కొందరు నేతలతో ఎప్పుడూ తలనొప్పే. అసలు అలాంటి వాళ్లకు పార్టీలు ఎలా టికెట్లు ఇస్తాయో అర్థం కాదు. సమాజ్ వాదీ పార్టీ నేత ఆజంఖాన్‌పై రాజకీయ నిపుణుల నుంచీ వస్తున్న విమర్శలు ఇవి. రాంపూర్ నుంచీ మళ్లీ లోక్ సభకు పోటీ చేస్తున్న ఆయనపై తాజాగా ఎన్నికల కోడ్ ఉల్లంఘన చర్యలు చేపట్టింది ఈసీ. మే 1 ఉదయం 6 గంటల నుంచీ 48 గంటల పాటూ ఎన్నికల ప్రచారం చేయడానికి వీల్లేదని ఆదేశించింది. ఏప్రిల్‌లో కూడా ఇలాగే జరిగింది. బీజేపీ అభ్యర్థి జయప్రద ఖాకీ అండర్వేర్ వేసుకున్నారంటూ ఇష్టమొచ్చినట్లు వాగినందుకు... మూడు రోజులు నిషేధం విధించింది. తాజాగా అత్యంత వివాదాస్పదంగా, రెచ్చగొట్టే ప్రసంగం చేసినందుకు ఈసీ మండిపడింది. మతపరంగా ఓట్లు అడగవద్దని ఎంతలా చెబుతున్నా... నేతల తీరు మారకపోవడం ప్రజాస్వామ్యానికే పెను శాపం.
రాంపూర్‌లో ఓటర్లను ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో... జిల్లా ఎన్నికల అధికారులకు వ్యతిరేకంగా ప్రసంగాలు చేస్తూ... రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఆజంఖాన్ ఎన్నికల నిబంధనలను పక్కన పెట్టేస్తుండటంతో... ఈసీకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వాటిని పరిశీలించిన ఈసీ... ఆజంఖాన్ మళ్లీ మళ్లీ తప్పు చేస్తున్నారని భావించింది. రూల్స్ ప్రకారం మరోసారి యాక్షన్ తీసుకుంది.
ఆజంఖాన్ కొడుకు అబ్దుల్లా ఆజంఖాన్ మాత్రం ఈసీ నిర్ణయాన్ని తప్పుపట్టారు. ముస్లిం అయినందుకే తన తండ్రిపై నిషేధం విధించారని ఆరోపించారు.
ఇవి కూడా చదవండి :
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాలు... ఏర్పాటు దిశగా జోరందుకున్న ప్రయత్నాలు...
ఉత్తరాంధ్ర, ఒడిశావైపు దూసుకొస్తున్న ఫణి తుఫాను... 10,00,00,000 మందిపై ప్రభావం...
లక్ష్మీస్ ఎన్టీఆర్‌కి ఏపీలో మళ్లీ బ్రేక్... నిషేధం ఉందన్న ఈసీ... విడుదల అవుతుందన్న రాంగోపాల్ వర్మ
EVMలపై రాంగ్ కంప్లైంట్ ఇస్తే 6 నెలల జైలు... ఇలాంటి రూల్ కూడా ఉంది తెలుసా...
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Azam Khan, Election Commission of India, Jaya Prada, Lok Sabha Election 2019, Rampur S24p07, Uttar Pradesh Lok Sabha Elections 2019