కాంగ్రెస్‌కు బిగ్ షాక్...యూపీలో రెండు సీట్లు మాత్రమే

మొత్తం 80 స్థానాలున్న యూపీలో మూడు స్థానాలను ఆర్ఎల్‌డీకి వదిలిపెట్టిన ఎస్పీ, బీఎస్పీ... కాంగ్రెస్‌కు మాత్రం రెండు సీట్లను వదిలేశాయని సమాచారం. ఎస్పీ 37 స్థానాలు, బీఎస్పీ 38 స్థానాలు, ఆర్ఎల్‌డీ 3 స్థానాల్లో పోటీ చేయడానిక నిర్ణయించాయని తెలుస్తోంది.

news18-telugu
Updated: December 19, 2018, 6:30 PM IST
కాంగ్రెస్‌కు బిగ్ షాక్...యూపీలో రెండు సీట్లు మాత్రమే
రాహుల్ గాంధీ (ఫైల్ ఫొటో)
  • Share this:
ఢిల్లీలో అధికారం దక్కించుకోవాలని భావించే పార్టీలు ముందుగా ఎక్కువ లోక్ సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌పై దృష్టి పెడుతుంటాయి. యూపీలో అత్యధిక సీట్లు సాధిస్తే... హస్తిన పీఠానికి మరింత దగ్గర కావొచ్చన్నది రాజకీయ పార్టీల యోచన. 2014లో బీజేపీ సొంతంగా అధికారంలోకి రావడానికి కూడా ఉత్తరప్రదేశ్‌లో ఆ పార్టీకి గణనీయమైన సీట్లు రావడమే కారణం. మొత్తం 80 లోక్ సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌లో 2014లో బీజేపీ ఏకంగా 73 సీట్లు గెలుచుకుంది. ఆ తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాషాయ పార్టీ ఎవరూ ఊహించని భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. రాష్ట్రంలో బలంగా ఉన్న సమాజ్ వాదీ, బహుజన్ సమాజ్ పార్టీలను పూర్తిగా ఊడ్చేసింది. దీంతో బలమైన బీజేపీని వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఓడించేందుకు అఖిలేష్ యాదవ్ సారథ్యంలోని ఎస్పీ, మాయావతి నేతృత్వంలోని బీఎస్పీలు ఏకమయ్యాయి. ఉప ఎన్నికల్లో బీజేపీకి బిగ్ షాక్ ఇచ్చాయి. రాబోయే లోక్ సభ ఎన్నికల్లోనూ కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాయి.

SP and BSP deal big shock for congress in Uttar Pradesh కాంగ్రెస్‌కు బిగ్ షాక్...యూపీలో రెండు సీట్లు మాత్రమే మొత్తం 80 స్థానాలున్న యూపీలో మూడు స్థానాలను ఆర్ఎల్‌డీకి వదిలిపెట్టిన ఎస్పీ, బీఎస్పీ... కాంగ్రెస్‌కు మాత్రం రెండు సీట్లను వదిలేశాయని సమాచారం. ఎస్పీ 37 స్థానాలు, బీఎస్పీ 38 స్థానాలు, ఆర్ఎల్‌డీ 3 స్థానాల్లో పోటీ చేయడానిక నిర్ణయించాయని తెలుస్తోంది.
అఖిలేష్ యాదవ్, మాయావతి (ఫైల్ ఫొటో)


బీజేపీ, ఎస్పీ, బీఎస్పీ పరిస్థితి ఇలా ఉంటే... వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలోకి రావాలని కష్టపడుతున్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి యూపీలో చాలా భిన్నంగా ఉంది. బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ తమతో కలిసి రావాలని కాంగ్రెస్ ఎంతగా కోరుతున్నా... ఎస్పీ, బీఎస్పీలు మాత్రం కాంగ్రెస్‌తో కలిసి పనిచేసేందుకు ముందుకు రావడం లేదు. బీజేపీకి తాము వ్యతిరేకం అంటూనే కాంగ్రెస్‌తో కలవడానికి ఈ రెండు పార్టీలు అంతగా సంసిద్ధత వ్యక్తం చేయడం లేదు. ఇందుకు కారణం ఏంటనే విషయంపై ఎవరికీ క్లారిటీ లేదు. అయితే కాంగ్రెస్‌తో తాము కలిస్తే... పొత్తుల్లో భాగంగా యూపీలో ఆ పార్టీకి ఎక్కువ లోక్ సభ సీట్లు ఇవ్వాల్సి వస్తుందనే ఆలోచనతోనే ఎస్పీ, బీఎస్పీలు యూపీఏకు దూరంగా ఉంటున్నాయనే టాక్ ఉంది.

లోక్ సభ ఎన్నికల కోసం యూపీలో పొత్తులు విషయంలో ఒక అంగీకారానికి వచ్చిన ఎస్పీ, బీఎస్పీ... కాంగ్రెస్‌కు ఊహించని షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రముఖ హిందీ పత్రిక దైనిక్ జాగరణ్ కథనం ప్రకారం ఉత్తరప్రదేశ్‌లోని లోక్ సభ సీట్ల పంపకం విషయంలో ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్‌డీ పార్టీలు ఒక అవగాహనకు వచ్చాయి. మొత్తం 80 స్థానాలున్న యూపీలో మూడు స్థానాలను ఆర్ఎల్‌డీకి వదిలిపెట్టిన ఎస్పీ, బీఎస్పీ... కాంగ్రెస్‌కు మాత్రం రెండు సీట్లను వదిలేశాయని సమాచారం.


ఎస్పీ 37 స్థానాలు, బీఎస్పీ 38 స్థానాలు, ఆర్ఎల్‌డీ 3 స్థానాల్లో పోటీ చేయడానిక నిర్ణయించాయని తెలుస్తోంది. ఇక కాంగ్రెస్‌కు వదిలేసిన ఆ రెండు సీట్లు కూడా రాహుల్ గాంధీ ప్రాతినిథ్యం వహిస్తున్న అమేథీ, సోనియాగాంధీ సొంత సీటు రాయ్‌బరేలీ కావడం గమనార్హం. అయితే కాంగ్రెస్ పార్టీతో ఏ మాత్రం సంప్రదించకుండానే ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్‌డీ ఈ నిర్ణయం తీసుకున్నాయనే ప్రచారం జరుగుతోంది.

రాహుల్ గాంధీ-సోనియాగాంధీ(ఫైల్ ఫోటో)
రాహుల్ గాంధీ-సోనియాగాంధీ(ఫైల్ ఫోటో)


ఒకవేళ యూపీలోని ప్రధాన పార్టీలు ఎస్పీ, బీఎస్పీ ఈ నిర్ణయం తీసుకుని ఉంటే... అది కాంగ్రెస్ పార్టీపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని పలువురు విశ్లేషిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో మిత్రపక్షాలతో కలిసి కనీసం 15 సీట్లలో పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అందుకే ఎస్పీ, బీఎస్పీ కూటమిలో భాగస్వామ్యం కావాలని యోచిస్తోంది. అయితే ఎస్పీ, బీఎస్పీ మాత్రం ఈ విషయంలో కాంగ్రెస్‌కు పూర్తి భిన్నంగా ఆలోచిస్తున్నట్టు అనిపిస్తోంది.
First published: December 19, 2018, 4:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading