వర్షాకాలం వచ్చేసింది. నైరుతి రుతుపవనాలు మన దేశంలోకి ప్రవేశించాయి. రుతుపవనాలు కేరళ దక్షిణ తీర ప్రాంతాన్ని తాకినట్లు భారత వాతావరణ విభాగం ప్రకటించింది. వాస్తవానికి జూన్ 1 నే నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాల్సి ఉంది. కానీ వాతావరణ పరిస్థితులు మారడంతో రెండు రోజులు ఆలస్యంగా వచ్చాయి. వీటి ప్రభావంతో కేరళ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు చెప్పారు. ఈసారి సాధారణం లేదా సాధారణ కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుదని వెల్లడించారు. జూన్, జులై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలో విస్తారంగా వానలు కురుస్తాయని తెలిపారు.
SOUTHWEST MONSOON HAS SET IN OVER SOUTHERN PARTS OF KERALA TODAY, THE 03RD JUNE, 2021. DETAILS IN THE PRESS RELEASE TO BE ISSUED SOON@rajeevan61
— India Meteorological Department (@Indiametdept) June 3, 2021
మన దేశం వ్యవసాయ రంగం వర్షాలపైనే ఆధారపడి ఉంది. సగానికి పైగా భూములను వర్షా కాలంలోనే సాగు చేస్తారు. ప్రధానంగా ఈ నైరుతి రుతవపనాల మీద ఆధారపడే పంటలను పండిస్తారు. నైరుతి రుతుపవనాలు వచ్చిన తర్వాత నాలుగు నెలల పాటు సమృద్ధిగా వర్షాలు కురుస్తాయి. కేరళలోకి ప్రవేశించిన రుతుపవనాలు.. క్రమంగా ఇతర రాష్ట్రాలకు విస్తరించనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోకి మరో మూడు నాలుగు రోజుల్లో వచ్చే అవకాశముంది. నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించిన తర్వాత మన దేశంలో వర్షాకాలం పంటల సాగు ఊపందుకుంటుంది. వ్యవసాయ పనులు మొదలవుతాయి. దుక్కి దున్నడం, విత్తనాలు వేయడం.. చకచకా జరిగిపోతాయి. ఈసారి సాధారణ వర్షపాతం నమోదవుతుదని ఐఎండీ చెప్పడంతో రైతుల సంతోషపడుతున్నారు. పంటలు బాగా పండాలని వరుణ దేవుడిని ప్రార్థిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Heavy Rains, Monsoon, Monsoon rains, South West Monsoon