హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

కాంగ్రెస్‌కు ఇబ్బందులు ? కేసీఆర్ ప్లాన్ పని చేస్తోందా ?

కాంగ్రెస్‌కు ఇబ్బందులు ? కేసీఆర్ ప్లాన్ పని చేస్తోందా ?

ఎస్పీ, బీఎస్పీ, తృణమూల్ వంటి పార్టీలు ఎన్నికలకు ముందే తమతో కలిసి పనిచేస్తామని సంకేతాలు ఇస్తాయని కాంగ్రెస్ భావించింది. కానీ... ఈ పార్టీలన్నీ కాంగ్రెస్, బీజేపీలకు సమాన దూరం పాటిస్తూనే లోక్ సభ ఎన్నికలకు వెళ్లాలనే యోచనతో ఉన్నట్టు అర్థమవుతోంది. దీంతో కేసీఆర్ చెబుతున్నట్టు ఈ పార్టీలన్నీ కాంగ్రెస్, బీజేపీలు లేని మూడో కూటమిలో భాగమయ్యే అవకాశం ఉంది.

ఇంకా చదవండి ...

  రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు లేని కూటమిని ఏర్పాటు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ దిశగా త్వరలోనే తాను ప్రయత్నాలు కూడా చేస్తానని గులాబీ బాస్ చెబుతున్నారు. ముందుగా తెలంగాణలో పరిపాలన వ్యవహారాలను గాడిలో పెట్టి... ఆ తరువాత జాతీయ రాజకీయాలపై పూర్తిస్థాయిలో ఫోకస్ చేయాలన్నది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తోంది. జనవరి నుంచి జాతీయ రాజకీయాలపై కేసీఆర్ గురిపెట్టే అవకాశాలు ఉన్నాయని టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే కేసీఆర్ ఎత్తుకున్న నాన్ కాంగ్రెస్, నాన్ బీజేపీ కూటమి నినాదం... జాతీయస్థాయిలో ఇతర ప్రాంతీయ పార్టీలను బలోపేతం చేసిందేమో అనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది. చాలా రాష్ట్రాల్లోని బలమైన ప్రాంతీయ పార్టీలు... కాంగ్రెస్‌తో పొత్తుకు ముందుకు రాకపోవడమే ఇందుకు కారణం.

  SP, BSP and TMC ignoring Congress, seems KCR strategy working  కాంగ్రెస్‌కు ఇబ్బందులు ? కేసీఆర్ ప్లాన్ పని చేస్తోందా ? ఎస్పీ, బీఎస్పీ, తృణమూల్ వంటి పార్టీలు ఎన్నికలకు ముందే తమతో కలిసి పనిచేస్తామని సంకేతాలు ఇస్తాయని కాంగ్రెస్ భావించింది. కానీ... ఈ పార్టీలన్నీ కాంగ్రెస్, బీజేపీలకు సమాన దూరం పాటిస్తూనే లోక్ సభ ఎన్నికలకు వెళ్లాలనే యోచనతో ఉన్నట్టు అర్థమవుతోంది. దీంతో కేసీఆర్ చెబుతున్నట్టు ఈ పార్టీలన్నీ కాంగ్రెస్, బీజేపీలు లేని మూడో కూటమిలో భాగమయ్యే అవకాశం ఉంది.
  సోనియాగాంధీ, మాయావతి, మమతా బెనర్జీ

  వచ్చే ఎన్నికల్లో దేశంలో అత్యధిక లోక్ సభ స్థానాలు దక్కించుకునే రాజకీయ పార్టీల్లో అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీ, మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ, బెంగాల్‌లోని అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ఉన్నాయి. ఒడిశాలోని నవీన్ పట్నాయక్ సారథ్యంలోని బిజూ జనతాదల్ కూడా ఈ జాబితాలోకి వస్తుంది. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్ నేతృత్వంలో నడుస్తున్న వైసీపీ కూడా ఉంది. ఈ పార్టీలన్నీ ప్రస్తుతానికి అటు బీజేపీకి, ఇటు కాంగ్రెస్‌కు సమాన దూరాన్ని పాటిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీలకు పూర్తి మెజార్టీ రాని పక్షంలో వీరి మద్దతు కీలకమవుతుంది. ఈ పార్టీలు ఎటువైపు ఉంటే... వారికి అధికారం దక్కినా ఆశ్చర్యపోనవసం లేదు.

  దేశ రాజకీయాలను ప్రభావితం చేయగలిగే స్థాయిలో లోక్ సభ స్థానాలు గెలిచే అవకాశం ఉన్న పార్టీలు కొన్ని ఎన్నికలకు ముందే ఎన్డీయే, యూపీఏల్లో ఎవరో ఒకరి వైపు నిలుస్తాయని చాలామంది భావిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఎస్పీ, బీఎస్పీ, తృణమూల్ వంటి పార్టీలు ఎన్నికలకు ముందే తమతో కలిసి పనిచేస్తామని సంకేతాలు ఇస్తాయని కాంగ్రెస్ భావించింది. బీజేపీ, ప్రధాని మోదీపై వారికున్న రాజకీయ వ్యతిరేకత... వారిని తమవైపు నడిపిస్తుందని కాంగ్రెస్ ఆశించింది. కానీ... ఇప్పుడు ఈ పార్టీలన్నీ కాంగ్రెస్, బీజేపీలకు సమాన దూరం పాటిస్తూనే లోక్ సభ ఎన్నికలకు వెళ్లాలనే యోచనతో ఉన్నట్టు అర్థమవుతోంది. ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ లేకుండా కూటమిని ఏర్పాటు చేసిన ఎస్పీ, బీఎస్పీలు... ఈ విషయంలో స్పష్టమైన సంకేతాలు ఇచ్చాయి.

  పైన చెప్పుకున్న పార్టీలన్నింటిని కేసీఆర్ ప్రభావితం చేశారని కచ్చితంగా చెప్పలేం. కానీ... కేసీఆర్ చెప్పినట్టుగా కాంగ్రెస్, బీజేపీలు లేని మూడో కూటమిని ఏర్పాటు చేయాలని వీరంతా భావిస్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్, బీజేపీల సహకారం తమకు అవసరమైనా... తమకే కూటమిలో ప్రాధాన్యం ఉండాలని ఈ పార్టీలు కోరుకుంటున్నాయి. ఏ మాత్రం ఛాన్స్ దొరికినా... ప్రధానమంత్రి అయిపోవాలని భావిస్తున్న నాయకులు కూడా ఈ లిస్టులో ఉన్నారు. ఈ నేపథ్యంలో వీరంతా కాంగ్రెస్, బీజేపీ సహకారం లేకుండానే సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు సాధించి కేంద్రంపై పట్టుకోసం ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయి. ఈ రకంగా చూసినా... కేసీఆర్ భావిస్తున్నట్టుగానే సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయని అనుకోవచ్చు. మొత్తానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తరహాలోనే ఆలోచిస్తున్న పార్టీల కారణంగా... రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

  First published:

  Tags: Akhilesh Yadav, Congress, Mamata Banerjee, Mayawati, Sp-bsp, Telangana, TMC

  ఉత్తమ కథలు