• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • SONU SOOD HAS MOVED THE SUPREME COURT AGAINST THE BOMBAY HIGH COURT ORDER SSR

బాంబే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించిన బాలీవుడ్ నటుడు సోనూసూద్

బాంబే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించిన బాలీవుడ్ నటుడు సోనూసూద్

సోనూసూద్(ఫైల్ ఫొటో)

లాక్‌డౌన్ సమయంలో ఎంతోమంది వలస కార్మికులకు ఆపన్న హస్తం అందించి రియల్ హీరో అనిపించుకున్న బాలీవుడ్ నటుడు సోనూసూద్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తన పిటిషన్‌ను బాంబే హైకోర్టు కొట్టివేయడంతో ఆయన అత్యున్నత న్యాయస్థానంలో తీర్పును సవాల్ చేశారు. మహారాష్ట్ర రీజనల్ మరియు టౌన్ ప్లానింగ్ చట్టం, 1966ను పరిగణనలోకి...

  • Share this:
    ముంబై: లాక్‌డౌన్ సమయంలో ఎంతోమంది వలస కార్మికులకు ఆపన్న హస్తం అందించి రియల్ హీరో అనిపించుకున్న బాలీవుడ్ నటుడు సోనూసూద్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తన పిటిషన్‌ను బాంబే హైకోర్టు కొట్టివేయడంతో ఆయన అత్యున్నత న్యాయస్థానంలో తీర్పును సవాల్ చేశారు. మహారాష్ట్ర రీజనల్ మరియు టౌన్ ప్లానింగ్ చట్టం, 1966ను పరిగణనలోకి తీసుకోకుండానే జనవరి 13, 2021న బాంబే హైకోర్టు తీర్పునిచ్చినట్లు సుప్రీంకు సోనూసూద్ విన్నవించుకున్నారు. తన భవనంలో చేపట్టిన నిర్మాణాలకు బీఎంసీ కమిషనర్ పాక్షిక ఆమోదం ఉందని, ముంబై కోస్టల్ రెగ్యులేషన్ జోన్ అథారిటీ క్లియరెన్స్ కోసం వేచి చూస్తున్నట్లు తెలిపారు.

    ముంబైలోని జుహూ ప్రాంతంలో సోనూసూద్‌కు ఆరంతస్తుల భవనం ఉంది. అనుమతులు తీసుకోకుండానే ఈ నివాస సముదాయంలో మార్పులు చేస్తున్నారంటూ బృహణ్ ముంబై కార్పొరేషన్(బీఎంసీ) అధికారులు సోనూసూద్‌కు నోటీసులు పంపారు. అయితే.. ఇంటి లోపల చేపట్టిన మార్పులుచేర్పులను నిలిపివేశామని, అందువల్ల పునర్నిర్మాణ పనులు పూర్తయిన తన బిల్డింగ్‌ను కూల్చకుండా ఆదేశాలివ్వాలని సోనూసూద్, అతని భార్య పిటిషన్‌లో కోరారు. తన బిల్డింగ్‌లో తాను ఎలాంటి అక్రమ, అనధికార నిర్మాణాలు చేపట్టలేదని ఇప్పటికే సోనూసూద్ పేర్కొన్నారు.

    మహారాష్ట్ర రీజనల్ అండ్ టౌన్ ప్లానింగ్ చట్టం అనుమతించిన మార్పులు మాత్రమే తాను చేసినట్లు తెలిపారు. ఇదిలా ఉంటే.. ఈ వివాదంలో సోనూసూద్‌పై జుహూ పోలీస్ స్టేషన్‌లో బీఎంసీ ఫిర్యాదు కూడా చేసింది. అతనిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోరింది. నివాస సముదాయాన్ని సోనూసూద్ వ్యాపార కాంక్షతో హోటల్‌గా మారుస్తున్నాడని, అందుకు ఎలాంటి అనుమతులు తీసుకోలేదని బీఎంసీ అధికారులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసులో బాంబే హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో బీఎంసీ సోనూసూద్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అతను అలవాటు పడ్డ నేరస్తుడని ఆరోపించింది. అనధికారికంగా భవనాలను నిర్మించాడని, ఒకటి రెండు సార్లు అక్రమ నిర్మాణాలను కూల్చినప్పటికీ తన వ్యవహార శైలి మార్చుకోలేదని బీఎంసీ సోనూసూద్‌పై ఆరోపణలు చేసింది.
    Published by:Sambasiva Reddy
    First published:

    అగ్ర కథనాలు