SOUTHWEST MONSOON ARRIVES OVER ANDAMAN AND NICOBAR ISLANDS THEY WILL REACH KERALA BY MAY 26 SAYS IMD NK
Southwest Monsoon: అండమాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు.. మనకు ఎప్పుడంటే...
అండమాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు.. మనకు ఎప్పుడంటే... (image credit - twitter)
Southwest Monsoon: భారత వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. అనుకున్నట్లుగానే ఈసారి ముందుగానే నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి. మరి తెలుగు రాష్ట్రాలను ఎప్పుడు పలకరిస్తాయో చూద్దాం.
Southwest Monsoon: సాధారణంగా ప్రతి సంవత్సరం మే 31న నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయి. అలా తాకాలంటే... ముందుగా అవ అండమాన్ నికోబార్ దీవుల్ని చేరుకోవాలి. ఈ సంవత్సరం శుక్రవారం అవి అండమాన్ దీవుల్ని చేరినట్లు భారత వాతావరణ శాఖ (IMD) అధికారులు తెలిపారు. దీంతో 4 నెలల వర్షాకాలం మొదలైనట్లే అని అంటున్నారు. నైరుతి రుతుపవనాల జోరు బాగుంది. అందుకే అవి త్వరగానే అండమాన్ తీరాన్ని తాకాయి. అవి బంగాళాఖాతం నైరుతీ దిశగా ప్రయాణించి... కేరళ తీరాన్ని చేరతాయి. ఇందుకు ఓ నాల్రోజులు పట్టొచ్చు. అంతకంతే ముందు.. రెండ్రోజులపాటూ... అండమాన్ దీవులపై తేలికపాటి నుంచి మోస్తరు వర్షం... ఆదివారం వరకూ కురుస్తుంది అని వాతావరణ అధికారులు తెలిపారు. బంగాళాఖాతం, అరేబియా సముద్రంపై గాలుల వేగం... గంటకు 50 నుంచి 60 కిలోమీటర్లు ఉంటుందని తెలిపారు.
షాకింగ్ విషయమేంటంటే... ఈసారి ముంబై ప్రజలకు వర్షాలు కాస్త ఆలస్యంగా కురుస్తాయట. మే 26 నాటికి రుతుపవనాలు కేరళను చేరతాయని అంటున్నారు. ఆ తర్వాత 11 నుంచి 15 రోజులకు ముంబై... ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరిస్తాయని అంటున్నారు అంటే... జూన్ 10 అనుకోవచ్చు. అదే సమయంలో... ముంబైలో వర్షాలు కురవచ్చని అంటున్నారు. ఐతే... దానికంటే ఓ వారం ముందు నుంచి... ముంబైలో చిరు జల్లులు కురుస్తాయని అంటున్నారు.
ఈసారి కూడా వాతావరణ శాఖ అంచనాలు తప్పాయి. మే 31న రుతుపవనాలు కేరళను తాకవచ్చని రెండ్రోజుల కిందట IMD అధికారులే చెప్పారు. ఇప్పుడేమో... మే 26కల్లా తాకుతాయని అంటున్నారు. ఇలా అంచనాలు తప్పడం సహజమే. ఎందుకంటే... ప్రకృతి ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు. వాతావరణ అధికారులు కూడా గాలుల వేగం, సముద్రాల్లో పరిస్థితులు, వాతావరణంలో ఉష్ణోగ్రత అన్నీ లెక్కలోకి తీసుకొని ఈ అంచనాలు ఇస్తుంటారు.
ఈ సంవత్సరం సాధారణ వర్షాలు కురుస్తాయని అధికారులు అంటున్నారు. 2019, 2020లో ఇండియాలో మంచి వర్షాలు కురిశాయి. ఈ సంవత్సరం కూడా కురిస్తే... ఇది హాట్రిక్ అవుతుందని అంటున్నారు.
తెలుగు రాష్ట్రాలకు ఎప్పుడు:
ముంబైకి జూన్ 10 అని అంచనా వేశారు కాబట్టి... తెలుగు రాష్ట్రాలకు జూన్ 15 నుంచి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఈలోగా కూడా అప్పుడప్పుడూ తేలిక పాటి వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే... బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడుతున్నాయి. వాటి ప్రభావంతో తేలికపాటి వర్షాలు కురుస్తాయనే అంచనా ఉంది. జూన్ 15 తర్వాత మాత్రం జోరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. దేశవ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించి సెప్టెంబర్ వరకూ భారీ వర్షాలు కురుస్తాయనే అంచనా ఉంది.
బంగాళాఖాతంలో తుఫాను:
బంగాళాఖాతంలో ఓ తుఫాను ఏర్పడేలా ఉంది. మే 25 నుంచి ఒడిసా, బెంగాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంటున్నారు. అది ఒడిసా నుంచి బెంగాల్ వైపుగా వెళ్లి తీరం దాటుతుందనే అంచనా ఉంది.
Published by:Krishna Kumar N
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.