కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల ఫలితాలు నేడు వచ్చాయి. పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో మల్లికార్జున్ ఖర్గే శశిథరూర్‌పై భారీ మెజార్టీతో విజయం సాధించారు. కాంగ్రెస్ తదుపరి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత, మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) మొదట సోనియా గాంధీని ఆమె 10 జనపథ్ నివాసంలో కలవడానికి అపాయింట్‌మెంట్ కోరారు. అయితే అనూహ్యంగా ఆయనకు అపాయింట్‌మెంట్ లభించలేదు. అయితే సోనియాగాంధీ (Sonia Gandhi) ఖర్గేకు అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడం వెనుక ప్రత్యేకమైన కారణం ఉందని ఆ తరువాత ఆయన అందరికీ అర్థమైంది. మల్లికార్జున్ ఖర్గే అపాయింట్‌మెంట్ కోరినప్పుడు సోనియా గాంధీ నిరాకరించడంతో ఏదైనా నిర్ణయం తీసుకున్నారేమో అని పార్టీ వర్గాలు భావించాయి.
ఆ తర్వాత సోనియా గాంధీ తన కుమార్తె, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ (Priyanka Vadra)వాద్రాతో కలిసి మల్లికార్జున్ ఖర్గే నివాసం 10 రాజాజీ మార్గ్‌కు చేరుకున్నారు. ఖర్గే నివాసానికి సోనియా గాంధీ పర్యటనతో కాంగ్రెస్‌లో పాత సంప్రదాయానికి తెరపడింది. గతంలో కాంగ్రెస్ అధిష్టానం ఏ పార్టీ అధినేత ఇంటికి వెళ్లడం చాలా అరుదు. అయితే ఇందులో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మినహాయింపు ఉండేది. 2015లో బొగ్గు కుంభకోణం కేసులో మన్మోహన్‌సింగ్‌కు సమన్లు వచ్చిన తర్వాత సంఘీభావం తెలిపేందుకు సోనియా గాంధీ నేతృత్వంలో పార్టీ కార్యాలయం నుండి మాజీ ప్రధాని ఇంటికి కాంగ్రెస్ మార్చ్ జరిగింది.
ఈ విధంగా మల్లికార్జున్ ఖర్గే ఇప్పుడు పార్టీకి కొత్త చీఫ్ అని గాంధీ కుటుంబం సందేశం పంపాలని కూడా భావించింది. కాంగ్రెస్‌లోని ప్రతి సభ్యుడిలాగే తాను కూడా ఖర్గేకు రిపోర్ట్ చేస్తానని అంతకుముందు రాహుల్ గాంధీ తెలిపారు. కొత్త కాంగ్రెస్ చీఫ్ ఎవరనే ప్రశ్నకు రాహుల్ గాంధీ స్పందిస్తూ.. పార్టీలో నా పాత్రను కొత్త అధ్యక్షుడే నిర్ణయిస్తారని తెలిపారు.
Rahul gandhi: ఏపీలో వైసీపీతో పొత్తు పెట్టుకుంటారా?..రాహుల్ గాంధీ రియాక్షన్ ఇదే..
PM Modi: రెడ్ కార్నర్ నోటీసులను వేగవంతం చేయాలి.. ఇంటర్‌పోల్‌కు ప్రధాని మోదీ సూచన..
గత 24 ఏళ్లలో తొలిసారిగా నెహ్రూ గాంధీ కుటుంబానికి చెందని వ్యక్తి కాంగ్రెస్‌కు అధ్యక్షుడయ్యారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి కాంగ్రెస్‌కు నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందిన వారే ఎక్కువగా నాయకత్వం వహిస్తున్నారు. సోనియా గాంధీ కంటే ముందే శశిథరూర్ ఖర్గే నివాసానికి చేరుకున్నారు. ఫలితాలు ఎలా ఉన్నా చివరకు పార్టీని బలోపేతం చేసిందని థరూర్ అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Congress, Mallikarjun Kharge, Sonia Gandhi