సంస్కృతంతో డయాబెటీస్ కంట్రోల్ : బీజేపీ ఎంపీ

బీజేపీ ఎంపీ గణేశ్ ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేశారు. రోజూ సంస్కృతం మాట్లాడటం ద్వారా సుగర్,కొలెస్ట్రాల్ అదుపులో ఉంచుకోవచ్చని చెప్పారు.

news18-telugu
Updated: December 13, 2019, 11:46 AM IST
సంస్కృతంతో డయాబెటీస్ కంట్రోల్ : బీజేపీ ఎంపీ
బీజేపీ ఎంపీ గణేశ్ సింగ్ (Image : Twitter)
  • Share this:
బీజేపీ ఎంపీ గణేశ్ ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేశారు. రోజూ సంస్కృతం మాట్లాడటం ద్వారా సుగర్,కొలెస్ట్రాల్ అదుపులో ఉంచుకోవచ్చని చెప్పారు. సంస్కృతం మాట్లాడటం ద్వారా నాడీ వ్యవస్థ ఉత్తేజితం అవుతుందన్నారు.ఇస్లామిక్ భాషలతో సహా ప్రపంచంలోని 97శాతం భాషలకు సంస్కృతమే ఆధారమన్నారు.అంతేకాదు,కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్ సంస్కృతంలో జరిపితే సిస్టమ్ ఆగకుండా పనిచేస్తుందన్నారు.
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైందన్నారు.సంస్కృత విశ్వవిద్యాలయ బిల్లుపై చర్చ సందర్భంగా గణేశ్ సింగ్ మాట్లాడారు.

ఇక కేంద్రమంత్రి ప్రతాప్ చంద్ర సారంగి మాట్లాడుతూ.. సంస్కృత చాలా సరళమైన భాష అన్నారు. ఒక్కో పదాన్ని ఎన్నో విధాలుగా వాడుకోవచ్చన్నారు. ఇంగ్లీష్‌ పదాలైన బ్రదర్,కౌ వంటి పదాలు సంస్కృతమే నుంచే వచ్చాయన్నారు. సంస్కృతాన్ని ప్రమోట్ చేయడం

మిగతా భాషలపై ప్రభావం చూపదన్నారు.


First published: December 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>