Home /News /national /

SP MLA WHO MADE CONTROVERSIAL REMARK AGAINST CM FACES BULLDOZER ILLEGAL PETROL PUMP DEMOLISHED PVN

UP Bulldozer : యోగికి వార్నింగ్ ఇచ్చిన ఎస్పీ ఎమ్మెల్యేకు బుల్డోజర్ దెబ్బ

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

MLA Petrol pump demolished : బుల్డోజర్లు విశ్రాంతి తీసుకుంటున్నాయని, ఎన్నికల ఫలితాల తర్వాత వాటికి పని చెబుతామంటూ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ప్రచారం సందర్భంగా కౌంటర్‌ ఇచ్చారు. అయితే యూపీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయంతో మరోసారి సీఎం పగ్గాలు చేపట్టిన యోగి ఆదిత్యనాథ్... ఎన్నికల సమయంలో తాను చెప్పిన మాటను అక్షరాల నిజం చేసి చూపిస్తున్నారు.

ఇంకా చదవండి ...
SP MLA Petrol Pump Demolished  : ఉత్తరప్రదేశ్‌లో తిరిగి అధికారంలోకి వచ్చిన సీఎం యోగి ఆదిత్యనాథ్‌, మళ్లీ బుల్డోజర్లకు పని చెప్పారు. రాష్ట్రంలో బుల్​డోజర్​ కూల్చివేతల పరంపర కొనసాగుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని అధికార బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్షాలపై ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నదని, విపక్ష పార్టీల నేతలకు చెందిన ఆస్తులను బుల్డోజర్లతో ధ్వంసం చేస్తున్నదని..అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ చర్యలను ఆపివేసిందని.. దీంతో ఎన్నికల కోసమే బుల్డోజర్లను వినియోగించడం లేదని ఇటీవల జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ)చీఫ్ అఖిలేష్ యాదవ్ విమర్శించిన విషయం తెలిసిందే. సీఎం యోగిని బుల్డోజర్‌ బాబాగా కూడా అభివర్ణించారు. అయితే బుల్డోజర్లు విశ్రాంతి తీసుకుంటున్నాయని, ఎన్నికల ఫలితాల తర్వాత వాటికి పని చెబుతామంటూ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ప్రచారం సందర్భంగా కౌంటర్‌ ఇచ్చారు. అయితే యూపీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయంతో మరోసారి సీఎం పగ్గాలు చేపట్టిన యోగి ఆదిత్యనాథ్... ఎన్నికల సమయంలో తాను చెప్పిన మాటను అక్షరాల నిజం చేసి చూపిస్తున్నారు. నిందితులు, నేరస్తుల గుండెల్లో గుబులు పుట్టేలా ఆయన వ్యవహరిస్తున్నారు. తప్పు చేస్తే ఏ క్షణంలో అధికారులు బుల్డోజర్ ​ను తమ ఇంటికి తీసుకొస్తారేమో అనే భయం నేరస్తుల్లో నెలకొంది.

అయితే ఇప్పటివరకు అత్యాచారం, ఇతర కేసుల్లో నిందితుల ఆస్తులపై బుల్ ​డోజర్​ ప్రతాపం చూపించగా ఈసారి ఆ లిస్ట్ లో ఏకంగా ఓ ఎమ్మెల్యే చేరారు. గురువారం బరేలీ-ఢిల్లీ జాతీయ రహదారిపై పర్సాఖేడా వద్ద ఉన్న సమాజ్​వాదీ పార్టీ ఎమ్మెల్యే షాజిల్ ఇస్లామ్ అన్సారీకి చెందిన ఓ పెట్రోల్ బంక్​ ను అక్రమంగా నిర్మించారని పేర్కొంటూ బరేలి డెవలప్ మెంట్ అధికారులు దానిని కూల్చేశారు. ఎస్పీ ఎమ్మెల్యే షాజిల్ ఈ మధ్యనే ఆ పెట్రోల్‌ బంక్‌ను నిర్మించారు. అయితే మ్యాప్‌ అప్రూవల్ లేకుండా దీనిని నిర్మించారని బరేలీ జిల్లా అధికారులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఎస్పీ ఎమ్మెల్యే షాజిల్ కు చెందిన పెట్రోల్‌ బంక్‌ ను జేసీబీతో కూల్చివేశారు. ఇదే విషయంపై ఇప్పటికే నోటీసులు ఇచ్చినా స్పందన లేదని.. అందుకే ఈ చర్యలు చేపట్టినట్టు బరేలి అభివృద్ధి ప్రాధికార సంస్థ(బీడీఏ) వైస్ ఛైర్మన్ జోగేంద్ర సింగ్ తెలిపారు.

ALSO READ OMG: ఇంటి నుంచి పనిమీద వెళ్లిన యువకుడు అదృశ్యం.. ఎలాంటి పరిస్థితుల్లో కనిపించాడో తెలుసా..?

కాగా,గతవారం ఎమ్మెల్యే షాజిల్ సీఎం యోగి ఆదిత్యనాథ్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి తమ జోలికొస్తే తుపాకులు గర్జిస్తాయని ఆయన అన్నారు. గత శుక్రవారం సొంత నియోజకవర్గం భోజిపురాలో ఓ సభలో ఎమ్మెల్యే షాజిల్ మాట్లాడుతూ.."ఇటీవల ఎన్నికల తర్వాత ఉత్తర్​ప్రదేశ్​ శాసనసభలో మన పార్టీ(ఎస్పీ) బలం పెరిగింది. ఆదిత్యనాథ్ ఇకపై ఏదైనా చప్పుడు చేస్తే ఎస్పీ తుపాకుల నుంచి పొగ రాదు, తూటాలు దూసుకొస్తాయి" అని అన్నారు అన్సారీ. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఎమ్మెల్యేపై బరేలీ బరాదరి ఠాణాలో కేసు నమోదైంది. హిందూ యువ వాహిని సభ్యుడి ఫిర్యాదుతో ఎమ్మెల్యే సహా మరికొందరు ఎస్పీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. బెదిరించడం, శాంతిభద్రతలు విఘాతం కలిగించడం, అల్లర్లు సృష్టించేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వంటి నేరాలకు సంబంధించిన సెక్షన్ల కింద కేసు పెట్టారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే పెట్రోల్ బంకును అధికారులు బుల్డోజర్ తో కూల్చివేయడం చర్చనీయాంశంగా మారింది.


ఇక,యూపీలోని పలు చోట్ల బుల్డోజర్లతో తమ ఇంటిని కూల్చివేస్తారేమోనని భయంతో కొందరు,తమను ఎన్ కౌంటర్ చేయవద్దని వేడుకుంటూ మరికొందరు నేరస్తులు పోలీస్ స్టేషన్ లకు వచ్చి సరెండర్ అవుతున్నారు. ఇటీవల అత్యాచార నేరస్థుల ఇళ్ల ముందు బుల్డోజర్లు పెట్టగా.. కొన్ని గంటల్లోనే చాలా మంది నిందితులు లొంగిపోయిన విషయం తెలిసిందే.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Petrol pump, Samajwadi Party, Uttar pradesh, Yogi adityanath

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు