వామ్మో మోతే... ఇక రైల్వే పట్టాలపై చెత్త వేస్తే భారీ ఫైన్...

Indian Railways : ఇప్పటివరకూ రైలు పట్టాలపై చెత్త వేసినా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఇకపై అలా కుదరదు. చెత్త వేస్తే, ఇక మళ్లీ జీవితంలో చెత్త వెయ్యకూడదని అనిపించేలా భారీ ఫైన్ వెయ్యబోతున్నారు రైల్వే అధికారులు.

Krishna Kumar N | news18-telugu
Updated: May 18, 2019, 1:35 PM IST
వామ్మో మోతే... ఇక రైల్వే పట్టాలపై చెత్త వేస్తే భారీ ఫైన్...
రైలు పట్టాలు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
Indian Railways : 2014లో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక... ఆగస్టులో స్వచ్ఛభారత్ నినాదాన్ని తెచ్చారు. దాంతో ఎక్కడ బడితే అక్కడ చెత్త వెయ్యకుండా... చర్యలు తీసుకున్నారు. కానీ ఏం లాభం... కొన్నాళ్లకే పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు ఎక్కడ చూసినా మళ్లీ చెత్తే కనిపిస్తోంది. ఇక రైల్వేల్లో పరిశుభ్రతపై ఏకంగా రైల్వే స్టేషన్లకు ర్యాంకులు కూడా ఇచ్చారు. అంత చేసినా ఫలితం మారలేదు. ఎక్కడ చెత్త అక్కడే కనిపిస్తోంది. ఇలాగైతే లాభం లేదనుకున్న రైల్వే అధికారులు... వాస్తవ పరిస్థితిని కేంద్ర రైల్వే శాఖకు తెలిపారు. బాగా ఆలోచించిన కేంద్రం... ఫైన్ వేస్తేనే గానీ పరిస్థితిలో మార్పు రాదని గ్రహించింది. ఆ మధ్య వచ్చిన ఓ తెలుగు సినిమాలోలాగా... భారీగా ఫైన్లు వేస్తేనే, ప్రయాణికులు రైలు పట్టాలపై చెత్త వెయ్యకుండా ఉంటారని భావించింది. ఇకపై స్వచ్ఛభారత్‌ను కచ్చితంగా అమలు చెయ్యాలని నిర్ణయించింది.

రైల్వే శాఖ తాజా ఆదేశాల ప్రకారం ఇకపై రైలు పట్టాలపై ఎవరైనా చెత్తవేస్తే తక్కువలో తక్కువ రూ.5 వేలు ఫైన్ వేస్తారు. వేసిన చెత్తను బట్టీ ఫైన్ ఇంతకంటే పెరుగుతుందే తప్ప తగ్గదు. ఇందుకోసం రైల్వే శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రతి స్టేషన్‌కూ ఓ పర్యవేక్షణాధికారిని నియమించింది. ఆ అధికారి... తాగునీరు, పరిశుభ్రత, నిషేధిత వస్తువుల తొలగింపు బాధ్యతల్ని అప్పగించింది. పట్టాలపై ఎవరైనా చెత్త వేస్తే ఆ అధికారి వాళ్లను గుర్తించి, ఫైన్ వేస్తారన్నమాట. మా దగ్గర డబ్బులు లేవు అంటే కుదరదు. ఎలాగైనా మనీ వసూలు చేస్తారు. లేదంటే అరెస్టు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.

ప్రస్తుతానికి ఈ నిర్ణయాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు రైల్వే శాఖ... తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై ఎంజీఆర్‌ సెంట్రల్‌ రైల్వేస్టేషన్‌ సహా 19 రైల్వేస్టేషన్లను ఎంపిక చేసింది. అలాగే, తాంబరం, చెంగ్పట్టు, అవడి, తిరువళ్లూరు, కాట్పాడి, పెరంబూరు, జోలార్‌పేట, మాంబళం, గూడువాంజేరి, పెరుంగొళత్తూర్‌, తిరుత్తణి, సింగపెరుమాళ్‌కోయల్‌, చెన్నై బీచ్‌, గిండి తదితర సబర్బన్‌ స్టేషన్లలో ఈ నిబంధన అమలు చేయబోతున్నారు. ఇక్కడి పట్టాలపై ఎవరైనా చెత్త వేస్తే జరిమానా విధిస్తారు. దీన్ని సక్సెస్ చేసి... దేశవ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్లలో అమల్లోకి తేనున్నారు.

ఇది ఎంతవరకూ సక్సెస్ అవుతుందో ఇప్పుడే చెప్పలేం. మన ఇండియాలో బహిరంగంగా పొగతాగడం (Smoking) నేరం. అయినా తాగుతూనే ఉన్నారు. వాళ్లకు ఎలాంటి ఫైనూ లేదు. ఎన్నికల తర్వాత NDA కాకుండా వేరే ప్రభుత్వం అధికారంలోకి వస్తే, ట్రాకులపై ఫైన్ వ్యవహారం అటకెక్కినా ఆశ్చర్యం అక్కర్లేదు.



 

ఇవి కూడా చదవండి :

లగడపాటి సర్వే సిద్ధం... ఎగ్జిట్‌ పోల్స్ ఏం చెప్పినా...
Loading...
చంద్రబాబుకి బూస్ట్ ఇస్తున్న సబ్బం హరి... టీడీపీ గెలుపుపై ఆయన విశ్లేషణ ఏంటంటే...

Bigg Boss 13 : బిగ్ బాస్ 13లో పసుపు చీర పోలింగ్ అధికారి..?

బిడ్డకు జన్మనిచ్చిన యువతి... తను గర్భవతి అనే తెలియదట...

ఎవరు గెలుస్తారు..? కోట్లు సంపాదిస్తున్న జ్యోతిష్యులు...
First published: May 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...