రేపు కేరళకు నైరుతి పవనాలు..మలబారు తీరానికి భారీ వర్ష సూచన

ప్రతికాత్మక చిత్రం

జూన్ 9న కొల్లాం, అలప్పుళ, జూన్ 10న తిరువనంతపురం, ఎర్నాకుళం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. ఈ మేరకు ఆయా ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీచేశారు అధికారులు.

  • Share this:
    పంటలు సాగు చేసేందుకు గ్రామీణ ప్రజలు...ఎండల వేడి నుంచి ఉపశమనానికి పట్ట ప్రజలు...దేశమంతా నైరుతి రుతుపవనాల కోసం ఎదురుచూస్తోంది. రుతుపవనాలు ఎప్పుడొస్తాయా..చిరుజల్లులు ఎప్పుడు కురిపిస్తాయా..అని ఆశగా చూస్తున్నారు. ఐతే మరో 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళను తాకుతాయని భారతవాతావరణ శాఖ వెల్లడించింది. రుతుపవనాల గమనానికి అనువైన వాతావరణం ఏర్పడిన నేపథ్యంలో శనివారం కేరళను తాకే అవకాశముందని తెలిపింది.

    నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆదివారం నుంచి భారీగా వర్షాలు కురుస్తాయి. జూన్ 9న కొల్లాం, అలప్పుళ, జూన్ 10న తిరువనంతపురం, ఎర్నాకుళం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. ఈ మేరకు ఆయా ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీచేశారు అధికారులు. అరేబియా సముద్రం అల్లకల్లలంగా మారుతుందని అలలు భారీ ఎత్తున ఎగసిపడతాయని తెలిపారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.

    ఇక రుతుపవనాలు తమిళనాడు, తెలంగాణ, ఏపీని తాకేందుకు మరో మూడు, నాలుగు రోజుల సమయం పట్టవచ్చని ఐఎండీ తెలిపింది. కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో మాత్రం శనివారం, ఆదివారం కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన చిన్నపాటి వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. మరోవైపు ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ వారంతం వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రాజస్థాన్‌, ఢిల్లీ మధ్యప్రదేశ్‌, విదర్భ, ఉత్తరప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని హెచ్చరించారు.
    First published: