కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు... అధికారికంగా ప్రకటించిన వాతావరణ విభాగం

SouthWest Monsoon : నెమ్మదించినట్లు కనిపించిన నైరుతి రుతుపవనాలు జోరందుకున్నాయి. అవి కేరళ, కర్ణాటకను తాకగానే అక్కడ భారీ వర్షాలు మొదలయ్యాయి.

Krishna Kumar N | news18-telugu
Updated: June 8, 2019, 2:15 PM IST
కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు... అధికారికంగా ప్రకటించిన వాతావరణ విభాగం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
నైరుతి రుతుపవనాలు కేరళ, కర్ణాటక వాతావరణాన్ని ఒక్కసారిగా చల్లగా చేసేశాయి. దేశవ్యాప్తంగా కూడా వాతావరణం కాస్త చల్లబడింది. హైదరాబాద్ సహా చాలా చోట్ల వర్షాలు పడుతున్నాయి. కేరళ, కర్ణాటకపై ద్రోణి ఏర్పడింది. దక్షిణ భారత దేశంపై అది ప్రభావం చూపిస్తోంది. అరేబియా సముద్రం నుంచీ వీస్తున్న బలమైన గాలులకు ద్రోణి తోడవ్వడంతో... కేరళలో జోరుగా వానలు పడుతున్నాయి. భారత వాతావరణ విభాగం చెప్పినట్లే... కేరళలో వర్షాకాలం వచ్చేసింది. నైరుతి రుతుపవనాలు కేరళను తాకినట్లు IMD అధికారికంగా ప్రకటించింది. రుతుపవనాలు కేరళ వాతావరణాన్ని చల్లబరిచాయని తెలిపింది. ప్రస్తుతం కేరళలోని నాలుగు జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. జూన్ 9-10 మధ్య తిరువనంతపురం, కొల్లం, అలప్పుఝా, త్రిశూర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయనీ, అక్కడి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.జూన్‌ 9న కొల్లాం, అలప్పుళ జిల్లాలు, జూన్‌ 10న తిరువనంతపురం, ఎర్నాకుళం జిల్లాలోని భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పడంతో... అక్కడ ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. వచ్చే రెండ్రోజుల్లో అరేబియా సముద్రం అల్లకల్లోలంగా మారడం ఖాయం. అందుకే చేపల వేటకు వెళ్లొద్దని కేరళ అధికారులు హెచ్చరించారు.మన అదృష్టమేంటంటే... సరిగ్గా దేశంలోకి నైరుతి రుతుపవనాలు వస్తున్నప్పుడే... 9న కేరళ, కర్ణాటక తీరం దగ్గర అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడబోతోంది. ఇది నైరుతీ రుతుపవనాల్ని మరింత చురుగ్గా మార్చబోతోంది. అందువల్ల ఆదివారం లోగా కోస్తా, రాయలసీమలో ఉరుములు, ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

southwest monsoon,south west monsoon,monsoon,indian monsoon,monsoon in india,southwest monsoon 2019,southwest monsoon winds,southwest monsoon kerala,southwest monsoon delayed,southwest monsoon in india,southwest monsoon to hit kerala,southwest monsoon may hit kerala,southwest monsoon 2019 latest news,southwest monsoon delayed by one week,pre monsoon 2019,monsoon 2019,కేరళలో భారీ వర్షాలు, నైరుతి రుతుపవనాలు, కర్ణాటకలో వర్షాలు, వాతావరణం, కేరళను తాకిన రుతుపవనాలు,
నైరుతి రుతుపవనాల కదలిక


రుతుపవనాల వల్ల కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, బెంగాల్‌తోపాటు ఈశాన్య రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో గురు, శుక్రవారాల్లో (13, 14న) ఈదురుగాలులు, పిడుగులతో వర్షాలు కురిశాయి. ఉత్తరప్రదేశ్‌లో 19 మంది చనిపోయారు. నైరుతీ గాలులు పూర్తిగా తెలుగు రాష్ట్రాల్లో విస్తరించాలంటే... మరో నాలుగు రోజుల టైమ్ పడుతుంది. ఆ తర్వాత మనకు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి.
First published: June 8, 2019, 2:09 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading