రాంపూర్ ప్రజలకు ఇక అన్నీ కలర్‌ఫుల్ సాయంత్రాలే... జయప్రదపై ఎస్పీ నేత సెక్సీ కామెంట్లు...

Lok Sabha Elections 2019 : 2004, 2009లో ఇదే రాంపూర్ నియోజకవర్గం నుంచీ జయప్రద లోక్ సభకు ప్రాతినిథ్యం వహించారు. తిరిగి ఆమె బరిలో దిగడాన్ని ఎస్పీ నేతలు సహించలేకపోతున్నారు.

Krishna Kumar N | news18-telugu
Updated: March 29, 2019, 3:03 PM IST
రాంపూర్ ప్రజలకు ఇక అన్నీ కలర్‌ఫుల్ సాయంత్రాలే... జయప్రదపై ఎస్పీ నేత సెక్సీ కామెంట్లు...
జయప్రద(ఫైల్ ఫోటో)
  • Share this:
ఈమధ్యే బీజేపీలో చేరిన మాజీ ఎంపీ జయప్రద... ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ నియోజకవర్గం నుంచీ లోక్ సభకు పోటీ చేస్తున్నారు. సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి అజం ఖాన్‌కు గట్టి పోటీ ఇస్తున్నారు. దీన్ని తట్టుకోలేకపోతున్న ఎస్పీ నేతలు నోరు పారేసుకుంటున్నారు. ఆ పార్టీకి చెందిన సంబల్ జిల్లా చీఫ్ ఫిరోజ్ ఖాన్ వివాదాస్పద కామెంట్లు చేశారు. రాంపూర్ ప్రజలకు వినోదం పంచేందుకు ఓ డాన్సర్ ఎంటరయ్యారనీ... ఇక సాయంత్రాలు కలర్‌ఫుల్లే అని సెక్సీ కామెంట్లు చెయ్యడం కలకలం రేపుతోంది. 2004, 2009లో ఇదే రాంపూర్ నియోజకవర్గం నుంచీ జయప్రద లోక్ సభకు ప్రాతినిథ్యం వహించారు. తిరిగి ఆమె బరిలో దిగడాన్ని ఎస్పీ నేతలు సహించలేకపోతున్నారు. అజం ఖాన్ గెలవడం తథ్యమంటున్న ఆ పార్టీ నేతలు... ఆయన రాంపూర్ కోసం చాలా అభివృద్ధి పనులు చేశారంటున్నారు. జయప్రద తన స్టెప్పులతో ఓటర్లను తనవైపు తిప్పుకోకుండా ఉంటే చాలని ఫిరోజ్ ఖాన్ వ్యాఖ్యానించారు.

2010లో జయప్రదను సమాజ్ వాదీ పార్టీ బహిష్కరించింది. ఆమె పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపించింది. 2004 సాధారణ ఎన్నికల్లో... రాంపూర్ నియోజక వర్గం నుంచీ పోటీ చేసిన జయప్రద... తన సమీప ప్రత్యర్థి కంటే 85,000 ఓట్ల మెజార్టీ సాధించారు. ఇప్పుడామె అజం ఖాన్‌ను ఓడించాలనే పట్టుదలతో ఉన్నారు.


ఇదివరకు ఓసారి అజం ఖాన్‌పై జయప్రద తీవ్ర ఆరోపణలు చేశారు. తనపై యాసిడ్ దాడి చేసేందుకు యత్నించారని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల మధ్య రాంపూర్ ఎన్నికలు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. అజం ఖాన్ చేసిందేమీ లేదంటున్న బీజేపీ వర్గాలు... జయ ప్రద గెలుపు ఖాయమని చెబుతున్నాయి.ఇవి కూడా చదవండి :

Lok Sabha Elections : పాలమూరులో పాగా వేసేదెవరో... పోటీ రసవత్తరం...

జీవా, గ్రేషియా బెస్ట్ ఫ్రెండ్స్... ఇంతకీ ఎవరి కూతుర్లో తెలుసా...

IPL 2019 : అశ్విన్ చేసిన ఆ రెండు తప్పుల వల్ల... కింగ్స్ ఎలెవన్ పంజాబ్ భారీ మూల్యం చెల్లించుకుందా?
Published by: Krishna Kumar N
First published: March 28, 2019, 2:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading