరుతో డేరా సచ్ఛ సౌధను స్థాపించిన గుర్మీత్..  వందల కోట్ల రూపాయల ఆస్తుల్ని వెనకేసుకున్నాడు. దేశ విదేశాల్లోనూ ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి.  విలాసంతమైన భవనాలు,  కార్లు కూడా ఉన్నాయి. కానీ చివరకు అత్యాచారం, హత్య కేసులో దోషిగా తేలడంతో ప్రస్తుతం జైలు జీవితం గడుపుతున్నాడు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: CBI, Dera baba, Haryana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు