Home /News /national /

SOUTH AFRICA RETURNEE TESTS POSITIVE FOR COVID19 IN MUMBAI DOMBIVALI SAMPLES SENT TO IDENTIFY OMICRON VARIANT MKS

Omicron : డేంజరస్ ఒమిక్రాన్ Mumbaiలోకి ఎంటరైందా? -South Africa నుంచి తిరిగొచ్చిన వ్యక్తికి కొవిడ్ పాజిటివ్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో బయటపడిన ఓ పాజిటివ్ కేసు అందరినీ కలవరపెడుతున్నది. సౌతాఫ్రికా నుంచి ఇటీవలే తిరిగొచ్చిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ముంబై శివారు థానే జిల్లా డోంబివ్లి ప్రాంతానికి చెందిన ఆ వ్యక్తిలో ఒమెక్రాన్ వేరియంట్ ఉందా? అని అదనపు టెస్టులు చేపట్టారు..

ఇంకా చదవండి ...
లక్షల మందిని పొట్టన పెట్టుకున్న డెల్టా వేరియంట్ కంటే అత్యంత ప్రమాదకారిగా భావిస్తోన్న కరోనా వైరస్ కొత్త రూపం ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటికే 13 దేశాలకు వ్యాపించింది. అది గనుక ఇండియాలో వ్యాపిస్తే ఇబ్బందులు తప్పవనే భయాల నడుమ కేంద్ర ప్రభుత్వం అప్రమత్తత ప్రకటించడంతో సౌతాఫ్రికా సహా ఒమిక్రాన్ ఉధృతి ఉన్న దేశాల నుంచి వచ్చిన, వస్తోన్న ప్రయాణికులను వెతికిమరీ టెస్టులు చేస్తున్నారు. ఈక్రమంలోనే దేశ ఆర్థిక రాజధాని ముంబైలో బయటపడిన ఓ పాజిటివ్ కేసు అందరినీ కలవరపెడుతున్నది. సౌతాఫ్రికా నుంచి ఇటీవలే తిరిగొచ్చిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ముంబై శివారు థానే జిల్లా డోంబివ్లి ప్రాంతానికి చెందిన ఆ వ్యక్తిని ప్రస్తుతం ఐసోలేషన్ కు తరించారు. అంతేకాదు..

సౌతాఫ్రికా నుంచి తిరిగొచ్చిన వ్యక్తి ఈనెల 24న ఢిల్లీ ఎయిర్ పోర్టులో దిగాడు. అక్కడి నుంచి మరో విమానంలో ముంబైకి వచ్చాడు. ప్రమాదకర ఒమిక్రాన్ వేరియంట్ సౌతాఫ్రికా నుంచే వ్యాపించినట్లు నిర్ధారణ కావడంతో ఆ దేశం నుంచి ప్రయాణాలు చేస్తోన్న, గత 14 రోజుల్లో ప్రయాణాలు చేసిన అందరినీ ప్రభుత్వాధికారులు విధిగా టెస్టులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే థానే జిల్లా డొంబవ్లికి చెందిన వ్యక్తిని గుర్తించారు. కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయిన ఆ వ్యక్తిలో ఓమిక్రాన్ వేరింట్ ఉన్నది లేనిదీ తెలుసుకునేందుకు అతని జీనోమ్ శాంపిళ్లను ల్యాబ్ కు తరలించినట్లు అధికారులు చెప్పారు. ఇది గనుక పాజిటివ్ గా తేలితే ముంబైలోకి ఒమిక్రాన్ ఎంటరైనట్లుగానే భావించాలి. మరోవైపు,

Omicron : ప్రమాదకర ఒమిక్రాన్‌పై మోదీ సర్కార్ తాజా గైడ్‌లైన్స్ -కట్టడి బాధ్యత రాష్ట్రాలదే



సౌతాఫ్రికా నుంచే తిరిగొచ్చిన ఇద్దరు ప్రయాణికులు కొవిడ్ పాజిటివ్ గా తేలిన ఘటన బెంగళూరు ఎయిర్ పోర్టులో రెండ్రోజుల కిందట వెలుగు చూసింది. ఆ ఇద్దరినీ ఓ ప్రైవేట్ హోటల్ గదిలో క్వారంటైన్ కు తరలించారు అధికారులు. బెంగళూరు ఎయిర్ పోర్టులో సౌతాఫ్రికా రిటర్నీలకు కొవిడ్ అని నిర్ధారణ కావడంతో కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై అప్రమత్తమై వైరస్ కట్టడికి ఆదేశాలు జారీ చేశారు. ఆ ఇద్దరి జీనోమ్ శాంపిళ్లను ముంబై ల్యాబ్ కు తరలించారు. వాటి ఫలితాలు పాజిటివ్ గా వస్తే ఇండియాలో తొలి ఒమెక్రాన్ కేసు నమోదవుతుంది. ఒమెక్రాన్ భయాల నేపథ్యంలో అన్ని రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరికలు, తాజా మార్గదర్శకాలు జారీ చేసింది.

dollar seshadri : టీటీడీలో విషాదం -డాలర్ శేషాద్రి హఠాన్మరణం



పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను కట్టడి చేయాలని, ఒమెక్రాన్ ప్రభావిత దేశాల నుంచి తిరిగొచ్చే ప్రయాణికులు, గత 14 రోజుల్లో ప్రయాణాలు చేసినవారిని గుర్తించి విధిగా టెస్టులు నిర్వహించాలని, అదే సమయంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలనీ మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. సౌతాఫ్రికాలో పుట్టిన ఒమెక్రాన్ వేరియంట్ వారం వ్యవధిలోనే 15 దేశాలకు వ్యాపించింది. డజనుకుపైగా దేశాలు అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి.
Published by:Madhu Kota
First published:

Tags: Covid, Mumbai, Omicron corona variant

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు