Home /News /national /

SP BSP RLD TIE UP COMBATIVE CONGRESS HOW CHANGE UP EQUATIONS FOR BJP NK

పొత్తులతో ఫలితం ఉందా... యూపీలో ఎస్పీ, బీఎస్పీ కూటమి గెలుస్తుందా?

అఖిలేష్, మాయావతి (File)

అఖిలేష్, మాయావతి (File)

Lok Sabha Elections 2019 : పైకి పొత్తులు లేకపోయినా... ఎన్నికల ఫలితాలొచ్చాక, ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ ఒకరికొకరు మద్దతిచ్చుకునే అవకాశాలున్నాయి.

ప్రజాస్వామ్యంలో ప్రతీ పార్టీకీ ఓ సిద్ధాంతం, ఓ పద్ధతి అంటూ ఉంటాయి. అసలు అలాంటి సిద్ధాంతాలతోనే పార్టీలు పుట్టుకొస్తుంటాయి. ఉత్తరప్రదేశ్‌లో ఏమాత్రం సంబంధంలేని విరుద్ధమైన సిద్ధాంతాలతో వచ్చినవే సమాజ్‌వాదీ (ఎస్పీ), బహుజన్ సమాజ్ (బీఎస్పీ) పార్టీలు. కానీ ఇప్పుడా పార్టీలు సిద్ధాంతాల్ని మర్చిపోయి... అధికారమే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. అందుకోసమే చేతులు కలిపాయి. దీనంతటికీ కారణం 2014 లోక్‌సభ ఎన్నికల్లో దూసుకొచ్చిన బీజేపీయే. చూస్తుండగానే... యూపీలో అధికారాన్ని కైవసం చేసుకున్న బీజేపీ... బద్ధశత్రువుల్లా ఉండే రెండు పార్టీలను దగ్గర చేసింది. ఇప్పుడా రెండు పార్టీలకూ ప్రత్యర్థిగా ఉన్నది బీజేపీయే. ఐదేళ్లు గడిచాయి. ఇప్పుడేంటి మరి. లోక్ సభ ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ సత్తా చాటుతాయా?

ప్రస్తుత పరిస్థితులను చూస్తే... యూపీలో పొత్తుల వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని తెలుస్తోంది. బీజేపీ ప్రభ తగ్గినా... ఇంకా పూర్తిగా పడిపోలేదు. ఇప్పటికీ యూపీలో అధికారంలో ఉన్న కాషాయదళం... తన మార్క్ చూపించే స్థితిలోనే ఉంది. అదే సమయంలో... ఎస్పీ, బీఎస్పీ రెండు పార్టీలూ... బలం పెంచుకోలేదు. ఇప్పటికీ అవి సంప్రదాయ ఓటు బ్యాంక్ రాజకీయాలపైనే ఆధారపడుతున్నాయి. ములాయం నుంచీ వారసత్వాన్ని పొందిన అఖిలేష్ యాదవ్ సైతం... తండ్రి బాటలోనే వెళ్తున్నారు తప్ప... నవీన భారతం వైపు అడుగులు వెయ్యట్లేదు.


దేశవ్యాప్తంగా విస్తరించిన బీజేపీని దెబ్బ కొట్టాలంటే... వీలైనన్ని ఎక్కువ పార్టీలతో పొత్తులు పెట్టుకోవడమే కరెక్టని భావిస్తోంది కాంగ్రెస్. ఐతే... యూపీలో మాత్రం కాంగ్రెస్‌ని దూరం పెట్టాయి ఎస్పీ, బీఎస్పీ. ఇందుకు ప్రధాన కారణం... బీజేపీలాగా కాంగ్రెస్ కూడా మళ్లీ పుంజుకుంటుందేమో... తమకు తలనొప్పిగా తయారవుతుందేమో అన్న భయం. గతేడాది జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ మూడు రాష్ట్రాల్ని గెలుచుకోవడంతోనే... ఎస్పీ, బీఎస్పీలు కాంగ్రెస్‌కి దూరం జరిగాయి. ఇక్కడో సీక్రెట్ వ్యవహారం మాత్రం నడుస్తోంది.

పైకి పొత్తులు లేకపోయినా... ఎన్నికల ఫలితాలొచ్చాక, ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ ఒకరికొకరు మద్దతిచ్చుకునే అవకాశాలున్నాయి. ఇందులో భాగంగానే... అమేథీ, రాయ్ బరేలీలో ఎస్పీ, బీఎస్పీ తమ అభ్యర్థుల్ని నిలబెట్టట్లేదనీ, కాంగ్రెస్ కూడా ఎస్పీ, బీఎస్పీల్లో దిగ్గజ నేతలు పాల్గొనే చోట తమ అభ్యర్థుల్ని నిలబెట్టట్లేదని తెలుస్తోంది.


అయితే మేమైనా అధికారంలో ఉండాలి... లేదా వాళ్లైనా ఉండాలి... అంతే తప్ప... తమ రాష్ట్రలో మూడో పార్టీకి ఛాన్స్ ఉండకూడదు అన్నది ఎస్పీ, బీఎస్పీ ఆలోచనగా కనిపిస్తోంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం, తమ స్వప్రయోజనాల ఎస్పీ, బీఎస్పీ చేతులు కలిపినా... ఇప్పుడు అక్కడ జరుగుతున్నవి లోక్ సభ ఎన్నికలు. కాబట్టి ప్రజలు జాతీయ ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకొని ఓట్లు వేస్తారే తప్ప... రాష్ట్రంలో అంశాలకు ప్రభావితమై కాదు. అందువల్ల ఈ పొత్తు వల్ల పెద్దగా ఒరిగేదేమీ లేదని తెలుస్తోంది. పైగా యూపీలో మొత్తం 80 లోక్ సభ స్థానాలుండగా... 2014లో బీజేపీ ఏకంగా 71 స్థానాలు గెలిచింది. అమేథీ, రాయ్ బరేలీ సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంది. అప్పట్లో రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎస్పీ... 5 సీట్లు మాత్రమే దక్కించుకోగలిగింది. మిగతా రెండు స్థానాలనూ అప్నాదళ్ సొంతం చేసుకుంది. బీఎస్పీకి ప్రస్తుతం ఒక్క లోక్ సభ స్థానం కూడా యూపీ నుంచీ లేదు. అంటే ఈ కూటమి ప్రస్తుత బలం 5 సీట్లే. ఎన్నికల తర్వాత కూడా వీళ్లు పెద్దగా సాధించేదేమీ ఉండకపోవచ్చంటున్నారు విశ్లేషకులు.

 

ఇవి కూడా చదవండి :

నార్వేలో నౌకా ప్రమాదం... ప్రయాణికులందర్నీ కాపాడిన త్రివిధ దళాలు

పులివెందుల సీఐపై వివేకా కూతురు సంచలన వ్యాఖ్యలు

నేడు ప్రధాని మోదీ బెంగళూరు వస్తారా? దక్షిణ బెంగళూరుకు నామినేషన్ వేస్తారా?

వర్చువల్ సిమ్ అంటే ఏంటి... పుల్వామా ఉగ్ర దాడిలో ఎలా వాడారు?
First published:

Tags: Bjp, Lok Sabha Election 2019, National News, Sp-bsp, Uttar Pradesh Lok Sabha Elections 2019

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు