స్పేస్ వ్యర్థాలు 45 రోజుల్లో మాయమవుతాయి... నాసా వ్యాఖ్యలకు DRDO అధికారి కౌంటర్

Mission Shakti : భారత్ చేసిన మిషన్ శక్తి ప్రయోగంపై నాసా అభ్యంతరం చెబుతుండటంతో DRDO అధికారి స్పష్టమైన సమాధానం ఇచ్చారు.

news18-telugu
Updated: April 3, 2019, 9:34 AM IST
స్పేస్ వ్యర్థాలు 45 రోజుల్లో మాయమవుతాయి... నాసా వ్యాఖ్యలకు DRDO అధికారి కౌంటర్
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: April 3, 2019, 9:34 AM IST
మార్చి 27 అంతరిక్షంలో తిరిగే శాటిలైట్‌ను కూల్చేసిన భారత్ ప్రయోగం మిషన్ శక్తిపై నాసా తీవ్ర అభ్యంతరాలు చెప్పడంతో... దానిపై భారత్ కూడా తగిన సమాధానం చెప్పింది. భారత్ చేపట్టిన శాటిలైట్ నాశనం చేసే ప్రయోగం వల్ల రోదసిలో 400 స్పేస్ వ్యర్థాలు ఏర్పడ్డాయనీ... వాటిలో కొన్ని 10 సెంటీమీటర్ల కంటే పెద్దగా ఉన్నాయని.. అవి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని ఢీకొట్టే ప్రమాదం ఉందనీ, వ్యోమగాముల ప్రాణాలకే ప్రమాదమని నాసా చీఫ్ జిమ్ బ్రిడెన్స్టైన్ అభిప్రాయపడ్డారు. ఈ ప్రకటనపై వ్యాఖ్యానించేందుకు ఇస్రో నిరాకరించింది. ఈ ప్రయోగాన్ని DRDO చేపట్టినట్లు స్పష్టం చేసింది. ఐతే... DRDO చీఫ్ గానీ, ప్రతినిధి గానీ దీనిపై స్పందించలేదు. DRDOకి చెందిన ఓ అధికారి మాత్రం... ప్రయోగం వల్ల ఏర్పడిన వ్యర్థాలు... 45 రోజుల్లో కనిపించకుండా పోతాయన్నారు.

చైనా ఇదివరకు జరిపిన ప్రయోగాల వల్ల ఏర్పడిన వ్యర్థాలు ఇప్పటికీ అంతరిక్షంలో తిరుగుతున్నాయన్న DRDO అధికారి... భారత స్పేస్ వ్యర్థాలు మాత్రం త్వరలోనే మాయమవుతాయన్నారు. భారత్ పేల్చిన ప్రయోగాత్మక శాటిలైట్ భూమి నుంచీ 300 కిలోమీటర్ల ఎత్తులో తిరిగింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం, ఇతర శాటిలైట్లు దాదాపు 400 కిలోమీటర్ల ఎత్తులో భూమి చుట్టూ తిరుగుతున్నాయి. భారత ప్రయోగం వల్ల ఏర్పడిన శకలాలు... భూమివైపు వస్తాయే తప్ప... పైకి వెళ్లవన్న DRDO అధికారి... వాటి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ... 45 రోజుల్లో అవి వాతావరణంలో ఒరిపిడికి కాలిబూడిదవుతాయని తెలిపారు.


నాసా తన ప్రకటనలో అన్ని వ్యర్థాలూ పెద్దవి కాదనీ... అన్నీ ప్రమాదకరమైనవి కూడా కాదని చెబుతూనే... 60 ముక్కలు మాత్రం... దాదాపు 10 సెంటీమీటర్లు ఉన్నాయనీ... అవి ప్రమాదకరం అని అభిప్రాయపడింది. భారత శాటిలైట్ పగిలినప్పుడు... 24 ముక్కలు... అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం తిరిగే దిశలోకి వెళ్లాయని నాసా తెలిపింది. అవి అంతరిక్ష కేంద్రానికి తగిలే ప్రమాదం ఉందని అంటోంది. కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం సైతం... ఇప్పుడీ పరీక్ష చెయ్యాల్సిన అవసరమే లేదనీ... భారత్‌కి ఇంతకుముందే ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం అంతరిక్షంలో 23,000 వ్యర్థాలు ఇష్టారాజ్యంగా తిరుగుతున్నాయని అమెరికా సైన్యం తెలిపింది. ఇవన్నీ పది సెంటీమీటర్ల కంటే పెద్దవేనని వివరించింది. వీటిలో 10వేల వ్యర్థాలు శాటిలైట్ల నుంచీ వచ్చినవేనని తెలిపింది. వాటిలో 3వేల వ్యర్థాలు... 2007లో చైనా చేపట్టిన యాంటీ శాటిలైట్ ప్రయోగం వల్ల ఏర్పడ్డాయని వివరించింది.ప్రస్తుతం అంతరిక్షంలో 830 శాటిలైట్లతో అమెరికా మొదటిస్థానంలో ఉండగా... 280 ఉపగ్రహాలతో చైనా రెండో స్థానంలో ఉంది. భారత్‌కి చెందినవి 54 శాటిలైట్లు రోదసిలో తిరుగుతున్నాయి.

 

ఇవి కూడా చదవండి :
Loading...
రాకెట్ నుంచీ శాటిలైట్లు అంతరిక్షంలోకి వెళ్లడం ఎప్పుడైనా చూశారా... ఈ వీడియోలో చూడండి...

Video : చూస్తుండగానే సునామీ వచ్చేస్తే... ప్రాణభయంతో పరుగులు పెట్టిన టూరిస్టులు...

ఒక్కో జన్ ధన్ ఖాతాలో రూ.10,000... ఎలా వచ్చాయి... ఎవరు వేశారు? దర్యాప్తు చేస్తున్న ఈసీ

టాలీవుడ్‌ నటులను కేసీఆర్ బ్లాక్‌మెయిల్ చేస్తున్నారా... చంద్రబాబు వ్యాఖ్యల్లో నిజమెంత?
First published: April 3, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...