హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం.. దేశంలోనే తొలిసారిగా..

దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం.. దేశంలోనే తొలిసారిగా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కొత్త విధానంలో తీసుకొచ్చిన కార్గో ఎక్స్‌ప్రెస్ వల్ల చిన్న, మధ్య తరహా వినియోగదారులకు ప్రయోజనం కలగనుంది. వాస్తవానికి రైళ్లలో సరుకులను రవాణ చేయాలంటే.. బల్క్ (ఎక్కువ పరిమాణం)రూపంలో ఉండాలి.

రైలు.. ఇది ఓ సుదీర్ఘ ప్రయాణం. ఒకే సమయంలో వందలాది మందిని తమ గమ్యస్థానాలకు చేర్చడంలో రైళ్లది ప్రత్యేక స్థానం. ఎన్ని రవాణ సాధానాలు అందుబాటులోకి వచ్చినా.. రైళ్లకు ఉండే ప్రత్యేకత వేరు. అయితే అందులో ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్, సూపర్ ఫాస్ట్, గూడ్స్ వంటి పలు రకాల రైళ్లు ప్రస్తుతం తమ మనుగడను అద్వితీయంగా కొనసాగిస్తున్నాయి. గూడ్స్ రైలు మినహా మిగతావన్నీ ప్రయాణికులను తమ గమ్య స్థానాలకు చేరుస్తుంటాయి. ఒక్క గూడ్స్ రైలు మాత్రమే సరుకులను రవాణ చేస్తుంది. అయితే ఎక్స్‌ప్రెస్, సూపర్ ఫాస్ట్, ప్యాసింజర్ రైళ్ల పోటీ మధ్య గూడ్సు రైలు ఆగుతూ.. సాగుతూ గమ్యాన్ని చేరుకుంటుంది. పట్టాలపై రైళ్ల రద్దీకి అనుగుణంగా ఈ గూడ్సు రైలు ప్రయాణం సాగిస్తాయి. దీంతో సరుకుల రవాణ విషయంలో తీవ్ర జాప్యం జరుగుతుంది. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది.

గతంలో ఎన్నడూ లేనివిధంగా దేశంలోనే తొలిసారిగా కార్గో ఎక్స్‌ప్రెస్‌ను పట్టాలెక్కించనుంది. ఆగస్టు 5వ తేదీ నుంచి ఈ కార్గో ఎక్స్‌ప్రెస్‌ను ఆరు నెలల పాటు పైలజ్ ప్రాజెక్టు కింద నడిపించనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కొత్త విధానంలో తీసుకొచ్చిన కార్గో ఎక్స్‌ప్రెస్ వల్ల చిన్న, మధ్య తరహా వినియోగదారులకు ప్రయోజనం కలగనుంది. వాస్తవానికి రైళ్లలో సరుకులను రవాణ చేయాలంటే.. బల్క్ (ఎక్కువ పరిమాణం)రూపంలో ఉండాలి.

కానీ కరోనా వైరస్ నేపథ్యంలో రైల్వే శాఖకు ఆదాయం తగ్గింది. దీంతో ఆదాయాన్ని పెంపొందించుకునేందుకు నాన్ బల్క్(తక్కువ పరిమాణం) సరుకులను సైతం రవాణ చేసేందుకు రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ నిర్ణయం వల్ల వ్యవసాయ ఉత్పత్తిదారులు, వ్యాపారులు, చిన్న, మధ్య తరహా పరిశ్రమల నిర్వాహకులను మేలు కలగనుంది. ఇక కార్గో ఎక్స్‌ప్రెస్ ఛార్జీల విషయానికొస్తే.. హైదరాబాద్ నుంచి ఢిల్లీ రవాణ ఛార్జీలను టన్నుకు సగటున రూ.2500గా నిర్ణయించారు.

ఈ ఛార్జీలు సరుకును బట్టి మారనుంది. రోడ్డు రవాణా సాధనాలతో పోల్చితే.. ఈ ఛార్జీలు 40 శాతం తక్కువగా ఉండడం గమనార్హం. అయితే వినియోగదారులు సరకు రవాణ రిజిస్ట్రేషన్, వ్యాగన్ల బుకింగ్ కోసం 9701371976, 040-27821393 నంబర్లు లేదా దక్షిణ మధ్య రైల్వే వెబ్‌సైట్‌లో సంప్రదించవచ్చని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.

First published:

Tags: Railways, South Central Railways, Train

ఉత్తమ కథలు