హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Pm Narendra modi: ‘‘ప్రపంచ గతిని మార్చే అసమాన సద్గురువులు ఇక్కడ తిరిగారు’’ : వారణాసిలో ప్రధాని ప్రసంగం

Pm Narendra modi: ‘‘ప్రపంచ గతిని మార్చే అసమాన సద్గురువులు ఇక్కడ తిరిగారు’’ : వారణాసిలో ప్రధాని ప్రసంగం

4. అంతేకాదు అతి తక్కువ తిరస్కరణ రేటు (21 శాతం) కూడా ప్ర‌ధాని మోదీకే ఉంది. ఇది ఆస‌క్తిక‌ర అంశం. అంటే మోదీ ప్ర‌భావం దేశ ప్ర‌జ‌ల‌పై అంత‌గా ఉంద‌నే భావ‌న వ్య‌క్తం అవుతుంది. ప్ర‌తీ విధానంలోనూ మోదీ నిర్ణ‌యాలు న‌చ్చే వారు, న‌చ్చ‌ని వారు మాత్ర‌మే ఉంటున్నారు. ఇత‌రుల ప్ర‌భావం జ‌నంపై త‌క్కువ‌గా ఉంద‌నే భావ‌న వ్య‌క్తం అవుతోంది.(photo:Ani/Twitter)

4. అంతేకాదు అతి తక్కువ తిరస్కరణ రేటు (21 శాతం) కూడా ప్ర‌ధాని మోదీకే ఉంది. ఇది ఆస‌క్తిక‌ర అంశం. అంటే మోదీ ప్ర‌భావం దేశ ప్ర‌జ‌ల‌పై అంత‌గా ఉంద‌నే భావ‌న వ్య‌క్తం అవుతుంది. ప్ర‌తీ విధానంలోనూ మోదీ నిర్ణ‌యాలు న‌చ్చే వారు, న‌చ్చ‌ని వారు మాత్ర‌మే ఉంటున్నారు. ఇత‌రుల ప్ర‌భావం జ‌నంపై త‌క్కువ‌గా ఉంద‌నే భావ‌న వ్య‌క్తం అవుతోంది.(photo:Ani/Twitter)

మోదీ తన కలల ప్రాజెక్టు.. వారణాసి  లోని కాశీ విశ్వనాథ్ కారిడార్‌ను సోమవారం ప్రారంభించారు. అర్ధరాత్రి సమయంలో రైల్వేస్టేషన్​ కలియతిరిగారు మోదీ. ఇక మంగళవారం వారణాసి (Varanasi)లోని స్వర్వేద్‌ మహామందిర్ ధామ్‌ (Swarved Mahamandir Dham)ను సందర్శించారు.

ఇంకా చదవండి ...

భారత ప్రధాని నరేంద్రమోదీ (Prime Minister Narendra Modi) ఉత్తరప్రదేశ్​లోని వారణాసిలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. మోదీ తన కలల ప్రాజెక్టు.. వారణాసి  లోని కాశీ విశ్వనాథ్ కారిడార్‌ను సోమవారం ప్రారంభించారు. అర్ధరాత్రి సమయంలో రైల్వేస్టేషన్​ కలియతిరిగారు మోదీ. ఇక మంగళవారం వారణాసి (Varanasi)లోని స్వర్వేద్‌ మహామందిర్ ధామ్‌ (Swarved Mahamandir Dham)ను సందర్శించారు. ఉమ్రాలోని స్వర్వేద్ మహామందిర్ ధామ్‌లో ఏర్పాటు చేసిన విహంగం యోగా 98వ వార్షికోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీ (modi) పాల్గొన్నారు.  సదాఫల్‌దేవ్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ (Prime Minister Narendra Modi) స్వర్వేద్ ఆలయ విశిష్టతను తెలుసుకొని.. ఈ ప్రాంతాన్ని ప్రత్యేకంగా తిలకించారు. ఆయన వెంట యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్ (CM Yogi Adityanath) కూడా ఉన్నారు.

సాధువులు ఎంతగానో తోడ్పాటునందించారు..

ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) మాట్లాడుతూ.. భావి భారత పౌరులైన బాలికల భవిష్యత్‌ను నిర్దేశించే వారి విద్యపై, నైపుణ్యాభివృద్ధిపై ప్రజలు ప్రధానంగా దృష్టి సారించాలని ప్రధాని మోదీ అన్నారు.  ఆయన మాట్లాడుతూ  ‘స్వాతంత్య్ర సంగ్రామంలో సద్గురు సదాఫల్‌దేవ్‌ (Sadguru Sadafal dev) వంటి ఎందరో సాధువులు ఎంతగానో తోడ్పాటునందించారు. కానీ, వారి కృషికి చరిత్రలో సరైన గుర్తింపు లభించ లేదు’అని మోదీ వ్యాఖ్యానించారు.

సద్గురువులు ఇక్కడ నడయాడారు..

‘భారత్‌ అద్భుతమైంది. సమయం అనుకూలించని వేళా సమకాలిన ప్రపంచ గతిని మార్చే అసమాన సద్గురువులు ఇక్కడ నడయాడారు. స్వాతంత్య్రోద్యమాన్ని ముందుండి నడిపించిన నేతను ‘మహాత్మా’గా ప్రపంచం కీర్తించింది’ అని మోదీ గాంధీజీని ప్రస్తావించారు.

‘సబ్‌కా ప్రయాస్‌’స్ఫూర్తిని అందరూ స్వీకరించాలన్నారు. తమ కుటుంబంతోపాటు సమాజ బాధ్యతను తమదిగా భావించే వారు తోచినంతలో ఒకరిద్దరు నిరుపేద బాలికల విద్య, నైపుణ్యాభివృద్ధి (Education and skill development of poor girls) బాధ్యతలను తీసుకో వాలన్నారు. భారత్‌కు స్వాతంత్య్రం (Independence of India) సిద్ధించి 75 వసంతాలు పూర్తవుతున్న వేళ.. స్వపరిపాలన ఎంత ముఖ్యమో  సుపరిపాలనా అంతే ప్రధానమన్నారు. పర్యటనలో భాగంగా  సుపరిపా లనపై 12 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ (Prime Minister Narendra Modi) కాశీలో చర్చించారు.

ప్రధాని మోదీ (Prime Minister Narendra Modi) వారణాసి రెండోరోజు పర్యటనలో బీజేపీ పాలిత 12 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని సమావేశమయ్యారు. ఇందులో ప్రభుత్వ విధానాలు, పథకాల ప్రచారం, రానున్న అసెంబ్లీ ఎన్నికలు, ప్రజలతో అనుసంధానం వంటి అన్ని అంశాలపై చర్పించారు. అనంతరం స్వర్వేద్ మహామందిర్ ధామ్‌కు చేరుకుని, విహంగం యోగా 98వ వార్షికోత్సవంలో పాల్గొని ఢిల్లీ పయనమయ్యారు.

First published:

Tags: PM Narendra Modi, Uttar pradesh, Varanasi

ఉత్తమ కథలు