హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

కాంగ్రెస్‌కు షాక్...ఎస్సీ-బీఎస్పీ నేతృత్వంలో కొత్త కూటమి?

కాంగ్రెస్‌కు షాక్...ఎస్సీ-బీఎస్పీ నేతృత్వంలో కొత్త కూటమి?

Illustration by Mir Suhail/News18.com

Illustration by Mir Suhail/News18.com

కూటమి తరపున బీఎస్పీ 34-40 సీట్లలో పోటీ చేసే అవకాశాలున్నాయి. RLDకి 3-4 సీట్లు కేటాయించినట్లు తెలుస్తోంది. సుహల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ, అప్నాదళ్ కూడా కూటమిలో చేరితో..వారికి రెండు లేదా మూడు సీట్ల ఇవ్వనున్నట్లు సమాచారం. మిగిలిన సీట్లలో సమాజ్‌వాదీ పార్టీ పోటీచేయనుంది.

ఇంకా చదవండి ...

  ఓ వైపు బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. డిసెంబరు 10న ఢిల్లీలో బీజేపీ వ్యతిరేక పక్షాల సమావేశం జరగనుంది. ఆ భేటీకి కొద్ది రోజుల ముందు కాంగ్రెస్‌కు ఓ చేదు వార్త..! బీజేపీకి వ్యతిరేక కూటమిలో ఎస్పీ, బీఎస్పీ పార్టీలు కలవడం లేదని తెలిసింది. 2019 ఎన్నికలే లక్ష్యంగా ఉత్తర్‌ప్రదేశ్ కేంద్రంగా కొత్త కూటమి ఏర్పాటుకానున్నట్లు సమాచారం. అఖిలేశ్, మాయావతి కలిసి కాంగ్రెస్‌తో సంబంధం లేకుండా కూటమి ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది.

  త్వరలో అన్నింటిపైనా స్పష్టత వస్తుంది. అఖిలేశ్, మాయావతి మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయి. కూటమిపై ఒప్పందం జరిగింది. అజిత్ సింగ్ పార్టీ రాష్ట్రీయ లోక్‌దళ్ (RLD) కూడా కూటమిలో భాగస్వామి అవుతుంది.
  ఓ బీఎస్పీ సీనియర్ లీడర్

  అటు ఓం ప్రకాశ్ రాజ్‌బర్ నేతృత్వంలోొని సుహల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీతోనూ అఖిలేశ్, మాయావతి సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వంలో రాజ్‌భర్ మంత్రిగా పనిచేస్తున్నారు. కొంతకాలంగా ఆయన యోగి ఆదిత్యనాథ్ సర్కార్‌పై అసంతృప్తితో ఉన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని పలు నగరాల పేర్ల మార్పుపై బాహాటంగానే విమర్శలు చేశారు.


  అటు సీట్ల పంపకాలపైనా సమాలోచనలు జరుగుతున్నాయి. కూటమి తరపున బీఎస్పీ 34-40 సీట్లలో పోటీ చేసే అవకాశాలున్నాయి. RLDకి 3-4 సీట్లు కేటాయించినట్లు తెలుస్తోంది. సుహల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ, అప్నాదళ్ కూడా కూటమిలో చేరితో..వారికి రెండు లేదా మూడు సీట్ల ఇవ్వనున్నట్లు సమాచారం. మిగిలిన సీట్లలో సమాజ్‌వాదీ పార్టీ పోటీచేయనుంది. కూటమి ఏర్పాటును RLD నేత అనిల్ దుబే సైతం ధృవీకరించారు.


  మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరంలో ఇప్పటికే ఎన్నికలు పూర్తయ్యాయి. డిసెంబరు 7న రాజస్థాన్, తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. 2019 ఎన్నికలకు వీటిని సెమీ ఫైనల్‌గా భావిస్తున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు డిసెంబరు 11న వెల్లడవుతాయి. మరికొద్ది రోజుల్లో ఫలితాలు రానున్న నేపథ్యంలో ఎస్పీ-బీఎస్పీ వ్యవహారం..కాంగ్రెస్‌కు గట్టి షాకిచ్చింది.

  కాగా, బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటే లక్ష్యంగా కొన్ని రోజులుగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు జేడీఎస్ అధినేత దేవెగౌడ, కర్నాటక సీఎం కుమారస్వామి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, డీఎంకే చీఫ్ స్టాలిన్, బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌తోనూ చర్చలు జరిపారు. ఈ క్రమంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు డిసెంబరు 10న బీజేపీ వ్యతిరేక పక్షాల సమావేశం జరగనుంది.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Akhilesh Yadav, Mayawati, Sp-bsp

  ఉత్తమ కథలు